చిత్రం: కోటీశ్వరుడు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: అక్నాకినేని గేశ్వరరావు, సుజాత
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరి రావు
నిర్మాతలు: టి.ఆర్.శ్రీనివాస్, పి.హెచ్.రామారావు
విడుదల తేది: 06.01.1984
చిత్రం: కోటీశ్వరుడు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి. బాలు, సుశీల
చిగురాకు శుభలేఖ రాసేటి వేళ
చిరుగాలి సన్నాయి పాడేటి వేళ
ఆ చూపు అరుణోదయం
ఆ చిరునవ్వు చంద్రోదయం
ఆ.. సెలయేరు పరువాలు చిలికేటి వేళ
మేఘాలు రాగాలు తీసేటి వేళ
ఆ చూపు అరుణోదయం
ఆ చిరునవ్వు చంద్రోదయం
చిగురాకు శుభలేఖ రాసేటి వేళ
మేఘాలు రాగాలు తీసేటి వేళ
నువ్వే నాకొక సిందూర తిలకం
సిగలో వాడని మందార కుసుమం
నీ ప్రతి పలుకు నీరెండ కులుకు
వలపులు చిందే పన్నీటి చినుకు
తలపులే ఒక వేకువ వలపులే ఒక వెల్లువ
ఊహలు విరిసే నీ యదలోన ఊపిరి నీతోనా
అభివందనం ఇది నందనం హరిచందనం ప్రేమకే
సెలయేరు పరువాలు చిలికేటి వేళ
చిగురాకు శుభలేఖ రాసేటి వేళ
ఆ చూపు అరుణోదయం
ఆ చిరునవ్వు చంద్రోదయం
కలిసిన నాలుగు నయనాలలోన
కురిసెను ఆశలు సిరితేనె వాన
మురిసినది తొలి మురిపాల లోన
కలలే తీరి పులకించి పోనా
రాగమే అనురాగమై బంధమే అనుబంధమై
దిక్కులు చుక్కలు నిలిచేదాక ఒకటై ఉండాలి
ఈ జీవితం నీకంకితం ఇది స్వాగతం ప్రేమకే
చిగురాకు శుభలేఖ రాసేటి వేళ
చిరుగాలి సన్నాయి పాడేటి వేళ
ఆ చూపు అరుణోదయం
ఆ చిరునవ్వు చంద్రోదయం
ఆ.. సెలయేరు పరువాలు చిలికేటి వేళ
మేఘాలు రాగాలు తీసేటి వేళ
ఆ చూపు అరుణోదయం
ఆ చిరునవ్వు చంద్రోదయం
No comments
Post a Comment