చిత్రం: శశి (2021) సంగీతం: అరుణ్ చిలువేరు నటీనటులు: ఆది సాయికుమార్, సురభి, రాశి సింగ్ దర్శకత్వం: శ్రీనివాస్ నాయుడు నడికట్ల నిర్మాతలు: ఆర్.పి. వర్మ, రామాంజనేయులు, చింతల పూడి శ్రీనివాస్ విడుదల తేది: 19.03.2021
Songs List:
ఒకే ఒక లోకం నువ్వే పాట సాహిత్యం
చిత్రం: శశి (2021) సంగీతం: అరుణ్ చిలువేరు సాహిత్యం: చంద్రబోస్ గానం: సిద్ శ్రీరామ్ ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంతా నీకే నేను కావలుండనా... ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంతా నీకే నేను కావలుండనా... నిన్నా మొన్నా గుర్తె రాని సంతోషాన్నే పంచైనా ఎన్నాళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే... ఎండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా
దింతానా దింతాన పాట సాహిత్యం
చిత్రం: శశి (2021) సంగీతం: అరుణ్ చిలువేరు సాహిత్యం: భాస్కర భట్ల గానం: హరిచరణ్ దింతానా దింతాన ఇది మనసుపండగని అనుకోనా దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా దింతాన దింతాన ఇది మనసు పండగని అనుకోనా దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా కనురెప్పల కోలాటామిది ఎద చప్పుడు ఆరాటమిది నువ్విచ్చిన ఆనందమిది నులివెచ్చగా బాగుందిది హే.. నిన్నింక వదలనులే నీ చెయ్యి విడవనులే నీలోంచి కదలనులే దింతానా దింతాన ఇది మనసు పండగని అనుకోనా దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా పాలసంద్రంలా పొంగిపోతున్న పాలపుంతల్లో తేలిపోతున్న విరిసే తోటలన్నీ తూనీగలా తిరిగేస్తున్న కురిసే తారాలన్నీ దోసిళ్లల్లో నింపేస్తున్న చెట్టు కొమ్మల్లే ఊగిపోతున్న కొత్త జన్మేదో అందుకుంటున్న రెక్క విప్పుకుంటూ గువ్వలన్నీ గుండెలోకి దూకినట్టు ఉత్సవాలు జరుపుతున్న నింగి అంచు మీద రంగు రంగు చేపలుగా గెంతుతున్న ఓ... దింతానా దింతాన ఇది మనసు పండగని అనుకోనా దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా ఇంత కాలంగా ఎక్కడున్నావే ఉన్నఫళంగా ఊడి పడ్డావే తెలిసీ తెలియనట్టు నా మనసునే లాలించేశావే అసలేం ఎరగ నట్టు నీ వెనకనే తిప్పించావే నిన్ను చూశాకే ప్రాణ మొచ్చిందే వింతలోకంలో కాలు పెట్టిందే నిన్ను తాకుతున్న గాలి వచ్చి నా చెంప గిల్లుతుంటే అంతకన్న హాయి ఉండదే అరె నిన్ను తప్ప కన్ను ఇంక నన్ను కూడ చూడనందే దింతాన దింతాన ఇది మనసు పండగని అనుకోనా దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా కనురెప్పల కోలాటామిది ఎద చప్పుడు ఆరాటమిది నువ్విచ్చిన ఆనందమిది నులివెచ్చగా బాగుందిది హే.. నిన్నింక వదలనులే నీ చెయ్యి విడవనులే నీలోంచి కదలనులే దింతానా దింతాన ఇది మనసు పండగని అనుకోనా దింతాన దింతాన కల ఎదుట వాలినది నిజమేనా
విధినే విడిచే పాట సాహిత్యం
చిత్రం: శశి (2021) సంగీతం: అరుణ్ చిలువేరు సాహిత్యం: వెంగి గానం: యం. యం. కీరవాణి విధినే విడిచే నీ ప్రాణమే విడిగా మిగిలే ఈ మౌనమే కొనసాగి ఆగేనా నీ స్నేహమే నువు లేక సాగేనా ఈ కాలమే పలికే పేరు లేదే పెదవే ఉరుకోదే సెలవే కోరలేదే కల అయినా రాదె
ఎవరికోగాని పాట సాహిత్యం
చిత్రం: శశి (2021) సంగీతం: అరుణ్ చిలువేరు సాహిత్యం: అనంత్ శ్రీరామ్ గానం: నరేష్ అయ్యర్, నారాయణ్ అయ్యర్ ఎవరికోగాని ఎదురుకాదింత బరువై ఏపుడిలా ఒకరితో శ్వాస ఒకరితో చేయి కలపాలంటే అది ఎలా కనిపించే ఆ రుణముఖే జన్మ తలవంచింది క్షణమున ప్రాణం పంచె మనసునే నేడు వదిలేసిందా చివరన ఎవరికోగాని ఎదురుకాదింత బరువై ఏపుడిలా ఒకరితో శ్వాస ఒకరితో చేయి కలపాలంటే అది ఎలా నిలువునా నిన్ను నిలుపుకున్నాక వదలన వదలన కుదురున కనులలో నిన్ను కలుపుకున్నాక మరవన మరవనా జరుగునా అయినా గాని వదిలేస్తున్న మనసును అణుచుకోని మరి నీకోసం మరిచేస్తున్న మరొక బతుకుతోని మలుపున ఎవరికోగాని ఎదురుకాదింత బరువై ఏపుడిలా ఒకరితో శ్వాస ఒకరితో చేయి కలపాలంటే అది ఎలా కనిపించే ఆ రుణముఖే జన్మ తలవంచింది క్షణమున ప్రాణం పంచె మనసునే నేడు వదిలేసిందా చివరన
