Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ashoka Vanamlo Arjuna Kalyanam (2022)




చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
నటీనటులు: విశ్వక్ సేన్ , రుక్సర్ ధిల్లాన్ 
దర్శకత్వం: విద్యాసాగర్ చింతా
నిర్మాతలు: బాపినీడు, బి, సుదీర్ ఈదర 
విడుదల తేది: 2022



Songs List:



ఓ ఆడపిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: రామ్ మిరియాల

మాటరాని మాయవా
మాయజేయు మాటవా
మాటులోని మల్లెవా
మల్లెమాటు ముల్లువా

వయ్యారివా కయ్యారివా
సింగారివా సింగానివా
రాయంచవా రాకాసివా
లే మంచులో లావా నీవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా
నా జీవితంతో ఆటాడుతావా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా

బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని
కనుల పులిమావా..?
చిట్టి చిట్టీ చెక్కిళ్ళలో నునుపుని
నుదుటికియలేవా

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
ఆ ఆఆ ఆఆ ఆ

పది మంది చూస్తు ఉంటే
అడ్డడ్డే అమాయకంగా
ఒక్కరైనా లేకపోతే
అయ్యయ్యో మరో రకంగా
ఉంటూ నా ఎదనే తింటూ
ఈ కధనే సందేహంలో పడదోయకే
ఏంటో నీ ఇబ్బంది
చెప్పెయ్ ఏమౌతుంది
ఎట్టా అట్టా వెళ్ళిపోకే

తిక్కో టెక్కో… చిక్కో చుక్కో
అసలేదో ఒలిచి చెబుతావా
పట్టో బెట్టో… గుట్టో కట్టో
నిజమేదో చెవిన పడనీయ్ వా

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నీతోటి స్నేహం సచ్చేటి సావా

బతిమాలడానికైనా
ఇదిగో తయారుగున్నా
బదులియ్యి నేటికైనా
బతికియ్ ఏదో విధాన

తాకే ఆ తెరపై దూకే ఓ మెరుపై
నాకై నవ్వే విసిరావే
తీరా నీ ముందుంటే
తీరేలా పొమ్మంటూ
తీరం దాచి తిరిగావే

తప్పో ఒప్పో… గొప్పో ముప్పో
తెలుపక, లొసుగులెడతావా..?
మంచో చెడ్డో… కచ్చో పిచ్చో
తెలియక, నసిగి నడిచేవా..?

ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
సంద్రాలనైన ముంచేటి నావా..!!





ఓరోరి సిన్నవాడ పాట సాహిత్యం

 
చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
సాహిత్యం: సేనాపతి భరద్వాజ్ పాత్రుడు  
గానం: అనన్య భట్, గౌతమ్ భరద్వాజ్

ఓరోరి సిన్నవాడ సిన్నవాడ
గగ్గోలు పడకోయ్ పిల్లగాడా
ఇంచి గించి సోచాయించి
లాభం లేదురా

ఓరోరి సిన్నవాడ సిన్నవాడా
అబ్బబ్బా ఇననంటావేరా
ఆటా పాటా ఆటు పోటు
అంతా మాయరా

రా రా రాకుమారా శానా సూసానేరా
నీ కధ రాసే పని నాది
ఏందా తొత్తరా

ఓరోరి సిన్నవాడ సిన్నవాడ
గగ్గోలు పడకోయ్ పిల్లగాడా
ఇంచి గించి సోచాయించి
లాభం లేదురా

ఓరోరి సిన్నవాడ సిన్నవాడా
అబ్బబ్బా ఇననంటావేరా
ఆటా పాటా ఆటు పోటు
అంతా మాయరా

తలపులు మోసే కలవరమా
మనసుని మోసే కల నిజమా
వదలకు నన్నే ఆశవాదమా

ఆశ లేదు దోశ లేదు
ఏందిరా నీ సోది
బుర్ర దాకా పోనే పోదా
సెవిలో ఊదేది

చుప్ చాప్ గుంటూ సూస్తా ఉంటె
పోయేది ఏముంది
సరిసరి విషయమే
కురసగా చెప్పేసెయ్ ఓ సారి
అడుగులే తడబడే బతుకులో
భద్రం సంచారీ

రా రా రాకుమారా శానా సూసానేరా
నీ కధ రాసే పని నాది
ఏందా తొత్తరా

ఓరోరి సిన్నవాడ సిన్నవాడ
గగ్గోలు పడకోయ్ పిల్లగాడా
ఇంచి గించి సోచాయించి
లాభం లేదురా




