Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Yatra 2 (2024)




చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
నటీనటులు: ముమ్మట్టి, జీవ,  కేతకీ నారాయణ్, Suzanne Bernert
దర్శకత్వం: మహి. వి. రాఘవ్
నిర్మాత: శివ మేక
విడుదల తేది: 08.02.2024



Songs List:



ప్రజా సంకల్ప యాత్ర పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కపిల్ కపిలన్ 

ప్రజా సంకల్ప యాత్ర 




భగ భగ మండే పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: దీపక్ బ్లూ

భగ భగ మండే 



తొలి సమరం పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: గౌతం భరద్వాజ్ 

ధమ్మే ధం ధం సన్నద్ధం
రంగం సర్వం సిద్ధం
ధమ్మే… ధర్మంగా అడుగేద్దాం
ధమ్మెంతో చూపేద్దాం… తలపడదాం

ధమ్మే… ధం ధం సన్నద్ధం
రంగం సర్వం సిద్ధం భయపడం
ఎలుగెత్తిన భాస్వర స్వరమే మనం
(ధమ్మే… ధర్మంగా అడుగేద్దాం
ధమ్మెంతో చూపేద్దాం)
ఇది భళ్ళున పెళ్లున పేలిన మౌనం

ఓ ఓ, ఎదురన్నది ఎవరైనా
ఎదిరిద్దాం తలవంచేదే
లేదని చెబుదాం
సయ్యంటు బరిలో దిగుదాం
తొలి గెలుపు జెండా ఎగురేద్దాం

జంకేదే లేదు
మహానేత వారసులు మనం
పౌరుషాల సీమ బిడ్డలం
గాయమైంది ఆత్మ గౌరవం
పెచ్చు మీరుతోంది పెత్తనం

కొంత వరకే ఓర్చుకోగలం
తెగించామో తేల్చుకోగలం
చాలు చాలు చాలు ఊడిగం
అణిచే హస్తం విరిచే వీరులమౌవుదాం

హే, అనివార్యం ధిక్కారం
అవసరమే ఈ సమరం

ఇది సూన్యం పెను సూన్యం
పరీక్షించెనే సమయం
తడబడకన్నది మనోనిశ్చయం
కొనసాగాలి సేవాకార్యం
ఆగిపోరాదుగా ఆశయం
జనమే ధైర్యం, జనమే సైన్యం

ఇక అంతరాయమే లేని
గమనమే గమ్యం

అనుమతులు పరిమితులు ఇక చెల్లే
ఏదైతే కాని పయనం కదిలే
సందేహమే లేదు అసలే
మన విజయం ఇక్కడి నుండి మొదలే

జంకేది లేదు
మహానేత వారసులు మనం
పౌరుషాల సీమ బిడ్డలం
గాయమైంది ఆత్మ గౌరవం
పెచ్చుమీరుతోంది పెత్తనం

కొంత వరకే ఓర్చుకోగలం
తెగించామో తేల్చుకోగలం
చాలు చాలు చాలు ఊడిగం
అణిచే హస్తం విరిచే వీరులమౌవుదాం





చూడు నాన్న పాట సాహిత్యం

 
చిత్రం: యాత్ర 2 (2024)
సంగీతం: సంతోష్ నారాయణ్ 
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: విజయ్ నారాయణ్ 

చూడు నాన్న
చూస్తున్నావా నాన్నా
నీడ లేని నేనా వీళ్ళ ధీమా
ఏమిటీ ఇంతటి ప్రేమా

నా దారెటో తోచకుంటే
నీ వెంబడే మేము అంటూ
కదిలారు ఏంటో ఆ నమ్మకం
నేనెలా ఒడ్డుకి చేరడం
వీళ్ళనెలా ఒడ్డుకి చేర్చడం

ఇంటి పెద్దా కన్నుమూస్తే
అయినవాళ్ళు అనాధలే కదా
నువ్వే లేకా ప్రతి ఊరు ఊరు
అనాధ అవ్వడం ఏందయ్యా
ఇది ఏనాడు జరిగుండదయ్యా
ఓ పెద్దయ్యా

ఇందరి కన్నులు
చిమ్మే కన్నీటినంతా
తుడవాలనుంది కొడుకుగా
అందుకు అవసరమయ్యే
కొండంత ధైర్యం నాకు ఇవ్వవా

నేనెలా బాధని మింగడం
వీళ్ళనెలా నే ఓదార్చడం

ఎంతలా అభిమానమే
కురిపిస్తున్నారో ఈ జనం
అందుకే ఈ జన్మలో
తీర్చేసుకుంటా ఈ రుణం
గడపకి ప్రతి గడపకి
నేనవుతా రక్షా తోరణం
మాటపై ఉంటానని
చేస్తున్నా తొలి సంతకం

చూడు నాన్న (x8)

No comments

Most Recent

Default