ప్రేమ ఇది ప్రేమ పాట సాహిత్యం
చిత్రం: శశి (2021) సంగీతం: అరుణ్ చిలువేరు సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి గానం: బోల్ట్, ఇషాక్ వాలి ప్రేమ ఇది ప్రేమ నువు అవునన్నా కాదన్నా ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా నాలో ధ్యాసే నీవా నీవా లోలో ఊసే నీవా... ఓ ఓ ఓ పాడే కన్నె నీవా నీవా ఆడే మిన్నే నీవా... ఓ ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ భూగోళమంతా నీవల్లే నీవల్లే నగిషీలు పూసే నీవల్లేనే ఈ పాలపుంత నా వల్లే నా వల్లే నగుమోము చేరే నీ వల్లనే పంచే ఈ ప్రేమ పెడుతుందే ఓ కోమ భాషే ఏదైనా భావం ఇంతే రామ పెంచే ప్రేమ ఎద ముంచేనమ్మా ఎదురేమైనా నివురైపోదమ్మ ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా ప్రేమ ఇది ప్రేమ ఎవరవునన్నా కాదన్నా ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా జారే కన్నే నీవా నీనా మీరే మిన్నే నీవా... ఓ ఓ ఓ తార తీరం నీవా నీవా కారాగారం నీవా... ఓ ఓ ఓ ప్రేమ ఇది ప్రేమ నువు అవునన్నా కాదన్నా ప్రేమ ఇది ప్రేమ నీ మాయల్లోనే ఉన్నా దూరం భారం నీవా నీవా దారి దాపు నీవా... ఓ ఓ ఓ వేగం వేదం నీవా నీవా ఆది అంతం నీవా... ఓ ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ
రానే రాదే పాట సాహిత్యం
చిత్రం: శశి (2021) సంగీతం: అరుణ్ చిలువేరు సాహిత్యం: వెంగి గానం: చౌరస్తా మ్యూజిక్, అదితి భావరజ్ రానే రాదే విలువైన జీవితం పోతే రాదే పోనే పోదే హృదయంలో వేధనే పోనందే రానే రాదే విలువైన జీవితం పోతే రాదే పోనే పోదే హృదయంలో వేధనే పోనందే మనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంట వదిలెయ్ వదిలెయ్ కలిసి వచ్చే ఆనందాలే హద్దు లేనివంట అడుగెయ్ అడుగెయ్ దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింత వలచేయ్ వలచేయ్ ముళ్ళు ఉంటాయ్ రాళ్లు ఉంటాయ్ రహదారులన్నీ గెలిచేయ్ గెలిచేయ్ నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా నీదే అదృష్టం మాటే మారాలే నీవే ఈ లోకం మొత్తం అనుకుంటేనే ఇకపై నీదే నీదేలే పల్లవించే కొంటె అల పడిలేస్తే అందం హో పంచుకుంటే నవ్వు నీలా మనదే అనుబంధం తుళ్ళిపడే కుర్రతనం తీరమెక్కడో చూద్దాం హో తెల్లవారే తూరుపింట తొలి వెలుగవుదాం నిన్న మొన్న గడిచెను వదిలెయ్ పాత రోజులన్నీ గతమేగా నువ్వు నేను అన్న స్వార్ధం విడిచెయ్ చిన్ని చేతులన్నీ హితమేగా స్వర్గమన్నదింక ఎక్కడో లేదోయ్ స్వప్నమై ఉంది స్వతహాగా సాహసాలు చేసే సత్తువ ఉంటే మనకు సొంతమేగా దారే లేదని తుది వరకు దరి లేనే లేదని తడబడకు తీరే మారదు అని అనకు నీ తీరం దూరం చేరువరకు రానే రాదే విలువైన జీవితం పోతే రాదే పోనే పోదే హృదయంలో వేధనే పోనందే మనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంట వదిలెయ్ వదిలెయ్ కలిసి వచ్చే ఆనందాలే హద్దు లేనివంట అడుగెయ్ అడుగెయ్ దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింత వలచేయ వలచేయ్ ముళ్ళు ఉంటాయ్ రాళ్లు ఉంటాయ్ రహదారులన్నీ గెలిచేయ్ గెలిచేయ్ నీదే ఈ ఇష్టం కష్టం నష్టం ఏదేమైనా నీదే అదృష్టం మాటే మారాలే నీవే ఈ లోకం మొత్తం అనుకుంటేనే ఇకపై నీదే నీదేలే
No comments
Post a Comment