రంగు రంగు రాంచిలకా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
సాహిత్యం: విజయ్ కుమార్ బల్లా, రవికిరణ్ కోలా
గానం: రవికిరణ్ కోలా

హ్మ్ ఉరికే నా సిలకా
నీ సక్కనైన పాట మెలిక

ఆ, గట్టుదాటి పుట్టాదాటి
ఏడేడు ఏర్లు దాటి

గట్టుదాటి పుట్టాదాటి
ఏడేడు ఏర్లు దాటి
కొండా దాటి… కోనా దాటి
కోసుకోస్లు దార్లు దాటి
సీమాసింతా నీడాకోచ్చానే


రంగు రంగు రాంచిలకా
సింగారాలా సోకులు చూసానే
రంగు రంగు రాంసిలకా
సింగారాలా సోకులు చూసానే

కళ్ళల్లోనా
కళ్ళల్లోనా వడ్డ అందం
గుండెల్లోనా సేరేలోగా
కళ్ళల్లోనా వడ్డ అందం
గుండెల్లోనా సేరేలోగా
రెక్కాలిప్పుకుని ఎగిరిపోయామే

రంగు రంగు రాంచిలకా
మనసునిరిచి మాయమయ్యావే
రంగు రంగు రాంసిలకా
మనసూనిరిసీ మాయమయ్యావే

తందర నానయ్యో… తందర నానయ్యో
పందిరి సందట్లో… అల్లరి ఏందయ్యో
తందర నానయ్యో… సుందరి ఏదయ్యో
గుండెల దాచావా బైటికి తీవయ్యో

తియ తియ్యని… తియ తియ్యని
తియ తియ్యని తేనెలూరు
లేతకెంపు పెదిమలు
వాలుకనులనెక్కుపెట్టి సంపేసిన సూపులు

సానబెట్టి సూపినావే
నీ ఒంపు సొంపులు
సానబెట్టి సూపినావే
నీ ఒంపు సొంపులు
ఆకాశమెత్తు ఆశ పుట్టించి
రంగు రంగు రాంచిలకా
పాతాళంలో పాతిపెట్టావే
రంగు రంగు రాంసిలకా
పాతాళంలో పాతిపెట్టావే

నువులేక నే లేనని రాసావే రాతలు
బతుకంతా నాతోనే ఉంటానని కూతలు
కల్లబొల్లి మాటలతో కొసావే కోతలు
కల్లబొల్లి మాటలతో కొసావే కోతలు

మార్సు మీద మేడ సూపెట్టి
రంగు రంగు రాంచిలకా
మోహం మీద మట్టి కొట్టావే
రంగు రంగు రంగు రంగు
రంగు రంగురాంసిలకా
నా మోహం మీద మట్టి కొట్టావే
రంగు రంగురాంసిలకా
నా మోహం మీద మట్టి కొట్టావే, హేయ్య్




ఈ వేడుకా నీలో మనసా పాట సాహిత్యం

 
చిత్రం: అశోక వనంలో అర్జున కళ్యాణం (2022)
సంగీతం: జయ్ క్రిష్
సాహిత్యం: రెహ్మాన్
గానం: హరిప్రియ, జయ క్రిష్

ఊగే ఊయలూగే
ఊహలేవో రాగమాలాయే
చూసే కళ్ళలోని మౌనమే
ఓ గానమాయే

ఊగే ఊయలూగే
ఊహలేవో రాగమాలాయే
చూసే కళ్ళలోని మౌనమే
ఓ గానమాయే

ఈ వేడుకా నీలో మనసా
తేలేదెలా నీ వరసా

ఈ మాయేమిటో తరిమే హాయేమిటో
నాతో నేనిలా జరిపే పోరేమిటో
ఈ జోరేమిటో అసలీతీరేమిటో
నే నీకేమిటో తెలిపే దారేమిటో

నే నీచెంతే ఉన్నా ఎంతో దూరాన ఉన్నా
కంచె తెంచలేని తెగువే కరువై
ఇన్ని చూస్తూ ఉన్నా నను నే ఆపేస్తూ ఉన్నా
గీతే దాటలేని బిడియం బరువై

ఈ వేడుకా నీలో మనసా
తేలేదెలా నీ వరసా

ఎన్నో రంగులే పెను సందేహాలుగా
నా చుట్టూ ఇలా నిలిచేలా
అన్నీరేఖలే ఇంకా రూపం లేదుగా
కాలం గీసిన చిత్రాలే

No comments

Most Recent

Default