Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Guna 369 (2019)





చిత్రం: గుణ 369 (2019)
సంగీతం: చైతన్ భరద్వాజ
నటీనటులు: కార్తికేయ, అనఘ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాతలు: అనీల్ కడియాల, తిరుమల రెడ్డి
విడుదల తేది: 02.08.2019



Songs List:



బుజ్జి బంగారం పాట సాహిత్యం

 
చిత్రం: గుణ 369 (2019)
సంగీతం: చైతన్ భరద్వాజ
సాహిత్యం: అనంత్ శ్రీరామ్
గానం: నకాష్ అజీజ్, దీప్తి పార్థసారథి

కలలో కూడా కష్టం కదే ఈ హాయి
కథ మొత్తం తిప్పేశావే అమ్మాయి

వదలకుండ పట్టుకుంటా నీ చెయ్యి
నువ్వట్టా నచ్చేశావోయ్ అబ్బాయి

నమ్మలేక నమ్మలేక నన్ను గిచ్చుకుంటున్నా
నొప్పి పుట్టి ఎక్కళ్లేని సంతోషంలో తుళ్లుతున్నా
నవ్వలేక నవ్వలేక పొట్ట పట్టుకోనా
పిచ్చిపట్టి నువ్వేసే చిందుల్నే చూస్తున్నా

తప్పదింక భరించవే 
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం చల్లుతుంది తీపి కారం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం తెంచుతుంది సిగ్గు దారం

సొంత ఊరిలో కళ్ల ముందరే
కొత్త దారులెన్నో పుట్టాయే
అంతేలేరా జంటగుంటే అంతేలేరా
సొంతవారితో ఉన్న నిన్నలే
గుర్తురాము పొమ్మనన్నాయే
జతలో పడితే జరిగే జాదూ ఇదేగా

ముద్దులెన్నో పెట్టాలిగా
పెట్టి గాల్లో పంపాలిగా
ఊపిరంతా గంధమైపోయేంతగా
ముందుకొచ్చే ఉన్నానుగా
ఎందుకమ్మా ఇంకా దగా
నన్ను మళ్లీ మళ్లీ ఊరించేంతగా

తప్పదింక భరించరా 
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం మించిపోతే పెద్ద నేరం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం పెట్టమాకు అంత దూరం

నిన్ను తాకితే ఒక్కసారిగా
పట్టుకుంది నన్ను అదృష్టం
చాల్లే చాల్లే ఎక్కువైంది తగ్గించాల్లే
ఉన్న జన్మనీ ముందు జన్మనీ
చుట్టి ఇచ్చినాను నీ ఇష్టం
అడెడే అదిగో ముదిరే పైత్యం అదేలే

ఎన్నో ఎన్నో అన్నారులే
ఎన్నో ఎన్నో విన్నాములే
వట్టి మాటల్లోనే ఎన్నో వింతలే
సర్లే సర్లే చెప్పావులే
సందు సందు తిప్పావులే
వచ్చి చేతల్లోనే చూపిస్తా భలే

తప్పదింక భరించనా
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ యవ్వారం నచ్చుతుంది శుక్రవారం
నా బంగారం బుజ్జి బుజ్జి బంగారం
నీ వయ్యారం గుచ్చుతుంది పూలహారం



తొలి పరిచయమా ఇది పాట సాహిత్యం

 
చిత్రం: గుణ 369 (2019)
సంగీతం: చైతన్ భరద్వాజ
సాహిత్యం: శుభం విశ్వనాధ్ 
గానం:హరిచరణ్ 

ఉదయించిన వేకువలోనా
నయనంలొ తొలికలవై
అలలెగిసిన గుండెలలోన
ఊహలకె ఊపిరివై
మది చేరి ముంచకె
మనసుని మత్తుగా…

ఉదయించిన వేకువలోనా
నయనంలొ తొలికలవై
అలలెగిసిన గుందెలలోన
ఊహలకె ఊపిరివై
మది చేరి ముంచకె
మనసుని మత్తుగా…

