చిత్రం: రాధే శ్యామ్ (2022) సంగీతం: జస్టీస్ ప్రభాకరన్ నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే దర్శకత్వం: రాధా కృష్ణ కుమార్ నిర్మాతలు: భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద విడుదల తేది: 14.01.2022
Songs List:
ఈ రాతలే పాట సాహిత్యం
చిత్రం: రాధే శ్యామ్ (2022) సంగీతం: జస్టీస్ ప్రభాకరన్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా ఎవరో వీరెవరో… విడిపోని యాత్రికులా వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల ఆటాడే విదే ఇదా ఇదా పదే పదే కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా… రాసే ఉందా, ఆ ఆఆ ఈ రాతలే దోబూచులే ఈ రాతలే… దోబూచులే ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటోందే ఏ గూఢచారో… గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే గాయం లేదు గాని… దాడెంతో నచ్చే ఆ మాయే ఎవరే… రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే నిజమా భ్రమ… బాగుంది యాతనే కలతో కలో గడవని గురుతులే ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే ఈ రాతలే… దోబూచులే ఈ రాతలే… దోబూచులే ఈ రాతలే… దోబూచులే ఏ గూఢచారో… గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో ఆ మాయే ఎవరే… రాడా ఎదురే తెలీకనే తహతహ పెరిగే ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా ఎవరో వీరెవరో విడిపోని యాత్రికులా
నగుమోము తారలే పాట సాహిత్యం
చిత్రం: రాధే శ్యామ్ (2022) సంగీతం: జస్టీస్ ప్రభాకరన్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: సిద్ శ్రీరాం పూజ హెగ్డే: నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా? ప్రభాస్: ఛా, నేనాటైపు కాదు. పూజ: కానీ నేను జూలియట్ నే. నాతో ప్రేమలో పడితే చస్తావ్. ప్రభాస్: I Just Want Flirtationship. నగుమోము తారలే తెగి రాలె నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయె ప్రాయమే కదిలేను పాదమే పడసాగె ప్రాణమే తన వెనకే మోహాలనే మీరెంతలా ఇలా మోమాటమే ఇక వీడెనులే ఇప్పుడే ఏకమయ్యే… ఈ రాధే శ్యామ్ (రాధే శ్యామ్) ఇద్దరోలోకమయ్యే… ఈ రాధే శ్యామ్ (రాధే శ్యామ్) కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అణకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి ఎచటకు ఏమో తెలియదుగా అడగనేలేని చెలిమిదిగా పెదవులకేమో అదే పనిగా నిమిషము లేవే విడివిడిగా సమయాలకే సెలవే ఇక పేరులేనిది ప్రేమకానిది ఓ కధే ఇదే కదా ఇప్పుడే ఏకమయ్యే… ఈ రాధే శ్యామ్ (రాధే శ్యామ్) ఇద్దరోలోకమయ్యే… ఈ రాధే శ్యామ్ (రాధే శ్యామ్, రాధే శ్యామ్)
సంచారి పాట సాహిత్యం
చిత్రం: రాధే శ్యామ్ (2022) సంగీతం: జస్టీస్ ప్రభాకరన్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: అనిరుద్ రవిచంద్రన్ కొత్త నేలపై కాలి సంతకం కొండగాలితో శ్వాస పంపకం తెరిచా హృదయం కనుచూస్తే హం గెలిచ ప్రతి శిఖరం ఓ ఓ .. బ్రతుకే పయనం వదిలే జగడం నువ్వు పంచె మంచే మళ్ళి నీకే దొరకగా చల్ చలో చలో సంచారి చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో ఏ కలయికే లోకమంతా హాయి నింపేనో మైలురాయే లేని దూరం ప్రేమ అంటే ఓ... ఓ.. ఉండే చిన్న జీవితంలో ప్రతి క్షణం బ్రతికేయరా చెరిపే అంచనాలను మరి విశ్వం మొత్తం నీలో నింపే దొరుకురా చల్ చలో చలో సంచారి చల్ చలో చలో చల్ చలో చలో సంచారి చల్ చలో
నిన్నేలే పాట సాహిత్యం
చిత్రం: రాధే శ్యామ్ (2022) సంగీతం: జస్టీస్ ప్రభాకరన్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: అనురాగ్ కులకర్ణి, శ్రేయా ఘోషాల్ నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే ఏమిస్తే దక్కేవులే నే నిన్నటి రవినే నువు రేపటి శశివే నేనంటూ వెళ్ళాకే నువ్వొస్తావు పైకే ఇది తప్పని మజిలీ ఇది జాముల బదిలీ నువే వెన్నెలే నీవే నీవే వెలుగుల వెన్నెలవే నీవే నీవే తరగని వెన్నెలవే హా ఆ ఆఆ ఆ ఆహ ఆ ఆఆ ఆ హా ఆ ఆఆ ఆ హా ఆఆఆ నీవల్లే నీవల్లే నేనే ఉన్నాలే పోవద్దు ఆ దూరమే వస్తాలే వస్తాలే నేను వస్తాలే నువ్వెళ్ళే ఆ తీరమే నేనడిగే చిన్ని సాయమే చినగనే లేదు నీకు సమయమే సాయం అడిగే పనే నీకు లేదే అవధులు లేని అనంతం నువ్వే నీవే నీవే వెలుగుల వెన్నెలవే నీవే నీవే తరగని వెన్నెలవే నిన్నేలే నిన్నేలే నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే నిన్నేలే నిన్నేలే నిన్నే కోరాలే ఏమిస్తే దక్కేవులే
కృష్ణ కృష్ణ పాట సాహిత్యం
చిత్రం: రాధే శ్యామ్ (2022) సంగీతం: జస్టీస్ ప్రభాకరన్ సాహిత్యం: Devotional గానం: జస్టీస్ ప్రభాకరన్ ఓ ఓ హో హో ఆఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ కృష్ణ కృష్ణ మనమోహన చిత్త చోర రాధా జీవన మేఘశ్యామ మధుసూధనా రాధేశ్యామ ఎదునందనా కృష్ణ కృష్ణ మన మోహన చిత్త చోర రాధా జీవన మేఘశ్యామ మధుసూధనా రాధేశ్యామ ఎదునందనా
Sei Un Angelo పాట సాహిత్యం
చిత్రం: రాధే శ్యామ్ (2022) సంగీతం: జస్టీస్ ప్రభాకరన్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: జస్టీస్ ప్రభాకరన్ Sei Un Angelo
సుందర వదన పాట సాహిత్యం
చిత్రం: రాధే శ్యామ్ (2022) సంగీతం: జస్టీస్ ప్రభాకరన్ సాహిత్యం: కృష్ణ కాంత్ గానం: ఐశ్వర్య రవిచంద్రన్ సుందర వదన
No comments
Post a Comment