చిత్రం: ధర్మపురి 1996 (2022) సంగీతం: ఓషో వెంకట్ నటీనటులు: గగన్ విహారి, అపర్ణా దేవి దర్శకత్వం: విస్వజగత్ సమర్పణ: వి.జె. శేఖర్ మాస్టర్ నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి విడుదల తేది: 22.04.2022
Songs List:
నల్లరేణి కళ్లదానా పాట సాహిత్యం
చిత్రం: ధర్మపురి 1996 (2022) సంగీతం: ఓషో వెంకట్ సాహిత్యం: భాస్కర్ యాదవ్ దాసరి గానం: అర్మాన్ మాలిక్ ఏలేల లేల లేల లేలో, ఓ ఓ సిట్టమొల్ల పొల్లాదానా… సిట్ట సిట్ట నడిసేదాన బీడీల బుట్టాదాన… కార్ఖాన తొవ్వదాన నిన్ను జూత్తే కన్నూగొట్టే… పాణమంతా ఇగముబట్టే అంబటేల సల్వా బుట్టే… పొద్దుమీకి గర్మీబట్టే పీరీల సాయబు ఏమౌతుందో సెప్పాబట్టే నల్లరేణి కళ్లదానా… నాగ నడుము దాన అల్లనేరెడు పందిరేసి… పెళ్ళి జేసుకోనా నల్లరేగడి మక్కసేనుల… పందిరి మంచం కాన మన ఎర్క పర్కలు చెప్పుకోని… ఎంగిలై పోదామా ఆ ఆఆ, సిట్టమొల్ల పొల్లాదానా సిట్ట సిట్ట నడిసేదాన బీడీల బుట్టాదాన కార్ఖాన తొవ్వదాన గునూగు పూలను పేర్చిన బతుకమ్మకు మొరను జెక్కే యాపాకుల్లో బంతులు సుట్టి బొట్టు పెట్టి బోనం మొక్కే పైలమైన సోపతి నాది పాణమైనా ఇత్తనే పిల్లా వద్దనీ సెప్పకు పొల్లా పతారా తీయకు మళ్ళా బొందిలో ఊపిరుండగా పట్టినేలు ఇడవను పిల్లా సావైనా బతుకైనా నీతోనే మళ్ళీ మళ్ళా నల్లరేణి కళ్లదానా… నాగ నడుము దాన అల్లనేరెడు పందిరేసి… పెళ్ళి జేసుకోనా నల్లరేగడి మక్కసేనుల… పందిరి మంచం కాన మన ఎర్క పర్కలు చెప్పుకోని… ఎంగిలై పోదామా మాగి దినం మొగులు మీద కాసిన సింగిడి నీవే మిరుగు పొద్దు దర్వాజలో వేసిన పసుపు నీవే ఎటమాటం సెయ్యకె నువ్వే నసీబని నమ్మితి పిల్లా పస్కమీద అమ్మోరికి లష్కర్ బోయి బోనమెత్తుతా తంగేడు పువ్వోలె నిన్ను పాయిరంగా జూసుకుంటా పైడి ముడుపు లగ్గం బెట్టి సుట్టాలకు సెప్పొత్తానే నల్లరేణి కళ్లదానా… నాగ నడుము దాన అల్లనేరెడు పందిరేసి… పెళ్ళి జేసుకోనా నల్లరేగడి మక్కసేనుల… పందిరి మంచం కాన మన ఎర్క పర్కలు చెప్పుకోని… ఎంగిలై పోదామా
అయ్యయ్యో అయ్యయ్యో పాట సాహిత్యం
చిత్రం: ధర్మపురి 1996 (2022) సంగీతం: ఓషో వెంకట్ సాహిత్యం: శ్రేష్ట గానం: అనురాగ్ కులకర్ణి , రమ్యా బెహ్రా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఈ సిత్రమేందోయ్యో గిర గిర బొంగరంలా తిరిగిందయ్యో నా బుర్ర సుర సుర సురుకులాగా తగిలిందయ్యో రాకాసిపిల్లా మిట్ట మిట్టా కళ్ళే మిణుగురళ్లే మెరుత్తాఅంటే