Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sarileru Neekevvaru (2020)





చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నటీనటులు: మహేష్ బాబు, రష్మిక మందన్న
దర్శకత్వం: అనీల్ రావిపూడి
నిర్మాత: దిల్ రాజు, మహేష్ బాబు, అనీల్ సుంకర
విడుదల తేది: 11.01.2020



Songs List:



మైండ్ బ్లాకు.. పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్
గానం: బ్లెజ్, రనీనా రెడ్డి

ఎప్పుడూ ప్యాంటేసే వాడు...
ఇప్పుడు లుంగీ కట్టాడు... వావ్
ఎప్పుడూ షర్టేసే వాడు... వావ్
ఇప్పుడు జుబ్బా తొడిగాడు.. హా
చేతికేమో మల్లెపూలు కంటికేమో కళ్లజోడు
చుట్టేసీ.. పెట్టేసీ వచ్చేశాడు
ఫర్ ది ఫస్ట్ టైం.. హీజ్ ఇన్ ద మాస్ క్రైమ్

బాబూ నువ్ సెప్సు.. ఏంటీ
ఆన్ని కొట్టమని డప్పు.. హూమ్ నువ్ కొట్టరా
మూన్ వాకు.. మూన్ వాకు..
పిల్ల నీ నడక చూస్తే మూన్ వాకు
అర్త్ క్వేకు.. అర్త్ క్వేకు..
పిల్ల నువ్ తాకుతుంటే.. అర్త్ క్వేకు
నీ లిప్పు లోన ఉంది కప్పు కేకు..కేకు...
మాటలోనా ఉంది మిల్క్ షేక్.. షేకు.
సోకులోనా ఉంది కొత్తస్టాకు  స్టాక్
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
నువ్ హాట్ హాట్ గున్న పూత రేకు.. రేకు.
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు
మనసునెర్రజేసే తమలపాకు...పాకు
అమ్మా అమ్మా హబ్బ హబ్బా

మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూనీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు

బాబూ నువ్ సూపియ్. ఏంటీ
ఆన్నీ ఊదమని పీపీ.. హుమ్ నువ్ ఊదరా
నువ్ ఉండరా
నువ్వు చీరకట్టుకుంటే... జారుతుందే గుండె
ఓరకంట చూపే.. భగ్గుమంటు మండే.
అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందో
నువ్వు కాటుకెట్టుకుంటే చీకటవుతుందే
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే

అట్టా నువ్ చూస్తుంటే.. నా వొళ్లంతా
గిలిగింత పుడతాందే
నీ కళ్లలోన ఉంది.. కళ్లు ముంత.. ముంత
నీ ఒంపులోన ఉంది పాలపుంత.. పుంత
నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు.
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూ నీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు

బాబూ తూ బోలే... క్యారే
ఆన్నీ దంచమనీ ఢోలే.. హుమ్ నువ్
దంచెహే
హా.. బాబూ ఇటు సూడూ.. ఏంటీ
ఆన్నీ పెంచమను స్పీడూ.. హుమ్ నువ్
పెంచరా
నీ ముద్దు ముట్టకుండా... ముద్ద ఎక్కదంట హగ్గు అందకుండా నిద్దరట్టదంటా
ఇట్టా నువ్ ఊరిస్తే.. నువ్ కోరింది.. తీరుస్తా
నీ టచ్ లో కరెంటే నన్ను గుచ్చెనంటా
మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా
అయితే నిన్ను టచ్ చేస్తా... నిన్ను ఏదేదో
మైకంలో ముంచేస్తా.