నాకె యెమైయిందొ
తెలుస నీకు కలలె కంటున్న
ఏమొ ఏమౌతుందొ అర్తంకాని
కలవరమనుకోనా

తొలి పరిచయమా ఇది
తొలి పరవషమా ఇది
అలుపెరగని ఆశతొ మనసెందుకొ
నిను చేరమన్నది
తొలి పరిచయమా ఇది
తొలి పరవషమా ఇది
అలుపెరగని ఆశతొ మనసెందుకొ
నిను చేరమన్నదీ

ఆశలె పెంచుకున్న అవునా
శ్వాసగా మార్చుకున్న ప్రేమా
నన్నల చూసి గుండెనె కోసి
అంత వేదించకె..
నీడల సాగుతున్న
తోడుగ వెంటరాన
యెప్పుడు నిన్ను వీడలెనంటూ
సంతకం చేయనా..
కనులెదురె కవ్విస్తున్న
నగవులతొ ఊరిస్తున్న
నా ప్రతి అడుగు నీకై వేస్తున్నా..

తొలి పరిచయమా ఇది
తొలి పరవషమా ఇది
అలుపెరగని ఆశతొ మనసెందుకొ
నిను చేరమన్నది
తొలి పరిచయమా ఇది
తొలి పరవషమా ఇది
అలుపెరగని ఆశతొ మనసెందుకొ
నిను చేరమన్నదీ..

మనసులొ దాచుకున్న
అలలుగ పొంగుతున్న
చేరువె కావు తీరమై రావు
యెందుకె నేస్తమా..
మేఘమై సాగుతున్న
చినుకుల మారుతున్న
గొడుగులా మారి అడుగు వేసావు
అందవేం..అందమా..
చూపులకు వూరిస్తున్న
మౌనంగ వేదిస్తున్న
నా అనువనువు నీకె ఇస్తున్నా..

తొలి పరిచయమా ఇది
తొలి పరవషమా ఇది
అలుపెరగని ఆశతొ మనసెందుకొ
నిను చేరమన్నది
తొలి పరిచయమా ఇది
తొలి పరవషమా ఇది
అలుపెరగని ఆశతొ మనసెందుకొ
నిను చేరమన్నదీ..



మనసుకిది గరళం గరళం పాట సాహిత్యం

 
చిత్రం: గుణ 369 (2019)
సంగీతం: చైతన్ భరద్వాజ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ యేసుదాస్ , శ్వేతా మోహన్ 

మనసుకిది గరళం గరళం
సెకనుకొక మరణం మరణం
యెదుట నిను చూడలేని
ప్రాణమంత కలవరం

కలలకిది విలయం విలయం
నలిగినది హ్రుదయం హ్రుదయం
బతుకు బరువైన చేదు
వెదనంత చెరిసగం

దిగులు పెడుతోంది అలజడి
గగనమొక పిడుగై పైబడి
అదుపు చెదిరింది యెద సడి
ప్రళయమై వులికిపడి

నువ్వంటు లేని కన్నీటి బాష
మిన్నందలేని సంధ్రాల గోష
దిష తెలియదె నిషి చెరగదె
నిను కలవటం ఎల…

నిరాస లోను నీదెలె ద్యాసా..
నిట్టుర్పులోను నువ్వేలె శ్వాస
యెటు విడుదల..తెలియని వలా
నలు చెరుగుల యేంటిలా…

నిదర రాని కన్నుగా…
రగిలింది బాధ
నిన్న మొన్నలా..నీతొ…
నే లేను కదా

జనమ జతగ విడిపోని మనం
కలతలోను కలిసి వున్నాం
విధికి బలిగ వొదిగుంది పాపం
మన ప్రేమ పావురం

మొదటిపుట లోనె తడబడి
వలపు కథ విలపిస్తున్నది…
తుదకు యెటువైపొ తెలియని
పయాణమై…కదిలినది

నువ్వంటు లేని కన్నీటి బాష
మిన్నందలేని సంధ్రాల గోష
దిష తెలియదె నిషి చెరగదె
నిను కలవటం యెలా….