అగ్గిపూల సెట్టై ఇట్టా అట్టా ఊగుతున్నా చీటికి మాటికి సీటీలే గుండె సిత్రంగేస్తాంటే పొగడపూల బాణం విసిరి పక్కున నవ్వేను నాగమల్లే నాగమల్లే నాగమల్లే అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఈ సిత్రమేందోయ్యో గిర గిర బొంగరంలా తిరిగిందయ్యో నా బుర్ర సుర సుర సురుకులాగా తగిలిందయ్యో రాకాసిపిల్లా బంగారు మెరుపులా ఘాటైన మిరపలా మాటలతో మంటే రేపెను పైపైకొచ్చేసి గులాబి నవ్వుతో ఓ సూది ముల్లులా నా గుండె గుచ్చి దండే కట్టే ఎట్లయ్యె సోగకళ్ళ పొల్లగాడా మరుగు మందే పెట్టేసాల గుండెనిట్ఠా సూడతాంటే ఎట్టాగట్టా అంటావే వడి వడీ నీ సూపే సోకుకు బేడీలేస్తాంటే పడి పడి గాడీ తప్పి మడే ఇడిసే వయసు ... అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఈ సిత్రమేందోయ్యో గిర గిర బొంగరంలా తిరిగిందయ్యో నా బుర్ర సుర సుర సురుకులాగా తగిలిందయ్యో రాకాసిపిల్లా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో ఆ ఆఆ ఆఆ ఆ .....
నడిచా నడిచా పాట సాహిత్యం
చిత్రం: ధర్మపురి 1996 (2022) సంగీతం: ఓషో వెంకట్ సాహిత్యం: విస్వజగత్ గానం: చిన్మయి శ్రీపాద, శ్రీకృష్ణ , అమల చేబోలు నడిచా నడిచా నీ అడుగుతోనే ఏడడుగులవ్వాలనీ వేచా వేచా నీ వేలు కొరకే ఈ జన్మనివ్వాలని ఏడేడు లోకాలు మన వెంట రావా ఈ జంట కనలేదనీ నే వేడుకోనా నా గుండె గుడిని నీ తోడు ఎన్నటికీ విడబోననీ నడిచా నడిచా… నీ అడుగుతోనే ఏడడుగులవ్వాలనీ వేచా వేచా… నీ వేలు కొరకే ఈ జన్మనివ్వాలనీ నీతోటి గడిపేటి ఈ ఘడియలే ముమ్మాటికీ మారవే నన్నంటినా నీటి ఈ గురుతులే ఏనాటికీ చెరగవే గోదారి సాక్షాలు… పక్షుల్ల రాగాలు మన పెళ్లి మంత్రాలుగా ఇక నిండు నూరేళ్ళు మన జంట జగతంతా వర్ధిల్లి తీరాలిగా వెతికా వెతికా కనులార పతికై కరుణించి పంపాడుగా నిలిచా నిలిచా నీరాకకొరకై నా చెంత చేరావుగా
సోద్యాలో సోద్యాలో నాగమల్లి పాట సాహిత్యం
చిత్రం: ధర్మపురి 1996 (2022) సంగీతం: ఓషో వెంకట్ సాహిత్యం: ఒగ్గు బాపన్న & బ్యాచ్ గానం: ఒగ్గు బాపన్న & బ్యాచ్ సోద్యాలో సోద్యాలో నాగమల్లి
సేనుపక్క పాట సాహిత్యం
చిత్రం: ధర్మపురి 1996 (2022) సంగీతం: ఓషో వెంకట్ సాహిత్యం: లక్ష్మీపుత్ర హర్ష గానం: అరుణ్ కౌండిన్య సేనుపక్క
పొగరుగల్ల పోరిరా పాట సాహిత్యం
చిత్రం: ధర్మపురి 1996 (2022) సంగీతం: ఓషో వెంకట్ సాహిత్యం: లక్ష్మీపుత్ర హర్ష గానం: అరుణ్ కౌండిన్య పొగరుగల్ల పోరిరా
No comments
Post a Comment