Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Uma Sundari (1956)



చిత్రం: ఉమా సుందరి (1956)
సంగీతం: జి. అశ్వద్ధామ
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం (All)
నటీనటులు: యన్. టి. రామరావు, పసుపులేటి కన్నాంబ, శ్రీరంజని జూనియర్, నాగయ్య, సురభి బాలసరస్వతి
దర్శకత్వం: పి. పుల్లయ్య
నిర్మాత: యం. సోమసుందరం
విడుదల తేది: 20.07.1956



Songs List:


మాయా సంసారం తమ్ముడు పాట సాహిత్యం

 
చిత్రం: ఉమా సుందరి (1956)
సంగీతం: జి. అశ్వద్ధామ
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం
గానం: పిఠాపురం

పల్లవి:
మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు

చరణం : 1
ముఖము అద్దము ఉందీ మొగమాటమెందుకు
సుఖదుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు
ముఖము అద్దము ఉందీ మొగమాటమెందుకు
సుఖదుఃఖములు లెక్క చూసుకో తమ్ముడు

సకల సమ్మోహన సంసారమందున
సకల సమ్మోహన సంసారమందున
సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా
సుఖాలు సున్నా దుఃఖాలే మిగులన్నా

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు

చరణం: 2
కోరి తెచ్చుకున్న భారమంతే గానీ
దారా పుత్రులు నిను దరి జేర్చుతారా
కోరి తెచ్చుకున్న భారమంతే గానీ
దారా పుత్రులు నిను దరి జేర్చుతారా

తేరి చూసి నిజము తెలుసుకో తమ్ముడు
తేరి చూసి నిజము తెలుసుకో తమ్ముడు
సారము సత్యం సర్వం పరమాత్మ

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు

చరణం: 3
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
పోయేటప్పుడు కొని పోయేదేముంది
పోయేటప్పుడు కొని పోయేదేముంది

అద్దె కొంప లోకమంతేరా తమ్ముడు
అద్దె కొంప లోకమంతేరా తమ్ముడు
వద్దు పొమ్మనగానే వదిలేసి పోవాలి

మాయా సంసారం తమ్ముడు
ఇది మాయా సంసారం తమ్ముడు
నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు

మాయా సంసారం తమ్ముడు





నమ్మకురా ఇల్లాలు పిల్లలు పాట సాహిత్యం

 
చిత్రం: ఉమా సుందరి (1956)
సంగీతం: జి. అశ్వద్ధామ
సాహిత్యం: వెంపటి సదాశివ బ్రహ్మం
గానం: ఘంటసాల, పిఠాపురం

నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా
తోలుబొమ్మలురా జీవా
నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా
తోలుబొమ్మలురా జీవా

సమ్మతించి నను నమ్మిన వారికి సాయుజ్యమురా జీవా 
శివ సాన్విజ్యమురా జీవా
సమ్మతించి నను నమ్మిన వారికి సాయుజ్యమురా జీవా 
శివ సాన్విజ్యమురా జీవా 

ఘోర దురిత సంసార జలదిలో జ్ఞానమే చేయూత
ఆజ్ఞానమే ఎదురీత
జీవా జ్ఞానమే చేయూత ఆజ్ఞానమే ఎదురీత
ఘోర దురిత సంసార జలదిలో జ్ఞానమే చేయూత
ఆజ్ఞానమే ఎదురీత
జీవా జ్ఞానమే చేయూత ఆజ్ఞానమే ఎదురీత

మోహమెందుకీ జీవము పై ఇది తోలు తిత్తిరా జీవా ఉత్త గాలి తిత్తిరా జీవా
మోహమెందుకీ జీవము పై ఇది తోలు తిత్తిరా జీవా ఉత్త గాలి తిత్తిరా జీవా

నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా జీవా
తోలుబొమ్మలురా జీవా

Most Recent

Default

No comments