చిత్రం: పుష్ప (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నటీనటులు: అల్లు అర్జున్, రాష్మిక మండన్న దర్శకత్వం: సుకుమార్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి విడుదల తేది: 17.12.2021
Songs List:
దాక్కో దాక్కో మేక పాట సాహిత్యం
చిత్రం: పుష్ప (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శివం తందానే తనేననేనా నే… తందానే తానెనానేనానే తానానే తన్నిననినానే తానానే తన్నిననినానే వెలుతురు తింటది ఆకు… వెలుతురు తింటది ఆకూ ఆకును తింటది మేక… ఆకును తింటది మేక మేకను తింటది పులి… మేకను తింటది పులి ఇది కదరా ఆకలి… ఇది కదరా ఆకలి అఅ ఆ అఆ ఆ అఅ ఆ అఆ ఆ పులినే తింటది చావు చావుని తింటది కాలం కాలాన్ని తింటది కాళీ ఇది మహా ఆకలీ అఅ ఆ అఆ ఆ అఅ ఆ అఆ ఆ వేటాడేది ఒకటి… పరిగెత్తేది ఇంకొకటి దొరికిందా ఇది సస్తాది దొరక్కపోతే అది సస్తాది ఏ, ఒక జీవికి ఆకలేసిందా ఇంకో జీవికి ఆయువు మూడిందే ఎయ్, దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక, హుయ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ చేపకు పురుగు ఎరా… పిట్టకు నూకలు ఎరా కుక్కకు మాంసం ముక్క ఎరా మనుషులందరికి బతుకే ఎరా అఅ ఆ అఆ ఆ అఅ ఆ గంగమ్మ తల్లి జాతర కోళ్ళు పొటేళ్ళ కోతరా కత్తికి నెత్తుటి పూతరా దేవతకైనా తప్పదు ఎరా ఇది లోకం తలరాతరా అఅ ఆ అఆ ఆ అఅ ఆ ఏమరుపాటుగ ఉన్నావా… ఎరకే చిక్కేస్తావు ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు, హా కాలే కడుపు సూడదురో… నీతీ న్యాయం బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టా రాజ్యం ఎయ్, దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక, హుయ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ అడిగితే పుట్టదు అరువు, (అరువు) బతిమాలితే బతుకే బరువు, (బరువు) కొట్టరా ఉండదు కరువు, (కరువు) దేవుడికైనా దెబ్బె గురువు అఅ ఆ అఆ ఆ అఅ ఆ తన్నుడు సేసే మేలు, హా… తమ్ముడు కూడా సెయ్యడు, హా గుద్దుడు సెప్పే పాఠం… బుద్ధుడు కూడా సెప్పడహే హమ్ హమ్ హమ్ హమ్… హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్ హమ్… తగ్గేదే లే
చూపే బంగారమాయనే శ్రీవల్లి పాట సాహిత్యం
చిత్రం: పుష్ప (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: సిద్ శ్రీరాం నిను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయెనే... చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే... అన్నిటికి ఎపుడూ... ముందుండే నేను మీ ఎనకే ఇపుడూ పడుతువున్నాను ఎవ్వరికి ఎపుడూ... తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు... తలనే వంచాను ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే... చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే... నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడు రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తె, అయినా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ.... చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ
సామీ స్వామి పాట సాహిత్యం
చిత్రం: పుష్ప (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: మౌనిక యాదవ్ నువ్ అమ్మీ అమ్మి అంటాంటే నీ పెళ్లాన్నైపోయి నట్టుందిరా స్వామీ నా స్వామీ నిన్ను స్వామీ స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కగుందిరా స్వామీ నా స్వామి నీ యేనకే యేనకే అడుగుతాఅంటే నీ యేనకే యేనకే అడుగుతాఅంటే యెంకన్న గుడి యెక్కినట్టుందిరా స్వామి నీ పక్కా పక్కానా కూసుంటంటే పరమేశ్వరుడే దక్కినట్లుందిరా స్వామి నువ్వేళ్ళే దారి సూత ఉంటె యేరే యెండినట్టుందిరా సామీ నా స్వామి నా స్వామి రారా స్వామీ బంగారు స్వామి మీసాల స్వామి రోశల స్వామి నా స్వామి స్వామి రారా స్వామి స్వామి బంగారు స్వామి మీసాల స్వామి రోశల స్వామి పిక్కల పై ధాకా పంచను యెత్తి కడితే పిక్కల పై ధాకా పంచను యెత్తి కడితే నా పంచ ప్రాణాలు పోయెను స్వామి కార కిల్లి నువ్వు కస్సు కస్సు నవ్వుతుంది నా వొళ్లు యెర్రగా పండెను స్వామీ నీ అరుపులు కేకలు వింత ఉంటి నీ అరుపులు కేకలు వింటా ఉంటె పులకరింపులే స్వామి నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనకాలే స్వామి రెండు గుండెలే ఇప్పి గుండెను సూపితే పాల కుండా లెక్క పొంగి పోతా స్వామీ నా స్వామి నా స్వామి రారా స్వామీ బంగారు స్వామి మీసాల స్వామి రోశల స్వామి నా స్వామి స్వామి రారా స్వామి స్వామి బంగారు స్వామి మీసాల స్వామి రోశల స్వామి కొత్త సీర కట్టుకుంటే యెట్ట ఉందో సెప్పకుంటే కొత్త సీర కట్టుకుంటే యెట్ట ఉందో సెప్పకుంటే కొన్నా ఇలువ సున్న అవ్వడా స్వామి కొప్పులోన పూలు పెడితే గుప్పున నువ్వే పీల్చుకుంటే పూలగుండె రాలి పాదధా స్వామీ నా కొంగె జారెతప్పుడు నువ్వు ఊఊ ఆఆ… నా కొంగె జారెతప్పుడు నువ్వు నువ్వు సూడకుంటే స్వామీ ఆ కొంటె గాలి నన్నే చూసి జాలే పదధా స్వామీ నా అందం సంధం నీదవ్వకుంటే ఆడ పుట్టుకే బీదాయిపోతా స్వామీ నా స్వామి నా స్వామి రారా స్వామీ బంగారు స్వామి మీసాల స్వామి రోశల స్వామి నా స్వామి స్వామి రారా స్వామి స్వామి బంగారు స్వామి మీసాల స్వామి రోశల స్వామి
ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా పాట సాహిత్యం
చిత్రం: పుష్ప (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకాష్ అజీజ్ ఆ పక్కా నాదే… ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే… ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే నన్నైతే కొట్టేటోడు… భూమ్మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నను మించి ఎదిగెటోడు ఇంకోడున్నాడు సూడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పాన మీసమట సేతిలోన గొడ్డలట సేసిందే యుద్ధమట సెయ్యందే సంధి అటా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా నిను ఏట్లో ఇసిరేస్తా నే సేపతో తిరిగొస్తా గడ కర్రకు కుచ్చేస్తా నే జెండాల ఎగిరేస్తా నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా నే ఖరీదైన ఖనిజంలా టెన్ టు ఫైవ్ మళ్ళీ దొరికేస్తా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా ఎవడ్రా ఎవడ్రా నువ్వు..? ఇనుమును ఇనుమును నేను నను కాల్చితే కత్తౌతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు..? మట్టిని మట్టిని నేను నను తొక్కితే ఇటుకౌతాను ఎవడ్రా ఎవడ్రా నువ్వు..? రాయిని రాయిని నేను గాయం గాని చేశారంటే ఖాయంగా దేవున్నౌతాను ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ..! ఇది నా అడ్డా లే లే తగ్గేదే లే అరె, ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా లే లే తగ్గేదే లే
ఊ అంటావా పాట సాహిత్యం
చిత్రం: పుష్ప (2021) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఇంద్రావతి చౌహాన్ కోక కోక కోక కడితే కొరకొరమంటు చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు కోకా కాదు… గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే… వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! తెల్లా తెల్లాగుంటె ఒకడు తల్లాకిందులౌతాడు నల్లా నల్లాగుంటె ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముంది సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! హాయ్, ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు ఎత్తూ కాదు కురసా కాదు మీకో సత్యం సెబుతాను అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! హాయ్, ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! బొద్దూ బొద్దూ గుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు సన్నా సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి ఒంటిగ సిక్కామంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! హాయ్, ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! పెద్దా పెద్దా మనిషిలాగ ఒకడు ఫోజులు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేసాకా..!! ఊ ఊ ఊ ఊ, దీపాలన్నీ ఆర్పేసాకా అందరి బుద్ధి… వంకర బుద్ధే ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! ఊ అంటామే పాప ఊ ఊ అంటామా పాప ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!! ఊ అంటామే పాప ఊ హు అంటామా పాప (ఊ అంటావా మావా ఊ ఊ అంటావా..!!)
No comments
Post a Comment