చిత్రం: ఉగ్రం (2023) సంగీతం: శ్రీ చరణ్ పాకాల నటీనటులు: అల్లరి నరేష్ , మిర్నా మీనన్ దర్శకత్వం: విజయ్ కనకమేడల నిర్మాతలు: సాహు గారపాటి , హరీష్ పెద్ది విడుదల తేది: 05.05.2023
Songs List:
దేవేరి పాట సాహిత్యం
చిత్రం: ఉగ్రం (2023) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: శ్రీమణి గానం: అనురాగ్ కులకర్ణి దేవేరి గుండెల్లో చేరి మదిలో మోగిందే సరిగమ సావేరి నా దారి ఎక్కడో చేజారి పాదం చేరిందే నువు నడిచే దారి ఎప్పటికప్పుడు నువ్వలా ఎదురై నవ్వుతు ఉంటె అప్పటికప్పుడు గుండెకే చప్పుడు పెరుగుతూ ఉందే ఎం చేసిన ఎం చూసినా నీ ఊహలే నను ముంచెనే నీ కోసమే నిలబడమని నా ప్రాణమంది వినవె దేవేరి గుండెల్లో చేరి మదిలో మోగిందే సరిగమ సావేరి నా దారి ఎక్కడో చేజారి పాదం చేరిందే నువు నడిచే దారి సాగే పయనాన ఎన్ని సంగతులో లెక్కపెట్టగలమా జారే నిమిషాలే ఆగే మన తీపి గురుతు వలనా పెదవికి నిదుర కనులకి కలుకు చెవులకు చూపు నేర్పినావులే స్పర్శలు కలిపి సైగలు చెరిపి కొత్త బాషా రాసావులే హృదయము కదిపి కుదురుని కుదిపి బ్రతుకున జతపడి శ్రుతులతో ముడిపడి నిలబడమంది నిలకడగా నీతోడై దేవేరి గుండెల్లో చేరి మదిలో మోగిందే సరిగమ సావేరి నా దారి ఎక్కడో చేజారి పాదం చేరిందే నువు నడిచే దారి
No comments
Post a Comment