చిత్రం: వారసత్వం (1964) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి, గిరిజ దర్శకత్వం: తాపీ చాణక్య నిర్మాతలు: మంగళంపల్లి బ్రదర్స్ ( శాస్త్రి , యం. రంగా) విడుదల తేది: 19.11.1964
Songs List:
పేరైనా అడుగ లేదు పాట సాహిత్యం
చిత్రం: వారసత్వం (1964) సంగీతం: ఘంటసాల సాహిత్యం: నార్ల చిరంజీవి గానం: పి. సుశీల. పేరైనా అడుగ లేదు ఊరైనా అడుగ లేదు మనసేమో అతని విడిచి మరలి రాదాయె వెతలన్నీ ఆతనికే వినిపించా నెందులలో వెన్ను తట్టి మురిపించి వెలిపోయాడతడెవరో కలవరమో కలకలమో కలిగింది నాలో ... తగవో చిరునగవో అది బెదరింపో లాలింపో తెలియనీక నవ్వించీ గిలిగింతల కవ్వించే కనుల కైన కలనైనా కనిపించేవని ఆశ! ఇంతై మరి అంతై అది నూరింతల వింతై గుస గుసలేవో సలిపీ కొసరి కొసరి వూరించే
సుడి గాలిలో పాట సాహిత్యం
చిత్రం: వారసత్వం (1964) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆరుద్ర. గానం: పి. లీల సుడి గాలిలో చిరుదీపము మనజాల లేదోయీ నా ఆశ నీరాయే అది నట్టేట పాలాయే నాలోని ప్రేమ లోలోన కుమిలి తానారి పోవునోయి పాలించు వారేరీ మొర ఆలించు వారేరి? నీ సేవకూడ నే నోచలేదా ఈ జన్మ చాలు చాలు
ప్రేయసీ మనోహరీ పాట సాహిత్యం
చిత్రం: వారసత్వం (1964) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, సుశీల రఘు: ప్రేయసీ మనోహరీ వరించి చేరవే తీయనీ మనోరథం నా ఫలింప జేయనే చరణం: 1 దరిజేరి పోవ నేల హృదయ వాంఛ తీరు వేళ తారకా సుధాకరా తపించ సాగెనే ... హాయిగా మనోహరా వరించి చేరుమా చరణం: 2 మురిసింది కలువ కాంత చెలుని చేయి సోకినంత రాగ మే సరాగమై ప్రమోద మాయెనే హాయిగా మనోహరా వరించి చేరుమా చరణం: 3 ఆ హాహాహ..... హాహాహ ఆ హాహాహ.... హాహాహ పెనవేసె మల్లెతీగా మనసులోన మమతరేగె ఊహలూ వయ్యారమూ - నా ఉయ్యాల లూగానే రము: పేయసీ మనోహరీ వరించి చేరవే
చిలిపి కృష్ణునితోటి పాట సాహిత్యం
చిత్రం: వారసత్వం (1964) సంగీతం: ఘంటసాల సాహిత్యం: నార్ల చిరంజీవి. గానం: ఘంటసాల, పి. లీల రఘు: చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ ఆ స్వామితో నీవు అన్నింట సాటి జో జో.... జో జో.... చెరసాలలో పుట్టి రేపల్లెలో వెలసి గొల్ల తల్లుల మనసు కొల్లగొని నాడు ఏ తల్లి వొడిజారి ఏలాగు చేరావొ ఆపద లె కాపుదల లాయేనె నీకు జో అచ్యుతానంద జోజో ముకుందా రార పరమానంద రామగోవిందా జోజో పలు వేసములు పూని పగవారు హింసింప బల్ పోకడలు చూసి బాలగోపాలుడు రఘు: ఈ యీడు కే ఎన్ని గండాలు గడిచాయొ ఎంత జాతకుడమ్మ అనిపించినావు జో అచ్యుతానంద జో జో ముకుందా రార పరమానంద రామగోవిందా కాళింది పొగరణచి కంసుణ్ణి పరిమార్చి కన్న వారికి చెరలు తొలగించినాడు రఘు: వసుదేవ తనయుని వారసత్వము నిలిపి నీవారి వేతలెల్ల నీవె తీర్చేవు ఇద్దరు: చిలిపి కృష్ణునితోటి చేసేవు పోటీ ఆ స్వామితో నీవు అన్నింటసాటి జో జో.... జో జో....
ఇచట నే ఇచట నే పాట సాహిత్యం
చిత్రం: వారసత్వం (1964) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల శాంత : ఇచట నే ఇచట నే విరసె మొదటి ప్రేమ ఇపుడె వేడి కంటినీరు విడి చె చందమామ | మనసులోని అనురాగము మనవి చేసుకొంటినీ దోచుకొనిన అతని ప్రేమను నేను దాచుకొంటినీ తాను నన్ను చేరగానె మోము వాల్చుకొంటినీ తేనెలూరు కోరికలె మదిని నోచుకొంటినీ వింత వింత ప్రణయ కాంతి వెలుగుచున్న సీమలో యింతలో పెనుచీకటి ఆవరించ సాగనే ప్రేమనగరు పోవదలచి, పయన మైన దారిలో మొదటి అడుగు వేయునపుడె నడక ఆగిపోయెనే
నీమీద మనసాయెరా పాట సాహిత్యం
చిత్రం: వారసత్వం (1964) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆరుద్ర. గానం: రాణి. నర్తకి: నీమీద మనసాయెరా ముద్దు చెల్లించరా నడిరేయి దాటింది చలిగాలి వీచింది రావేల రావేల రావేలరా చిరునవ్వు నవ్వి కులికింది భామ ఒలికింది ఒయ్యారమే ! హాయ్! ఈ రేయి రాకున్న నే తాళ జాల కవ్వించి కవ్వించి నవ్వించరా ! ఆహా ! కవటాకు చీరి చిలకల్లు చుట్టి తాంబూలమిచ్చేనురా ! హోయ్ ! నీ నోరు నా ప్రేమ పండాలి రాజా! నా నీటు నా గోటు నీ సొమ్మురా ! ఆహ!
మనగుట్టే నిలుపుకోవాలి పాట సాహిత్యం
చిత్రం: వారసత్వం (1964) సంగీతం: ఘంటసాల సాహిత్యం: నార్ల చిరంజీవి. గానం: ఘంటసాల, సుశీల. శాంత : మనగుట్టే నిలుపుకోవాలి నీ మారాము గుణమే మానాలీ జాలిపడి నిన్ను కొని తెచ్చి నాను నీకు మే లెంచి చోటిచ్చినాను నీవు నా పరువు నిలబెట్టవోయి ఇంక నీ బరువు నామీద ఉందోయి రఘు: ఎవరేమన్నా దిగులెంతున్నా అన్నీ మరిపించేవు, బోసి నవ్వుల మురిపించేవు నవ్వుతు కేరుతు ఆడిపాడి నన్నలరించిన బాబూ ఏమైనావో ఎందున్నావో ఏ ఇడుమలబడి నలి గేవో ! సీత: నవమాసాలు నిను మోసింది కన్నీ రీదుట కేనా? కన్నమ్మను నేకానా ? జాడలు తెలిసీ రాలే నైతి క్షణమే యుగమై పోయె ఇంకెన్నాళ్ళకు బంగరు తండ్రీ నా కనులకు కనిపించేవో? శాంత: చిన్న దొరగారు నిదురిస్తే మేలు ఉత్త దోబూచులాటలు చాలు నిద్ర కన్నె లే దీవింతురోయి ఒక్క తియ్యన్ని ముద్దీయవోయి
No comments
Post a Comment