చిత్రం: విచిత్ర బంధం (1972) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: నాగేశ్వరరావు, వాణిశ్రీ, అంజలిదేవి, లీలా రాణి, విజయ, రాధకుమారి కథ: యద్దనపూడి సులోచనారాణి మాటలు: ఆచార్య ఆత్రేయ దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు నిర్మాత: డి.మధుసూదనరావు విడుదల తేది: 12.10.1972
Songs List:
చీకటి వెలుగుల రంగేళి పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర బంధం (1972) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశలవెలిగించు దీపాల వెల్లి చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అక్కయ్య కన్నుల్లో మతాబులు ఏ చక్కన్నిట్ బావతో జవాబులు మాటల్లో వినిపించు చిటపటలు మాటల్లో వినిపించు చిటపటలు ఏమనసునో కవ్వించు గుసగుసలు లల్లలా హహహా ఆ ఆ ఆ చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు బావా బావా పన్నీరూ బావను పట్టుకు తన్నేరు బావా బావా పన్నీరూ బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పేరు వీసెడు గుద్దులు గుద్దేరు అహహహహ చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అమ్మాయి పుట్టింది అమాసనాడు అసలైన గజదొంగ అవుతుంది చూడు పుట్టిన రోజున దొరికాడు తోడు పున్నమినాటికి అవుతాడు తోడు అహహ అహహహ అహ ఆ ఆ ఆ చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి
భళి భళి వినరా ఆంధ్రకుమారా పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర బంధం (1972) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, సుశీల & బృందం భళి భళి వినరా ఆంధ్రకుమారా భాగ్యనగర్ గాథా కోరస్ : మన రాజధాని గాథా వలపులవంతెన మూసీ నదిపై వెలసినట్టి గాథ కోరస్: మన రాజధాని గాథా గోలుకొండను ఏలుచుండెను గొప్పగమల్కిభరాం కోరస్: గొప్పగ మల్కిభరాం ఆతని కొడుకు అందాల రాజు కులీ కుతుట్ షా కోరస్: కులీ కుతుబ్ షా చంచలపల్లెను వసించుచుండెను నర్తకి భాగమతి కోరస్: నరకి భాగమతి సరసుడు యువరాజామెను చూసి మనసునిచ్చినాడు కోరస్: తందాన తాన తాన తందనాన కనుల జల్లుల కారు మబ్బులు కాటుకలద్దిన కన్నులు మబ్బు విడిచిన చంద్రబింబము మగువ చక్కని వదనము మెల్ల మెల్లగ హృదయ వీణను మీటగలవీ లేత వేళ్లు ఘల్లు ఘల్లున గుండె ఝల్లన కదలి ఆడును కన్నెకాళ్లు అందరి కన్నులు నామీద నా కన్నులు మాత్రం నీమీద, నీమీద, నీమీద, నీమీద కాసులు విసిరే చేతులకన్నా కలసి నడిచే కాళ్ళేమిన్న మనుగడకోసం పాడుతువున్నా మనసున నిన్నే పూజిస్తున్నా నింగివి నీవు రంగుల హరివిల్లు నీవు పూర్ణిమ నీవు పొంగే కడలివి నీవు నీ మువ్వలలో నీ నవ్వులలో మురిసింది మూసీ విరిసింది నీ ప్రణయదాసి రారా నా ప్రియతమా రారా నా హృదయమా నా వలపే నిజమైతే ఈ పిలుపు నీవు వినాలి నేనీ యిలలోన - నువ్వా గగనాన మూసీనది చేసినది ప్రళయ గర్జన పెను తుపాను వీచినా ఈ ప్రమాదం ఆగిపోదురా వరద వచ్చి ముంచినా ఈ బ్రతుకు నీది నీదిరా పిలుపును విన్న యువరాజు పెటపెటలాడుచు లెచెను ఎదురైన పహరావారిని ఎక్కడికక్కడ కూల్చెను ఉరుముల మెరుపుల వానలో ఉరికెను మూసీ నది వైపు ఆవలి ఒడ్డున భాగమతి ఈవల ప్రేమ సుధామూర్తి ప్రియా ఓ ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా అను పిలుపులు దద్దరిల వరద నెదిర్చి నలపు జయించి ఒదిగిరి కొగిలితో మల్కిభరామా పవిత్రప్రేమకు సునసు మారిపోయి చార్మినారూ పురానపూలు చరితగ నిర్మించే భాగమతి పేరిట వెలసెను భాగ్యనగరమపుడు భాగమతి పేరిట వెలసెను భాగ్యనగరమపుడు కోరస్ : మన రాజధాని యిపుడు - మన రాజధాని యిపుడు
వయసే ఒక పూలతోట పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర బంధం (1972) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దాశరధి గానం: వి.రామక్రిష్ణ, పి.సుశీల వయసే ఒక పూలతోట వలపే ఒక పూలబాట ఆ తోట లో ఆ బాటలో పాడాలి తియ్యని పాట పాలబుగలు ఎరుపైతే లేత సిగ్గులు ఎదురైతే రెండు మనసులు ఒకటైతే పండు వెన్నెల తోడైతే కోరికలే తీరేనులే పండాలి వలపుల పంట నీ కంటి కాటుక చీకటిలో పగలు రేయిగ మారెనులే నీ కొంటె నవ్వుల కాంతులలో రేయి పగలై పోయెనులే నీ అందము నా కోసమే నీ మాట ముద్దుల మూట పొంగిపోయే పరువాలు నింగినంటే కెరటాలు చేరుకున్నవి తీరాలు లేవులే ఇక దూరాలు ఏనాటికీ మనమొక్కటే ఒకమాట ఇద్దరినోట
