Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gaddalakonda Ganesh (2019)





చిత్రం: గద్దలకొండ గణేష్ (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
నటీనటులు: వరుణ్ తేజ్ , పూజా హెగ్డే
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాతలు: రామ్ అచంట, గోపి అచంట
విడుదల తేది: 20.09.2019



Songs List:



జర్ర జర్ర పాట సాహిత్యం

 
చిత్రం: గద్దలకొండ గణేష్ (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: భాస్కర్ భట్ల 
గానం: అనురాగ్ కులకర్ణి , ఉమా నేహా

జర్ర జర్ర అచ్చ
జర్ర జర్ర గజ్జ
నేను ఇంతె చిచ్చ
యే చంద్రుడికైన లేద మచ్చ
చెయ్యి పడితె లక్ష
కాలు పెడితె రచ్చ
నకరాల్ జేస్తె బచ్చ
నే నారల్ దీసేటందుకె వచ్చ

సిగ్గుకె అగ్గెట్టెయ్
బుగ్గకి ముద్దేటేయ్
గలగలలాడె గలాసుతోటి
కులాసలెన్నొ లెగ్గొట్టెయ్

చూపులు దిగ్గొట్టెయ్
లెక్కలు తెగ్గొట్టెయ్
గుడుగుడు గుంజం గలాటలోన
మంచి చెడ్డ మూలకి నెట్టెయ్
గిర గిర్ర గిర గిర
తిరిగె నడుమిది
కొర కొర చూపుకి
కర కర మన్నదిరో

సుపర్ హిట్టు నీ హైటు
సుపర్ హిట్టు నీ రూత్టు
సుపర్ హిట్టు హెడ్డ్ వైటు
సుపరు హిట్టు బొమ్మ హిట్టు
సుపర్ హిట్టు మీసం కట్టు
సుపర్ హిట్టు విభూది బొట్టు
సుపర్ హిట్టు ఈల కొట్టు
సుపర్ హిట్టు దంచి కొట్టు

జర్ర జర్ర అచ్చ
జర్ర జర్ర గజ్జ
నేను ఇంతె చిచ్చ
యే చంద్రుడికైన లేద మచ్చ
చెయ్యి పడితె లక్ష
కాలు పెడితె రచ్చ
నకరాల్ జేస్తె బచ్చ
నే నారల్ దీసేటందుకె వచ్చ

కెలికితె ఏక్ బార్
బద్దలె బాసింగాల్
దెబ్బకి సీన్ సితార్

ఎదుటోడి గుండెల్లొ
వనుకు వనుకు అది నీ ఆస్తి
నీ దమ్మె నీకున్న బందోబస్తి
యహె నచ్చింది యాదున్న
ఏక్ ధం యెసెస్త దస్తీ

సుపర్ హిట్టు నీ హైటు
సుపర్ హిట్టు నీ రూత్టు
సుపర్ హిట్టు హెడ్డ్ వైటు
సుపరు హిట్టు బొమ్మ హిట్టు
సుపర్ హిట్టు మీసం కట్టు
సుపర్ హిట్టు విభూది బొట్టు
సుపర్ హిట్టు ఈల కొట్టు
సుపర్ హిట్టు దంచి కొట్టు

జర్ర జర్ర అచ్చ
జర్ర జర్ర గజ్జ
నేను ఇంతె చిచ్చ
యే చంద్రుడికైన లేద మచ్చ
చెయ్యి పడితె లక్ష
కాలు పెడితె రచ్చ
నకరాల్ జేస్తె బచ్చ
నే నారల్ దీసేటందుకె వచ్చ




గగన వీధిలో పాట సాహిత్యం

 
చిత్రం: గద్దలకొండ గణేష్ (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: వనమాలి
గానం: అనురాగ్ కులకర్ణి , శ్వేతా సుబ్రహ్మణ్యం

నన ననానన
నన ననానన
నన ననానన
నన ననానన

గగన వీధిలో ఘన నిసీధిలో
మెరిసిన జత మెరుపుల
మనసు గీతిలొ మధుర రీతిలో
ఎగసిన పదముల
దివిని వీడుతు దిగిన వేలలొ
కలలొలికిన సరసుల

అడుగేసినారు అతిదుల్లా
అది చూసి మురిసె జగమెల్ల
అలలాగ లేచి పడుతున్నారీవెలా…

కవిత నీవె కథవు నీవె
కనులు నీవె కలలు నీవె
కలిమి నీవె కరుణ నీవె
కదకు నిను చెరనీయవె..

గగన వీధిలో ఘన నిసీధిలో
మెరిసిన జత మెరుపుల
మనసు గీతిలొ మధుర రీతిలో
ఎగసిన పదముల

రమ్మని పిలిచాక..
కమ్మనిదిచ్చాక..
కిమ్మని అనదింక
నమ్మని మనసింక..

కొసరిన కౌగిలింతక
వయసుకు ఇంత వేడుక
ముగుసిన ఆశకంత
గోల చేయకా..

కవిత నీవె కథవు నీవె
కనులు నీవె కలలు నీవె
కలిమి నీవె కరున నీవె
కదకు నిను చెరనీయవె..

నాననానన ననన
నాననానన ననన
నాననానన ననన నా

నడిచిన దారంతా
మన అడుగుల రాతా
చదవదా జగమంతా
అది తెలిపె గాద..

కలిపిన చేయిచేయినీ
చెలిమిని చేయనీ అని.
తెలిపిన ఆ పదాల
వెంట సాగనీ..

కవిత నీవె కథవు నీవె
కనులు నీవె కలలు నీవె
కలిమి నీవె కరున నీవె
కదకు నిను చెరనీయవె..

