చిత్రం: కోర్ట్ (2025) సంగీతం: విజయ్ బుల్గానిన్ నటీనటులు: ప్రియదర్శి పులికొండ, హర్ష రోషన్, శ్రీదేవి దర్శకత్వం: రామ్ జగదీష్ నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని విడుదల తేది: 14.03.2025
Songs List:
2025
,
Court
,
Harsh Roshan
,
Prashanti Tipirneni
,
Priyadarshi
,
Priyadarshi Pulikonda
,
Ram Jagadeesh
,
Sridevi
,
Vijay Bulganin
Court (2025)
Palli Balakrishna
Monday, March 24, 2025
ఫోక్ సాంగ్: కు కు కుమారి సాహిత్యం: సాయి ప్రసాద్ పూజారి సంగీతం: మదీన్ SK గాయని: సాకేత్ కొమందూరి, స్ఫూర్తి జితేందర్ నటినటులు: అమర్ దీప్ చౌదరి, విష్ణుప్రియ కోరియోగ్రఫీ: సునీల్ సున్నపు ప్రొడ్యూసర్స్: శేఖర్ VJ, రవి పీతల
కు కు కుమారి పాట సాహిత్యం
ఫోక్ సాంగ్: కు కు కుమారి సాహిత్యం: సాయి ప్రసాద్ పూజారి సంగీతం: మదీన్ SK గాయని: సాకేత్ కొమందూరి, స్ఫూర్తి జితేందర్ నటినటులు: అమర్ దీప్ చౌదరి, విష్ణుప్రియ కోరియోగ్రఫీ: సునీల్ సున్నపు ప్రొడ్యూసర్స్: శేఖర్ VJ, రవి పీతల నా కుకు నిన్న వొడ్డు వాక అల్లి వాక లంబా లంబా ఆకురంభ నియ్యా జీకే వాహ చిప్ల టంబ టంబ… గునుపు టుల్లు టుల్లు జోనులు హులులు లు లు సిక్కి వక్క… కుకు కుకుకు కుకు… లష్కర్ జాతర్లనా.. ఆర్మూరం గట్లనా తిరుపతి తిరునాళ్ళనా… అమెరికా ఆగంట్లనా కు కు కుమారి సీరలేడ కొన్నవే సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే కు కు కుమారి సీరలేడ కొన్నవే..? సీకటైన మిలమిలమిల మెరుస్తున్నయే ఆ కంచివరముకు… గా గద్వాల్ సీరకు ఉప్పాడ పట్టుకు… సిద్ధిపేట సీరకు పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా నేను కట్టుకొని అన్నిటిని ఫేమస్ జేసినా పో పో పోకిరి పేరు నేనే దెచ్చినా నేను కట్టుకొని… అన్నిటిని ఫేమస్ జేసినా చిరుగాలికి సీరెగురుతుంటే… యెహె యెహె యెహెయ్ కు కు కుమారి… కెవ్వు కేక ఉన్నవే బొట్టు పెట్టుకున్న… బుట్ట బొమ్మలెక్కగున్నవే కు కు కుమారి సీరలేడ కొన్నవే..? సీకటైన మిలమిలమిల మెరుస్తున్నవే ఆ సందమామను… ఆ వెండి సుక్కను గా మెరుపు తీగను… రంగుల హరివిల్లును కు కు కుమారి… బువ్వ లెక్క తిన్నవా నీ బుగ్గలు బూరెడు పూవుల లెక్క వున్నయే, హెయ్ చింతపండు పిసుకుతూ నిమ్మకాయ పిండుతూ ఇంగువాను సల్లుతూ పులిహోర కలుపుతూ… పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ పో పో పోకిరి… నీలా మస్తు గిలికిరీ అందరిని మడత వెట్టి జేశ్న ఇస్తిరీ నీ కోపమెంత ముద్దుగుందే, యే యె ఉమ్మ కు కు కుమారి సుర్రు సూపరున్నవే సూపుతోని దిల్ కసకస నరుకుతున్నవే… నా కుకు నిన్న వొడ్డు వాక అల్లి వాక లంబా లంబా ఆకురంభ నియ్యా జీకే వాహ చిప్ల టంబ టంబ… గునుపు టుల్లు టుల్లు జోనులు హులులు లు లు సిక్కి వక్క… కుకు కుకుకు కుకు… ఏనుగెక్కి వస్తనే ఎదురు కట్నమిస్తనే ఏలు పట్టుకుంటనే నిన్ను ఏలుకుంటనే కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే కు కు కుమారి పెండ్లి చేసుకుంటనే ఏడు అడుగులేసి మెడల మూడు ముళ్ళు గడ్తనే, హే హేయ్ నీ మాయ మాటలు నీ చిలిపి చేష్ఠలు నీ కొంటె సూపులు తెచ్చినాయి నవ్వులు కు కు కుమారి మనసు దోచినావురా మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా కు కు కుమారి మనసు దోచినావురా మణికట్టుకు మల్లెలు సుట్టుకోని ఉరికిరా గట్లుంటదే మనతోని మరి కుకు కుకు కుకు కు కు కుమారి మురళీకృష్ణుని నేను అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను కు కు కుమారి మురళీకృష్ణుని నేను అనుకుంటే ముద్దు పెటేదాకా నిద్దురపోను
Amardeep Chowdary
,
Ku Ku Kumari
,
Ravi Peetla
,
Sai Prasad Poojari
,
Saketh Komanduri
,
Sekhar VJ
,
SK Madeen
,
Spoorthi Jithender
,
Vishnu Priya
Album: Ku Ku Kumari
Palli Balakrishna
పాట: రామసక్కని సూపులోడే సాహిత్యం – మహేందర్ ముల్కల సంగీతం – కళ్యాణ్ కీస్ గాయని – వాగ్దేవి
రామసక్కని సూపులోడే పాట సాహిత్యం
పాట: రామసక్కని సూపులోడే సాహిత్యం – మహేందర్ ముల్కల సంగీతం – కళ్యాణ్ కీస్ గాయని – వాగ్దేవి రామసక్కని సూపులోడే రవ్వల దుగ్గిలు తెచ్చినాడే పున్నమి ఘడియల చందురుడే పూవ్వుల వాసనకు వచ్చినాడే వాని చక్కని సూపుల చెక్కెర తీపికి చుక్కలే ధాటినట్టుందే గుప్పెడు గుండెలో ప్రేమలు కొట్టిన గంటలే మోగినట్టుందే గాయి గాయి తిరుగుతుందే ప్రాణం గంప కింద గమ్ముతాందే రామసక్కని సూపులోడే రవ్వల దుగ్గిలు తెచ్చినాడే పున్నమి ఘడియల చందురుడే పూవ్వుల వాసనకు వచ్చినాడే నల్లని కన్నుల మన్మథుడే నవ్వుల బాణాలు వేసినాడే హద్దుల దాటని అల్లరోడే ముద్దుల తోటకు పిలిచినాడే వాని అత్తరు సెంటు సోకులకు మత్తు మందుల ముంచినట్టుందే ఎన్నడూ చూడని వింత లోకాలన్నీ కొత్తగా చూసినట్టుందే గాయి గాయి అంటావుండే ఈడు దారి తప్పి పోతావుందే రామసక్కని సూపులోడే రవ్వల దుగ్గిలు తెచ్చినాడే పున్నమి ఘడియల చందురుడే పూవ్వుల వాసనకు వచ్చినాడే వెన్నెల దారుల్లా వన్నెగాడే వేకువ జామున కలిసినాడే గాబురాల ముద్దు పిల్లగాడే గారడి మాయలు చేసినడే వాని అడుగుల సప్పుడు అర్దుమ రాత్రి నిదుర లేపినట్టుందే పచ్చని పైరులా వెచ్చని గాలులు పరువులా తాకినట్టుందే గాయి గాయి మత్తుగుందే ఒళ్ళు సోయ తప్పి పోతావుండే రామసక్కని సూపులోడే రవ్వల దుగ్గిలు తెచ్చినాడే పున్నమి ఘడియల చందురుడే పూవ్వుల వాసనకు వచ్చినాడే బంగారు నవ్వుల చిన్నవాడే బావంటూ బంధాలు కలిపినాడే ఆ నీలి మబ్బుల అందగాడే అందరి మనసులు గెలిచినాడే వాని నవ్వుల తీరుకు వాగులు వంకలు పొంగి పొర్లినట్టుగుండే ఆ వాన చినుకులు అందాల మెరుపులు కన్నులే గీటినట్టుందే జోరు జోరు జారుతుందే కొంగు జోడి ఏదని అడుగుతుందే నచ్చిన ముద్దుల పిల్లగాడా నీతోనే మనువాడుకుంటాను రా గుండెల్లో నిండిన బావగాడా గువ్వా గోరింకోలే తోడుంటారా నచ్చిన ముద్దుల పిల్లగాడా నీతోనే మనువాడుకుంటాను రా గుండెల్లో నిండిన బావగాడా గువ్వా గోరింకోలే తోడుంటారా
