చిత్రం: రాజపుత్ర రహస్యం (1978) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: యన్.టి.రామారావు, జయప్రద, మోహన్ బాబు, దర్శకత్వం: S.D.లాల్ నిర్మాతలు: యార్లగడ్డ లక్ష్మయ్య చౌదరి, సి.ఎస్.రావు విడుదల తేది: 29.07.1978
Songs List:
సిరిమల్లె పువ్వు మీద పాట సాహిత్యం
చిత్రం: రాజపుత్ర రహస్యం (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా... కోరికేదో కోన దాటిపోయిందే... నా కోరికేదో కోనదాటిపోయిందే గోరింట పొదరింట గోరింకా... కోరికంతా కోక చుట్టుకుంటాలే... నీ కోరికంతా కోక చుట్టుకుంటాలే సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా... కోరికేదో కోన దాటిపోయిందే... చరణం: 1 కొండా ఉందీ కోనా ఉందీ... కొండమల్లీ వానా ఉంది కోరుకున్నా నీ ఒడిలో వలపు నారుమడి నాకుంది కన్నెవలపు కట్నాలిస్తా... వెన్నమనసు కానుకలిస్తా... వస్తావా కరిగిస్తావా... నీ గడసరి అల్లికలిస్తే... నా మగసిరి మల్లికలిస్తా... వస్తావా కలిసొస్తావా కౌగిట నన్నే కాచుకో... మీగడలన్నీ దోచుకో.. నన్నే నీతో పంచుకో... నిన్నే నాలో పెంచుకో... హ... హా.. కౌగిట నన్నే కాచుకో... మీగడలన్నీ దోచుకో.. నన్నే నీతో పంచుకో... నిన్నే నాలో పెంచుకో... సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా... కోరికేదో కోన దాటిపోయిందే... గోరింట పొదరింట గోరింకా... నీ కోరికంతా కోక చుట్టుకుంటాలే... చరణం: 2 ఆకు ఉందీ పిందె ఉందీ... రేకు విరిసే సోకూ ఉందిపువ్వూ ఉందీ పూతా ఉందీ... మల్లెపొదలా మాటు మనకుంది దుక్కిపదును పంటలు కోస్తా... మొక్కజొన్న కండెలు ఇస్తావస్తావా... ముద్దిస్తావా.. హహా బంతిపూలా పక్కలు వేస్తా... గున్నమావి జున్నులు పెడతావస్తావా... మురిపిస్తావా రెక్కల రెపరెపలెందుకో... చుక్కల విందులు అందుకో చిక్కని వలపుల పొందులో... తొలి సిగ్గులనే దులిపేసుకో... హహా... రెక్కల రెపరెపలెందుకో... చుక్కల విందులు అందుకో చిక్కని వలపుల పొందులో... తొలి సిగ్గులనే దులిపేసుకో... సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా... కోరికేదో కోన దాటిపోయిందే... గోరింట పొదరింట గోరింకా... నీ కోరికంతా కోక చుట్టుకుంటాలే సిరిమల్లె పువ్వు మీద సీతాకోక చిలుకా... కోరికేదో కోన దాటిపోయిందే...
చాన్నాల్లకొచ్చాడు పాట సాహిత్యం
చిత్రం: రాజపుత్ర రహస్యం (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. జానకి చాన్నాల్లకొచ్చాడు
ఎంత సరసుడైనాడమ్మా... పాట సాహిత్యం
చిత్రం: రాజపుత్ర రహస్యం (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి: ఎంత సరసుడైనాడమ్మా... ఏమి పురుషుడైనాడమ్మా ఏ గాలి తాకిందో ఇంతవాడైనాడమ్మా ఏడ దాచుకోనమ్మా... ఏడ దాచుకోనమ్మా ఎంత సరసుడైనాడమ్మా... ఏమి పురుషుడైనాడమ్మా ఏ గాలి తాకిందో ఇంతవాడైనాడమ్మా ఏడ దాచుకోనమ్మా... ఏడ దాచుకోనమ్మా చరణం: 1 తాకింది ఒకసారైనా తడి వలపు తొందరలాయే నాటింది ఒక ముద్దైనా నా వల్ల కాకపోయే ఇంతలోనే ఇంతలైతే... చినుకులోనే మునకలైతే ఎలా తట్టుకుంటానో... ఓ..ఓ..ఓ.. ఈ రసికత వెల్లువైతే... ఈ రసికత వెల్లువైతే... ఎంత సరసుడైనాడమ్మా... ఏమి పురుషుడైనాడమ్మా ఈ పిల్లగాలి తాకి ఇంతవాడైనాడమ్మా ఇంకెంతో అవుతాడమ్మా... ఇంకెంతో అవుతాడమ్మా... చరణం: 2 పొద్దు పొడువనివ్వను... ముద్దులాగిపోవునేమో కౌగిలి విడనీయను.. కాగే చలి ఆగునేమో పొద్దు పొడువనివ్వను... ముద్దులాగిపోవునేమో కౌగిలి విడనీయను.. కాగే చలి ఆగునేమో ఋతువులపై శయనించి.. రుచులన్నీ రంగరించి.. ఋతువులపై శయనించి.. రుచులన్నీ రంగరించి.. రసజగాల తేలింతునే... రాచవన్నె రామచిలక... రాచవన్నె రామచిలక... ఎంత సరసుడైనాడమ్మా... ఏమి పురుషుడైనాడమ్మా ఈ పిల్లగాలి తాకి ఇంతవాడైనాడమ్మా ఇంకెంతో అవుతాడమ్మా... ఏడ దాచుకోనమ్మా... ఏడ దాచుకోనమ్మా
ఓపలేని తీపి పాట సాహిత్యం
చిత్రం: రాజపుత్ర రహస్యం (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల ఓపలేని తీపి
దిక్కులెన్ని దాటాడో పాట సాహిత్యం
చిత్రం: రాజపుత్ర రహస్యం (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్. జానకి దిక్కులెన్ని దాటాడో
No comments
Post a Comment