గగన వీధిలో ఘన నిసీధిలో
మెరిసిన జత మెరుపుల
మనసు గీతిలొ మధుర రీతిలో
ఎగసిన పదముల



వక్క వక్క పాట సాహిత్యం

 
చిత్రం: గద్దలకొండ గణేష్ (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: చంద్రబోస్ 
గానం: అనురాగ్ కులకర్ణి ,  మిక్కీ జే మేయర్


ధడ ధడ ధడ ధంచుడె
గుండెల్లోకి పిడి దించుడె
అడ్డం వచ్చినోడ్ని సంపుడె
అడ్డు పద్దులన్ని సింపుడె

ముంతలోని కల్లు తాగుతుంటె ఎక్కదె
సీసలోని సార లాగుతుంటె ఎక్కదె
గుడుంబైన బాగ గుంజుతుంటె ఎక్కదె
ఎవ్వన్నైన గుద్దితే కిక్కే నాకు ఎక్కుద్ది

వక్క వక్క వక్క వక్క
నిలోని వనుకే చికెను టిక్క

వక్క వక్క వక్క వక్క వక్క వక్కవె
నీ ప్రాణం నే పీల్చే హుక్కా

వక్క వక్క వక్క వక్క
నీ గుండెల సొచ్చి గుచ్చి
భయమె నేనె ఎక్కి కూసుందె
కుర్సి లేరా

వక్క వక్క వక్క వక్క
ఫైటింగ్ అంటేనె కామిడి లెక్క

వక్క వక్క వక్క వక్క వక్క వక్కవ్
నా పానాలె యెంటిక లెక్క

వక్క వక్క వక్క వక్క
నేనె నాకు దండం పెడతా దేవుని లెక్క
కాస్కొ పక్కా

ధడ ధడ ధడ ధంచుడె
గుండెల్లోకి పిడి దించుడె
అడ్డం వచ్చినోడ్ని సంపుడె
అడ్డు పద్దులన్ని సింపుడె

ధడ ధడ ధడ ధంచుడె
గుండెల్లోకి పిడి దించుడె
అడ్డం వచ్చినోడ్ని సంపుడె
అడ్డు పద్దులన్ని సింపుడె

ఏమ్రో యింటున్నావ్ ర ఆడ యీడ కాదు బిడ్డ
నీ గుండెల మీన్నె ఉంది నా అడ్డ.
హహహహ
సచ్చా లేదు జూటా లేదు
నెన్ సెప్పిందే మాట
ఆగె లేదు పీచె లేదు
నెన్ నడిసిందే బాట
చోట లేదు మోట లేదు
నెన్ పేల్చిందే తూటా
జీన మర్న లేనె లేదు
జిందగి అంతా వేటా వేటా

కొచ్చ కొచ్చ మీసం తోటి
వురి తీసెసి ఊపిరి ఆపేస్త
కోపం వస్తె సవన్ని కూడ
బైటికి తీసి మల్లా సంపేస్తా

వక్క వక్క వక్క వక్క
నిలోని వనుకే చికెను టిక్క

వక్క వక్క వక్క వక్క వక్క వక్కవె
నీ ప్రాణం నే పీల్చే హుక్కా

వక్క వక్క వక్క వక్క
నీ గుండెల సొచ్చి గుచ్చి
భయమె నేనె ఎక్కి కూసుండె
కుర్సి లేరా

వక్క వక్క వక్క వక్క
ఫైటింగ్ అంటేనె కామిడి లెక్క

వక్క వక్క వక్క వక్క వక్క వక్క
నా పానాలె యెంటిక లెక్క

వక్క వక్క వక్క వక్క
నేనె నాకు దండం పెడతా దేవుని లెక్క
కాస్కొ పక్కా

ధడ ధడ ధడ ధంచుడె
గుండెల్లోకి పిడి దించుడె
అడ్డం వచ్చినోడ్ని సంపుడె
అద్దు పద్దులన్ని సింపుడె

ధడ ధడ ధడ ధంచుడె
గుండెల్లోకి పిడి దించుడె
అడ్డం వచ్చినోడ్ని సంపుడె
అద్దు పద్దులన్ని సింపుడె



ఎల్లువొచ్చి గోదారమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: గద్దలకొండ గణేష్ (2019)
సంగీతం: మిక్కీ జే మేయర్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, పి. సుశీల


(గమనిక: ఎల్లువచ్చి గోదారమ్మ పాట ని శోభన్ బాబు, శ్రీదేవి నటించన దేవత (1982) సినిమాలో నుంచి తీసుకొని రీమేక్ చేశారు)

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో...రావయ్యో
ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో...రావమ్మో
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు

ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన
అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట
వద్దంటే విందమ్మ నవ్వు
చెయ్యేస్తే చేమంతి బుగ్గ
చెంగావి గన్నేరు మొగ్గ
చెయ్యేస్తే చేమంతి బుగ్గ
చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే
ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను చూడు
ఆకలికుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు

నీ కళ్ళు సోక నా తెల్ల
కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు
పైట పాడిందిలే గాలి పాట
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు
నే కోరిన మూడు ముళ్ళు
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు
నే కోరిన మూడు ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే
కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ ఏరు తోడు 
ఏరెండినా ఉరు తోడు
నీ తోడులో ఊపిరాడు

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లు పూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో...రావమ్మో
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైన నీవోడు
ఆగడాల పిల్లోడ నా సోగ్గాడా
మీగడంత నీదేలేరా బుల్లోడా

No comments

Most Recent

Default