చిక్కావు చేతిలో చిలకమ్మా నీవు పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర బంధం (1972) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: వి.రామక్రిష్ణ చిక్కావు చేతిలో చిలకమ్మా నీవు ఎక్కడికీ పోలేవు ఆగవమ్మా నీ కోరచూపు చూచి బెదరి పోదునా కస్సు బుస్సు మనగానే అదిరిపోదునా పొగరంతా అణిగిందా బిగువంతా తగిందా తప్పు ఒప్పుకుంటావా చెంపలేసుకుంటావా కల్ల బొల్లి మాటలతో కైపెక్కిస్తావా హొయలు వగలు చూపించి వల్లో వేస్తావా నాటకాలు ఆడేవా నవ్వులపాలు చేశేవా నీ టక్కులు సాగవమ్మా నీ పప్పులు ఉడకవమ్మా మోసాన్ని మోసంతోటే పందెమేసి గెలిచాను వేషానికి వేషం వేసీ ఎదురుదెబ్బ తీశాను గర్వాన్ని వదిలించీ కళ్లు బాగా తెరిపించి కాళ్ళ బేరానికి నిన్నూ రప్పించాను
అందమైన జీవితము పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర బంధం (1972) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల అందమైన జీవితము అదాల సౌధము చిన్నరాయి విసిరినా చెదరిపోవును ఒక్క తప్పు చేసినా ముక్కలే మిగులును నిప్పువంటి వాడవు తప్పుచేసినావు ఎంత తప్పు చేసినావు క్షణికమైన ఆ వేళం మనసునే చంపింది నిన్ను పశువుగా మార్చింది నీ పడుచుదనం దుడుకుతనం పంతాలకి పోయింది పచ్చనైన నీ బ్రతుకును పతనానికి లాగింది నిన్ను బలిపశువును చేసింది. ఎవరిది ఈ నేరమని ఎంచి చూడదు లోకం ఎంచి చూడదు ఏదో పొరపాటని మన్నించదు నిన్ను మన్నించదు అంటాకు వంటది ఆడదాన శిరము ముల్లు వచ్చి వాలినా తాను కాలు జారినా ముప్పు తనకె తప్పదు ముందు బ్రతుకె వుండదు
చల్లని బాబూ పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర బంధం (1972) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దాశరధి గానం: ఘంటసాల, పి.సుశీల చల్లని బాబూ నా అలరీ బాబూ నా కంటి పాపవు నీవే మా యింటి దీపం నీవే పంచవన్నెల రామచిలకను పలకరించబోయేవు వింతచేష్టల కోతుల చూసి గంతులెన్నో వేసేవు నీ పలుకులు వింటూ పరుగులు చూస్తూ పరవశ మై పోతాను చల్లని బాబూ, నా అల్లరి బాబూ నా కంటిపాపవు నీవే మా యింటి దీపం నీవే ఎన్నెన్నో ఆశలతోటీ ఎదురు చూస్తూ వున్నాను వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబు తాను అమ్మా నాన్నల అనురాగంలో అపురూపంగా పెరిగేవు నీ బాబును తల్లి ఆదరించునని భ్రమపడుతున్నావా చితికిపోయిన మగువ మనసులో మమతలు వెతికేవా నీవు చేసిన అన్యాయాన్ని మరిచిందనుకున్నావా నీ ఆలోచనలు అనుబంధాలు అడియాసలు కావా
చీకటి వెలుగుల రంగేళీ (Sad Version) పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర బంధం (1972) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళీ ఈ జీవితమే ఒక దీపావళీ అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల అణగార్చి తెలవారు అమవాసరేయి అక్కయ్య కన్నుల్లో మతాబులు అవి అణగారి మిగిలాయి కన్నీళ్లు కలకాలం వుండవు ఈ కలతలు కన్నీళ్లే కాగలవు చిరునవ్వులు చితికిన బ్రతుకున చిరునవ్వు రాదు ముగిసిన కథమార్చి విథి వ్రాయబోదు గతమును మరచి బ్రతుకును ప్రేమించు విధినెదిరించి సుఖమును సాధించు
అమ్మా, అమ్మా అని పిలిచాను పాట సాహిత్యం
చిత్రం: విచిత్ర బంధం (1972) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: పి.సుశీల అమ్మా, అమ్మా అని పిలిచాను ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు ఏ తల్లి కన్న బాబువో నా కాళ్ళకు బంధ, అయినావు ఎవరికి మనసివ్వని దానను ఏ మమతకూ నోచుకోని బీడును మోడులా యీ బ్రతుకును మోశాను నీ ముద్దు మోము చూచి మరల మొలకెత్తాను కన్నతల్లి ఎవ్వరో ఎరుగవు నువ్వు కడుపు తీపి తీరని తల్లిని నేను కాలమే ఇద్దరినీ కలిపింది ఎందుకో ఒకరి కొరత నింకొకరు తీర్చుకునేటందుకో
No comments
Post a Comment