నీ బుగ్గలోన ఉంది పాలకోవా.. కోవా
నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా.. లావా
నీ నడుములోన ఉంది పూల నావా నావా...
అమ్మా అమ్మా హబ్బ హబ్బా
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూనీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
బాబూనీ మాస్ లుక్కు మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
నువ్వే ఓ స్టెప్పేస్తే మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు




సూర్యుడివో చంద్రుడివో పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: బి. పరాక్

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల 
ఆనందమాయే హొయ్యా

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల 
చిరునవ్వు చేరే హొయ్యా

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

విశ్వమంతా ప్రేమ పండించగా
పుట్టుకైన ఋషివో
సాటివారికై నీ వంతుగా
ఉద్యమించు కృషివో

మా అందరిలో ఒకడైన మనిషివో

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల 
ఆనందమాయే హొయ్యా

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల 
చిరునవ్వు చేరే హొయ్యా

గుండె లోతులో గాయం
నువ్వు తాకితే మాయం
మండువేసవిలో పండు వెన్నెలలా
కలిసింది నీ సహాయం

పొలమారే ఆశల కోసం 
పొలిమేరలు దాటొచ్చావు
తలరాతలు వెలుగయ్యేలా 
నేనున్నానన్నావు
అడగందే అక్కర తీర్చే 
నీ మంచిని పొగడాలంటే
మాలో పలికే మాటలు చాలవు

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

దేవుడెక్కడో లేడు
వేరే కొత్తగా రాడు
మంచి మనుషులలో గొప్ప మనసు తనై
ఉంటాడు నీకు లాగా

ఏ లోక కల్యాణాన్ని ఆశించి జన్మిచ్చిందో
నిను కన్న తల్లి కడుపు నిండారా పండింది
నీలాంటి కొడుకుని మోసే
ఈ భూమి భారతి సైతం
నీ పయనానికి జయహో అన్నది

సూర్యుడివో చంద్రుడివో
ఆ ఇద్దరి కలయికవో
సారధివో వారధివో
మా ఊపిరి కన్న కలవో

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
మనసంతా ఇవాళ ఆహా స్వరాల 
ఆనందమాయే హొయ్యా

తద్దిత్తళాంగు తయ్యా
తక తద్దిత్తళాంగు తయ్యా
పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల 
చిరునవ్వు చేరే హొయ్యా



He is So Cute పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: మధు ప్రియ

అబ్బబ్బబ్బబ్బ.. అబ్బాయెంతో ముద్దుగున్నాడే
కోరస్: ముద్దుగున్నాడే ముద్దుగున్నాడే
ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే
కోరస్: ఎత్తుగున్నాడే ఎత్తుగున్నాడే
అల్లాద్దిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా
అల్లాడించాడే ఓరకంటా
పిల్లాడి బుగ్గ షిమ్లా యాపిల్ లాంటిదంటా
దొరకాలే గాని కొరికి తింటా
చూపుల్లో దాచినాడే ఎదో తూటా 
నన్నిట్టా కాల్చినాడే ఠా ఠా ఠా

He is So Cute. 
He is So Sweet. 
He is So Handsome.

అబ్బబ్బబ్బబ్బ

He is So Cool. 
He is So Hot. 
He is Just Awesome. 

కోడినిట్టా తన్నుకెల్లే గద్దల్లె 
చేపనిట్టా ఎత్తు కెళ్లే కొంగల్లె 
సొత్తు నిట్టా కొల్లగొట్టే దొంగల్లె 
దొంగ లాంటి వీన్నే దాచెయ్యాలి లే 
వీడు పక్కనుంటేచాలు నన్నేచూసి 
ఆడజాతి కళ్ళనిండా ఫుల్ జలసీ 
మాటల్లో దాచినాడే ఆటంబాంబ్ మూట 
నాకొంప కూల్చినాడే టా టా టా టా

He is So Cute. 
He is So Sweet. 
He is So Handsome.

He is So Cool. 
He is So Hot. 
He is Just Awesome. 

కోరస్: 
వీరి వీరి గుమ్మడిపండు వీరి మొగుడెవరే    
బుగ్గలు రెండు జామపండు లాగఉన్న వీడే 

పొద్దునొస్తే ముద్దు కాపీ ఇస్తాలే 
లుంచుకొస్తే హుగ్గుమీల్స్ పెడతాలే 
రాతిరొస్తే బెడ్డుమీద, ఇదిగో అమ్మాయి  ( కోరస్ ) 
అబ్బా బ్రెడ్డుజాము డిన్నర్ తినిపిస్తానులే

చీరలొద్దు నగలువద్దు అమ్మా నాకు 
వీడి పిల్లలకు అమ్మ నవ్వాలే
మగవాడి అందమీద లేదే ఒకపాట 
వీడి ముందు అందం కూడా టా టా టా టా

He is So Cute. 
He is So Sweet. 
He is So Handsome. 

