చిత్రం: K.G.F Chapter 2 (2022) సంగీతం: రవి బసృర్ నటీనటులు: యష్, శ్రీనిధి షెట్టి, సంజయ్ దత్, రవీనాటాండన్ దర్శకత్వం: ప్రశాంత్ నీల్ నిర్మాత: విజయ్ కిరగందూర్ విడుదల తేది: 14.04.2022
Songs List:
తూఫాన్ పాట సాహిత్యం
చిత్రం: K.G.F Chapter 2 (2022) సంగీతం: రవి బసృర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సాయి కృష్ణ , పృద్వీ చంద్ర , అరుణ్ కౌండిన్య , సాయి చరణ్, సంతోష్ వెంకయ్, మోహన్ కృష్ణ, సచిన్ బసృర్, రవి బసృర్, పునీత్ రుద్రనాగ్ , మనీష్ దినకర్ , హరిణి ఇవటూరి , గిరిధర్ కామత్, రక్షా కామత్ , సించన కామత్, నిశాంత్ కిని, భారత్ భట్ , అనఘ నాయక్, అవని భట్, స్వాతి కామత్, శివానంద్ నాయక్, కీర్తన బసృర్ తూఫాన్
ఎదగరా ఎదగరా పాట సాహిత్యం
చిత్రం: K.G.F Chapter 2 (2022) సంగీతం: రవి బసృర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సుచేత బసురూర్ ఎదగరా ఎదగరా
సుల్తానా పాట సాహిత్యం
చిత్రం: K.G.F Chapter 2 (2022) సంగీతం: రవి బసృర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సాయి కృష్ణ , పృద్వీ చంద్ర , అరుణ్ కౌండిన్య , సాయి చరణ్, సంతోష్ వెంకయ్, మోహన్ కృష్ణ, సచిన్ బసృర్, రవి బసృర్, పునీత్ రుద్రనాగ్ , మనీష్ దినకర్ , హరిణి ఇవటూరి రణ రణ రణ రణధీరా గొడుగెత్తే నీలి గగనాలు రణ రణ రణ రణధీరా పదమొత్తె వేల భువనాలు రణ రణ రణ రణధీరా తలవంచే నీకు శిఖరాలు రణ రణ రణ రణధీరా జేజేలు పలికే ఖనిజాలు నిలువెత్తు నీ కదము ముష్కరులపాలి ఉక్కు సమ్మెటా అనితరము నీ పదము అమావాస్య చీల్చు అగ్గి బావుటా రగిలే పగిలే నిట్టూర్పులకు నీ వెన్నుదన్నే ఓదార్పు మా బతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపు వైపు ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తాన ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా, ఆ ఆ కధమెత్తిన బలవిక్రముడై దురితమతులు పని పట్టు పేట్రేగిన ప్రతి వైరుకలా పుడమి ఒడికి బలిపెట్టు ఏయ్, కట్టకటిక రక్కసుడే ఒక్కొక్కడు వేటుకొకడు ఒరిగేట్టు వెంటపడు సమరగమన సమవర్తివై నేడు శత్రుజనుల ప్రాణాలపైనబడు తథ్యముగ జరిగి తీరవలే కిరాతక దైత్యుల వేట ఖచ్చితముగా నీ ఖడ్గ సిరి గురితప్పదెపుడు ఏ చోటా రగిలే పగిలే నిట్టూర్పులకు నీ వెన్నుదన్నే ఓదార్పు మా బతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపు వైపు (జై జై జై… జై జై జై) రణ రణ రణ రణధీరా గొడుగెత్తే నీలి గగనాలు రణ రణ రణ రణధీరా పదమొత్తె వేల భువనాలు రణ రణ రణ రణధీరా తలవంచే నీకు శిఖరాలు రణ రణ రణ రణధీరా జేజేలు పలికే ఖనిజాలు నిలువెత్తు నీ కదము ముష్కరులపాలి ఉక్కు సమ్మెటా అనితరము నీ పదము అమావాస్య చీల్చు అగ్గి బావుటా రగిలే పగిలే నిట్టూర్పులకు నీ వెన్నుదన్నే ఓదార్పు మా బతుకిదిగో నీకై ముడుపు నడిపించర తూరుపు వైపు ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ధీర ధీర ధీర ధీరా సుర సుల్తాన ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా, ఆ ఆ
మెహబూబా పాట సాహిత్యం
చిత్రం: K.G.F Chapter 2 (2022) సంగీతం: రవి బసురూర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనన్య భట్ మండే గుండెలో చిరుజల్లై వస్తున్నా నిండు కౌగిలిలో మరుమల్లెలు పూస్తున్నా ఏ అలజడి వేళనైనా తలనిమిరే చెలినై లేనా నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోనా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… ఓ మై తెరి మెహబూబా చనువైన వెన్నెల్లో చల్లారనీ అలలైనా దావానలం ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు జత కావాలి అందాల చెలి పరిమళం రెప్పలే మూయని విప్పు కనుదోయికి లాలి పాడాలి పరువాల గమదావనం వీరాధి వీరుడివైన పసివాడిగ నిను చూస్తున్నా నీ ఏకాంతాల వెలితే పూరిస్తా ఇకపైనా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… మై తెరి మెహబూబా మెహబూబా… ఓ మై తెరి మెహబూబా హుహు హూ మ్ హూ హూ హూ హుహు హూ మ్ ఊహుఁ హుఁ
తందాని నానే తానితందానో పాట సాహిత్యం
చిత్రం: K.G.F Chapter 2 (2022) సంగీతం: రవి బసురూర్ సాహిత్యం: అదితి సాగర్ గానం: అదితి సాగర్ పడమర నిశితెర వాలనీ చరితగా ఘనతగా వెలగరా అంతులేని గమ్యము కదరా అంతవరకు లేదిక నిదురా అష్టదిక్కులన్నియూ అదర అమ్మకన్న కలగా పదరా చరితగా ఘనతగా వెలగరా చరితగా ఘనతగా వెలగరా జననిగా దీవెనం గెలుపుకె పుస్తకం… నీ శఖం ధగ ధగ కిరణమై ధరణిపై చేయరా సంతకం తందాని నానే తానితందానో తానె నానేనో హే, నన్నాని నానే తానితందానో తానె నానేనో
No comments
Post a Comment