Album: Ramasakkani Supulode
Palli Balakrishna
పాట: సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల సంగీతం: కళ్యాణ్ కీస్ రచన: మహేందర్ ములకాల గానం: DJ శివ వంగూర్, శ్రీనిధి ఆర్టిస్ట్స్: జానులిరి, రాజేష్ కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ ప్రొడ్యూసర్: సంతోష్ యాదవ్ రికార్డింగ్ లేబుల్:: E96TV FOLK విడుదల: 14.05.2024
సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ు పాట సాహిత్యం
పాట: సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల సంగీతం: కళ్యాణ్ కీస్ రచన: మహేందర్ ములకాల గానం: DJ శివ వంగూర్, శ్రీనిధి సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోన నదులన్నీ కలిసినట్టు ఓ పిలగ నవ్వెంత బాగున్నదీ నీలోన గాజుల సప్పులు ఘల్ ఘల్ మోగంగా గజ్జెల పట్టీలు గంతేసి ఆడంగా వరిగడ్డి మోపు ఎత్తి ఓ పిల్ల వయ్యారి నడుమూపవే ఈ వేళ సిగ్గు సింగారాలు సిలుకుతున్నట్టుగా ముద్దు మందారాలు పలుకుతున్నట్టుగా మాయా మాటలు పలుకకూ ఓ పిలగా మా అన్నలొస్తున్నరు తోవల్ల సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగూళ్ళుగుతున్నయే లోలోన పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట పచ్చ జొన్నల కంకులు ఓ పిల్ల పాలొంచి వంగినయ్యి సేనంత రామసిలకల సూపులూ చాలింక రత్నాల బొమ్మనైతి మా ఇంట వెయ్యంచు పువ్వుల్లో వెలిగింది నీ రూపు దీపాల కాంతుల్లో దరిచేరు నా వైపు జోడెడ్ల బండి గట్టీ ఓ పిల్ల జోరుగ ఎక్కిస్తనే ఈ వేళ ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి మదిలోన పూసింది మందార సిరిమల్లి మరుగు మాటల వాడివే ఓ బావ మా వదినలొస్తున్నరు తోవల్ల బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా బాయిగడ్డన పూసినై ఓ పిల్ల బంగారు కుసుమ పూలు నిండుగా పూసిన పున్నమోలే నేనున్న బంగారు బొమలెందుకోయ్ నాకింకా కారెండ పడవీలో కస్తూరి రంగాయే వెండీ కొండలమీన వెలుగన్న లేదాయే నెమలి కన్నుల దానివే ఓ పిల్ల నెలవంక తీరున్నవే ఈ వేళ నల్ల కలువల మీద నాటు తుమ్మెదవోలే అడవి మల్లెలమీద ఆ చంద్రవంకోలే కొంటే చూపుల వాడివే ఓ బావ కోడళ్ళు వస్తున్నరు తోవల్ల పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల సింగిడి రంగులల్లా పూసేటి సిరి జొన్నకంకినైతి తోటల్లా పొద్దుతిరుగుడు పువ్వులా ఓ పిల్ల పొద్దంతా నిను చూస్తనే తొవ్వల్ల సింగిడి రంగులల్లా పూసేటి సిరి జొన్నకంకినైతి తోటల్లా చినుకమ్మ మెరుపమ్మ చినబోయినట్టుంది చలిమంట గిలిమంట ఎదలోన రగిలింది చిలుక గోరింకవోలే కూడుండి చితి మీద తోడొస్తనే ఓ పిల్ల పాల ముత్యాలన్ని పరువాలు పలుకంగా పండు వెన్నెల వచ్చి పందిళ్లు వేయంగా మొగిలి పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ మొగిలి పువ్వుల వాడివే ఓ బావ మనువాడి కలిసుంటనే నీ తోడ
Album: Selayeru Paduthunte (2024)
Palli Balakrishna
Subscribe to:
Posts
(
Atom
)