Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Entha ManchiVvadavura (2019)








చిత్రం: ఎంత మంచివాడవురా! (2020)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఎస్ పి బాలసుబ్రమణ్యం
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, మెహ్రీన్ పిర్జాద
దర్శకుడు: సతీష్ వేగేశ్న
నిర్మాత: ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా
విడుదల తేది: 15.01.2020

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం

చేయందుకుందాం చిగురంత ధైర్యమై
భరోసానిద్దాం పద మనో బలమై
మనుషులం మనందరం
ఏకాకులం కాదే ఎవ్వరం
మంచితనం మన గుణం
పరస్పరం సాయం కాగలం

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం

ఏ రక్త బంధం లేకున్నా గాని
స్పందించగలిగిన స్నేహితులం
ఈ చోటి ప్రేమ ఏ చోటికైనా
అందించగలిగిన వారదులం
ఓ గుండె నిప్పును ఆర్పడం ఆపడం కదా ఉపకారం
వేరెవరి హాయికో జోలాలి పాడడం ఆహా ఎంత వరం

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం

ఖాలీలెన్నెన్నో పుట్టించేస్తుంది
ఖాలీగా ఉండలేని కాలమిది
మనసైనదాన్ని మాయం చేస్తుంది
తప్పించుకోలేని జాలమిది
ఆలోటు తీర్చగా ఇపుడూ ఎపుడూ 
మనం ముందుందాం
కష్టాల బరువును తేలికపరిచే 
భుజం మనమవుదాం

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో
ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధముందో
బంధువుల సంఖ్య పెంచుకుందాం







చిత్రం: ఎంత మంచివాడవురా! (2020)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: రాహుల్ సిప్లిగంజ్, సాహితి చాగంటి

మంచి వాడితో మేజువానిరో
మోజువానిలా రాజుకుందిరో

జాతరో జాతరో నేనొస్తె జాతరో
పరువాల మోత మోగనీ రొ
పూతరో పూతరో బంగారు పూతరో
నామేని మెరుపు చూసుకో రొ

ఊరోల్ల కుర్రోల్ల వురక చెప్పునమ్మో
అసలైన పండగేదో
నిప్పులోన పడ్డాకే నిగ్గు తేలునమ్మో
సిసలైన పుత్తడేదో

చెఱకు ముక్కేరా పక్కా నా చెక్కిలి 
ఏంచక్క కొరికి పో రొ
పాతికెకరాల బిట్టు నా నడుమొంపు 
చుట్టూ తిప్పుకో రొ

ఓసారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చుమీ
చదివించుకున్నాక సొమ్ము లిచ్చిమి

ఓసారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చుమీ
చదివించుకున్నాక సొమ్ము లిచ్చిమి

జాతరో జాతరో నేనొస్తె జాతరో
పరువాల మోత మోగనీ రొ
పూతరో పూతరో బంగారు పూతరో
నా మేని మెరుపు చూసుకో రొ

కుస్తీ పోటిల్లో వస్తాదులే ఎందరో 
నా చిరు కోకతో కుస్తీ పట్టలేరే
రుస్తుంగాల్లనే బస్తీ గాల్లు ఎందరో 
నా చిరు ముద్దుకే కిస్తీ కట్టలేరే

పౌరుషమున్నోడి పట్టు ముందర 
చిత్తై పోదా నీకోక తొందరా
పందెంకోడంటి పొగరు సుందరా
అయితే నీలోని పదును చూపరా

ఓసారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చుమీ
చదివించుకున్నాక సొమ్ము లిచ్చిమి

చుట్టూ గోదారే జిగేలంటు ఉందిగా
ఏంటే నీజోరే దానికంటె గొప్పా
డప్పే కొట్టామో హుషారెక్కి పోద్దిగ్గా
ఏంటే నీ తబల దానికంటె మెప్పా

గోదారందాలే గట్టూ దాటవోయ్
నాతో సరసాలకి హద్దులుండవోయ్
డప్పుని కాదుర నా లిప్పును తాకరా
ఉరకలు పుట్టించే నిప్పు చురకరా

ఓసారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
నీ యవ్వారం ఫేకు లచ్చిమి
నీతోటి సెట్టవదే డోంట్ టచ్ మీ

జాతరో జాతరో నేనొస్తె జాతరో
పరువాల మోత మోగనీ రొ
పూతరో పూతరో బంగారు పూతరో
నా మేని మెరుపు చూసుకో రొ

ఊరోల్ల కుర్రోల్ల వురక చెప్పునమ్మో
అసలైన పండగేదో
నిప్పులోన పడ్డాకే నిగ్గు తేలునమ్మో
సిసలైన పుత్తడేదో

చెఱకు ముక్కేరా పక్కా నా చెక్కిలి 
ఏంచక్క కొరికి పో రొ
పాతికెకరాల బిట్టు నా నడుమొంపు 
చుట్టూ తిప్పుకో రొ

ఓసారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చుమీ
చదివించుకున్నాక సొమ్ము లిచ్చిమి

ఓసారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
నీ యవ్వారం ఫేకు లచ్చిమి
నీతోటి సెట్టవదే డోంట్ టచ్ మీ







చిత్రం: ఎంత మంచివాడవురా! (2020)
సంగీతం: గోపి సుందర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రేయా ఘోషల్

అవునో తెలియదు కాదో తెలియదు
ఏం నవ్వో ఏమో మొగమాటం పోదా
వయసుకు మెలకువ రాలేదా
అవునో తెలియదు కాదో తెలియదు, 
ఏం నవ్వో ఏమో మొగమాటం పోదా
వయసుకు మెలకువ రాలేదా

చెలిమంటే తమరికి చేదా
తగు వరసై వస్తున్నాగా
ఒక మంచి మాట అని 
మంచివాడివనిపించుకో చక్కగా

వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా

అవునో తెలియదు కాదో తెలియదు
ఏం నవ్వో ఏమో మొగమాటం పోదా
వయసుకు మెలకువ రాలేదా

కొంచెం తొలగవే తెరమరుగా
ప్రాయం త్వరపడే తరుణమిదేగా
చులకనాయనా లలల లాలల
ఏం ఎందుకు ఆ మౌనం

వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా

అవునో తెలియదు కాదో తెలియదు
ఏం నవ్వో ఏమో మొగమాటం పోదా
వయసుకు మెలకువ రాలేదా

నాతో కలిసిరా కాదనక
నేనే నిలువునా కానుక కాగా
సహజమే కదా చిలిపి కోరిక
ఏం కాదు కదా నేరం

అవునో తెలియదు కాదో తెలియదు
ఏం నవ్వో ఏమో మొగమాటం పోదా
వయసుకు మెలకువ రాలేదా

చెలిమంటే తమరికి చేదా
తగు వరసై వస్తున్నాగా
ఒక మంచి మాట అని 
మంచివాడివనిపించుకో చక్కగా

వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా
వద్దంటే వదులుతానా, విడవని ముడిపడనా



No comments

Most Recent

Default