నిరాస లోను నీదెలె ద్యాసా..
నిట్టుర్పులోను నువ్వేలె శ్వాస
యెటు విడుదల..తెలియని వలా
నలు చెరుగుల యెంటిలా…



దేవేరీ.. పాట సాహిత్యం

 
చిత్రం: గుణ 369 (2019)
సంగీతం: చైతన్ భరద్వాజ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: గౌతం భరద్వాజ్ రమ్య బెహ్రా

దేవేరీ.. నువ్వె నా ఊపిరి
నీ కోసం పుట్టాడి ప్రేమ పుజారి . . .

దేవేరీ.. జన్మ నీదే మరి
నితోనె.. వందేల్ల పూల రాదారి

నువ్వంటే నేను
నీ వెంటె నేను సదా . .
నిజమిది నిజం . . .
ఇరువురమొకరె . . మనం . .
దీవెనలిది తధాస్తని
పలికెనె . . శుభ సమయం . .

తనువుల సగం . .
ఒకటిగ వొదిగె . . క్షణం
నీ మధువుల పెదాలకె
పరిణయం . . మధుర మయం . .

నువ్వు నాకు విలువైన కానుక
లేదు జీవితం నువంటు లేక
ఉండలేను నిన్ను చూడక
కాంతి నీవె కద నాయకా

నువ్వె నాకు ప్రత్యేకం
నీతొ ఉంది నా లోకం
లేనిదేది లేదె ఇక
నువ్వు పూల మాసం
నీతొ సావాసం
కావాలి కడ దాకా

నిజమిది నిజం . . .
ఇరువురమొకరె . . మనం . .
దీవెనలిది తధస్తని
పలికెనె . . శుభ సమయం . .

తనువుల సగం . .
ఒకటిగ వొదిగె . . క్షణం
నీ మదువుల పెదాలకె
పరిణయం . . మధుర మయం



ఢమరుక పాట సాహిత్యం

 
చిత్రం: గుణ 369 (2019)
సంగీతం: చైతన్ భరద్వాజ
సాహిత్యం: శుభం విశ్వనాధ్ 
గానం: కాలభైరవ 

ఢమరుక ఢమరుక ఢమరుక బాజె
ఢమర ఢమర డం డం డం రె
ప్రలయం విలయం పరుగులు పెడితె
బలిర బలిర కి జగ చోరె
ఢమరుక ఢమరుక ఢమరుక బాజె
ఢమర ఢమర డం డం డం రె

ఉరుములు మెరుపులు ఉరుకులు పెడితె
భలిర భలిర అసూరాక్షుకుర్
విరాతకాలె క్రుషించిపోగ
త్రిషూల రుధ్రుడు తెగబడితె
అరాచకాలె హరించిపోవ
త్రినేత్రుడింక యగబడితె
దురగతాలె దహించిపోవ
దయామయుడిలొ సెగ పుడితె
వినాషానాలె నశించిపోవ
విశాల హ్రుదుయుడు పగపడితె…

బలి బలి బలి బలి బలి ర
బలి బలి బల బల బలి బలి
బలి బలి బలి ర
బలి బలి బలి బలి బల బల బలి బలి
బలి బలి బలి ర
బలి బలి బలి బలి బల బల
బలి బలి బలి బలి బల బల బలి బలి

దిక్కుల చరనమిది
దుర్గున హరణమిధి
జటా జూటుడె పరాక్రమించిన
శ్మషాన క్షేత్రమిది
నిస్చల ప్రనవమిది
నిర్భయ నటనమిది
హలాహలాన్నె స్కలించనున్న
దీక్షుని రౌద్రమిధి




ఉసురేమో తీసేసింది పాట సాహిత్యం

 
చిత్రం: గుణ 369 (2019)
సంగీతం: చైతన్ భరద్వాజ
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి 
గానం: మోహన్ భోగరాజ్ 


ఉసురేమో తీసేసింది 

Palli Balakrishna Tuesday, August 13, 2019
Rakshasudu (2019)


Palli Balakrishna

Most Recent

Default