పాట: రామసక్కని సూపులోడే సాహిత్యం – మహేందర్ ముల్కల సంగీతం – కళ్యాణ్ కీస్ గాయని – వాగ్దేవి
రామసక్కని సూపులోడే పాట సాహిత్యం
పాట: రామసక్కని సూపులోడే సాహిత్యం – మహేందర్ ముల్కల సంగీతం – కళ్యాణ్ కీస్ గాయని – వాగ్దేవి రామసక్కని సూపులోడే రవ్వల దుగ్గిలు తెచ్చినాడే పున్నమి ఘడియల చందురుడే పూవ్వుల వాసనకు వచ్చినాడే వాని చక్కని సూపుల చెక్కెర తీపికి చుక్కలే ధాటినట్టుందే గుప్పెడు గుండెలో ప్రేమలు కొట్టిన గంటలే మోగినట్టుందే గాయి గాయి తిరుగుతుందే ప్రాణం గంప కింద గమ్ముతాందే రామసక్కని సూపులోడే రవ్వల దుగ్గిలు తెచ్చినాడే పున్నమి ఘడియల చందురుడే పూవ్వుల వాసనకు వచ్చినాడే నల్లని కన్నుల మన్మథుడే నవ్వుల బాణాలు వేసినాడే హద్దుల దాటని అల్లరోడే ముద్దుల తోటకు పిలిచినాడే వాని అత్తరు సెంటు సోకులకు మత్తు మందుల ముంచినట్టుందే ఎన్నడూ చూడని వింత లోకాలన్నీ కొత్తగా చూసినట్టుందే గాయి గాయి అంటావుండే ఈడు దారి తప్పి పోతావుందే రామసక్కని సూపులోడే రవ్వల దుగ్గిలు తెచ్చినాడే పున్నమి ఘడియల చందురుడే పూవ్వుల వాసనకు వచ్చినాడే వెన్నెల దారుల్లా వన్నెగాడే వేకువ జామున కలిసినాడే గాబురాల ముద్దు పిల్లగాడే గారడి మాయలు చేసినడే వాని అడుగుల సప్పుడు అర్దుమ రాత్రి నిదుర లేపినట్టుందే పచ్చని పైరులా వెచ్చని గాలులు పరువులా తాకినట్టుందే గాయి గాయి మత్తుగుందే ఒళ్ళు సోయ తప్పి పోతావుండే రామసక్కని సూపులోడే రవ్వల దుగ్గిలు తెచ్చినాడే పున్నమి ఘడియల చందురుడే పూవ్వుల వాసనకు వచ్చినాడే బంగారు నవ్వుల చిన్నవాడే బావంటూ బంధాలు కలిపినాడే ఆ నీలి మబ్బుల అందగాడే అందరి మనసులు గెలిచినాడే వాని నవ్వుల తీరుకు వాగులు వంకలు పొంగి పొర్లినట్టుగుండే ఆ వాన చినుకులు అందాల మెరుపులు కన్నులే గీటినట్టుందే జోరు జోరు జారుతుందే కొంగు జోడి ఏదని అడుగుతుందే నచ్చిన ముద్దుల పిల్లగాడా నీతోనే మనువాడుకుంటాను రా గుండెల్లో నిండిన బావగాడా గువ్వా గోరింకోలే తోడుంటారా నచ్చిన ముద్దుల పిల్లగాడా నీతోనే మనువాడుకుంటాను రా గుండెల్లో నిండిన బావగాడా గువ్వా గోరింకోలే తోడుంటారా
Subscribe to:
Post Comments
(
Atom
)
No comments
Post a Comment