He is So Cool. 
He is So Hot. 
He is Just Awesome. 

He is So Cute. 
He is So Sweet. 
He is So Handsome. 

He is So Cool. 
He is So Hot. 
He is Just Awesome.



సరిలేరు నీకెవ్వరు పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవిశ్రీ ప్రసాద్
గానం: శంకర్ మహదేవన్

భగభగమండే నిప్పుల వర్షమొచ్చినా
జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు

పెలపెలమంటూ మంచు తుపాను వచ్చినా
వెనుకడుగేలేదంటూ దాటేవాడే సైనికుడు
దడ దడ దడ దడమంటూ
తూటాలే దూసుకొచ్చినా
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు
మారణాయుధాలు ఎన్నెదురైనా 
ప్రాణాన్ని ఎదురుపంపేవాడు
ఒకడే ఒకడు వాడే సైనికుడు

సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారూ
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారు పేరు



డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: సరిలేరు నీకెవ్వరు (2020)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: లవిత. ఎమ్. లోబో, నకాష్ అజీజ్

హలో...!
ఆజ్ రాత్ మేరే ఘర్ మెయిన్, పార్టీ హై! 
తు ఆజా నా,

డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ (3)

డాంగ్ డాంగ్ డాంగ్, డాంగ్ 
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ - ఆజా నా (3)

హే! ఆజ్ రాత్ మేరే ఘర్ మెయిన్, పార్టీ హై 
తు ఆజా నా, తు ఆజా నా

డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,

హే! ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై 
తు ఆజా నా,  జరూర్ అజా నా,
 
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్

DJ దించుతా - ఓహ్! 
సౌండ్ పెంచుత - అబ్బా
బేస్ దంచూత - ఆది, 
రచ్చ లేపేద్దామ్

జోరుగుంటదా - హూ
జోషుగుంటదా - ఫుల్
జోలీగుంటదా - పక్కా
ఐతే వచ్చేస్తాం

లెట్స్ పార్టీ లెట్స్ పార్టీ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్ 
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్

డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్ (2)

ఏక్ టీన్ చార్
గెట్ అన్ ద డాన్స్ ఫ్లోర్‌
ఇంచ్-ఇంచ్ ఇరగదీద్దామ్ క్రేజీ తీన్ మార్
బాజీ హై ఫన్ గిటార్ నాషే మే ఫుల్ షికార్
తేరే మేరే బీచ్ మే పుట్టిండి వైల్డ్‌ ఫైర్

డిమ్ లైట్ లో డిస్కో బీట్ తో,
మోతా మోగని మొత్తం ఈ నైట్
బుజ్జి పెగ్స్ తో బాడీ హగ్స్ తో
పట్టు తప్పని పార్టీ క్లైమేట్

లెట్స్ పార్టీ లెట్స్ పార్టీ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్ 
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్

వన్ మోర్ టైమ్

వాట్ ఎ స్కిన్ టోన్
నచ్చావే గ్లామర్ క్వీన్
నిన్ను చుసి దిల్ మే గిర్రుమంది
రొమాంటిక్ డ్రోన్

వాట్ ఎ క్యూట్ సీన్ నీతో పాటు నేను
నువ్ పక్కనున్న కిక్కే చాలు అదే చంద్రయాన్

ఓహ్ క్యా తేరి అదా, పారడైజ్ దా,
రబ్ నే తుజే ఐసా బనా దియా రే,
ఆ గయా మాజా అందుకే కదా,
మే భీ ఫిదా హోగయీ రే

లెట్స్ పార్టీ లెట్స్ పార్టీ
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్ 
లెట్స్ పార్టీ పార్టీ పార్టీ విత్ ద సాంగే
గురుతుండి పోవాలెహ లైఫ్ లాంగ్

డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్,
డాంగ్ డాంగ్ డాంగ్ డాంగ్  (4)

No comments

Most Recent

Default