Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Missamma (1955)




చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
నటీనటులు: యన్.టి.రామారావు, భానుమతి రామకృష్ణ, సావిత్రి, నాగేశ్వరరావు అక్కినేని, జమున
దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్
నిర్మాత: బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణి
విడుదల తేది: 12.01.1955



Songs List:



రాగ సుధారస పానము పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: త్యాగరాజ 
గానం: పి. లీల, జిక్కీ 

రాగ సుధారస పానము చేసి రాజిల్లవే  ఓ మనసా
రాగ సుధారస
రాగ సుధారస పానము చేసి రాజిల్లవే  ఓ మనసా
రాగ సుధారస

యాగ యోగ త్యాగ భోగ ఫల మొసంగే
యాగ యోగ త్యాగ భోగ ఫల మొసంగే

రాగ సుధారస పానము చేసి రాజిల్లవే  ఓ మనసా
రాగ సుధారస

సదాశివ మయమగు నాదోంకార స్వర
సదాశివ మయమగు నాదోంకార స్వర
విధులు జీవన్మూక్తులని త్యాగరాజు
విధులు జీవన్మూక్తులని త్యాగరాజు తెలియు

రాగ సుధారస పానము చేసి రాజిల్లవే  ఓ మనసా
రాగ సుధారస




బాబు ధర్మం చెయ్ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం:  రేలంగి 

బాబూ..బాబు బాబు
బాబు ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు

కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం 
బాబు కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం 
పాటు పడగయే పని రాదాయే సాటి మనిషిని సావనా బాబూ

ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు

ఐస్ క్రీం తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు
అయ్యా..అమ్మా..బాబూ..
చేసే దానం చిన్నది అయినా పాపాలన్నీ బావును బాబూ

ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు

నీ చెయి పైన నా చెయి కింద
ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ
మన చిట్టాలు రాసే జమలే బాబూ
ధర్మం అరణా ఒరణా రెండణా

ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు




ఆడువారి మాటలకు పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఎ.ఎమ్.రాజా

(ఈ పాటని పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ (2001)  సినిమాలో రీమిక్స్ చేశారు దీనికి సంగీతం మణిశర్మ సమకూర్చారు, మురళీధర్ ఆలపించారు)

అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్దాలే వేరులే
అర్దాలే వేరులే అర్దాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో
చెలిమి జేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో
మరియాదగా పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్దాలే వేరులే
అర్దాలే వేరులే అర్దాలే వేరులే

విసిగి నసిగి కసిరినచో 
విసిగి నసిగి కసిరినచో 
విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన
తరచి తరచి ఊసడిగిన 
సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్దాలే వేరులే
అర్దాలే వేరులే అర్దాలే వేరులే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్దాలే వేరులే
అర్దాలే వేరులే అర్దాలే వేరులే 





బాలనురా మదనా పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి. సుశీల 

బాలనురా మదనా బాలనురా మదనా
విరి పువ్వులు వేయకురా మదనా
బాలనురా మదనా

నిలిచిన చోటనే నిలువగ నీయక ఆ..
నిలిచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియునురా
తియ్యని తలపులు విరియునురా మదనా

బాలనురా మదనా బాలనురా మదనా
విరి పువ్వులు వేయకురా మదనా
బాలనురా మదనా

చిలుకల వలె గోర్వంకల వలెనో ఓ..
చిలుకల వలె గోర్వంకల వలెనో
కులుకగ తోచనురా
తనువున పులకలు కలుగునురా మదనా

బాలనురా మదనా బాలనురా మదనా
విరి పువ్వులు వేయకురా మదనా
బాలనురా మదనా

చిలిపి కోయిలలు చిత్తములోనే ఏ..
చిలిపి కోయిలలు చిత్తములోనే
కల కల కూయునురా
మనసులు కలవర పరచునురా మదనా

బాలనురా మదనా బాలనురా మదనా
విరి పువ్వులు వేయకురా మదనా
బాలనురా మదనా




తెలుసుకొనవే చెల్లి పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం:  పి. లీల 

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి
మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని
మగవారికి దూరముగా మగువలెపుడూ మెలగాలని
తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి

మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని ఆ...
మనకు మనమే వారి కడకు పని ఉన్నా పోరాదని
అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని
అలుసు చేసి నలుగురిలో చులకనగా చూసెదరని

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి

పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని ఆ...
పదిమాటలకొక మాటయు బదులు చెప్పకూడదని
లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని
లేని పోని అర్దాలను మన వెనుకనే చాటెదరని

తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
తెలుసుకొనవే చెల్లి




తెలుసుకొనవే యువతి పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఎ.ఎమ్.రాజా   

తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి
యువకుల శాసించుటకే ఏ..
యువకుల శాసించుటకే యువతులవతరించిరని
తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి

సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని ఆ..
సాధింపులు బెదిరింపులు ముదితలకిఅ కూడవని
హృదయమిచ్చి పుచ్చుకొనే
హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదే నేర్పాలని

తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి

మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని ఆ..
మూతిబిగింపులు అలకలు పాతపడిన విద్యలని
మగువలెపుడూ మగవారిని 
మగువలెపుడూ మగవారిని చిరునవ్వుల గెలావాలని

తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి
తెలుసుకొనవే యువతి




కరుణించు మేరిమాత పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి. లీల

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత
కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత

పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ
పరిశుద్దాత్మ మహిమ వర పుత్రుగంటివమ్మ
ప్రభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత

తుదిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకు
తుదిలేని దారి చేరి పరిహాసమాయే బ్రతుకు
క్షణమైనా శాంతిలేదే దినదినము శోధనాయే

కరుణించు మేరిమాత శరణింక మేరిమాత
నీవే శరణింక మేరిమాత




ఈ నవనవాభ్యుదయ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఎ.ఎమ్.రాజా 

ఆ..ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో
చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే

ఆ తలుకు తలుకుమని తారలు మెరిసే
నీలాకశము నాదేలే
ఎల్లరి వనముల కలవర పరిచే
జిలిబిలి జాబిలి నాదేలే ఏ..

కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే

ఆ.. ప్రశాంత జగమును హుషారు చేసే
వసంత ఋతువు నాదేలే
పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే...
మలయమారుతము నాదేలే..ఏ

కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే



బృందావనమది అందరిదీ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: ఎ.ఎమ్.రాజా, పి.సుశీల 

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే





రావోయి చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి.లీల, ఏ.యమ్.రాజా

రావోయి చందమామ మా వింత గాద వినుమా 
రావోయి చందమామ మా వింత గాద వినుమా 

చరణం: 1
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే 

చరణం: 2
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా 

చరణం: 3
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్‌ 

చరణం: 4
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటన గనుమా




ఏమిటో ఈ మాయ పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: పి. లీల  

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

వినుటయే కాని వెన్నెల మహిమలు
వినుటయే కాని వెన్నెల మహిమలు
అనుభవించి నేనెరుగనయా
అనుభవించి నేనెరుగనయా
నీలో వెలసిన కళలు కాంతులు
నీలో వెలసిన కళలు కాంతులు
లీలగా ఇపుడే కనిపించెనయా

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ

కనుల కలికమిది నీ కిరణములే
కనుల కలికమిది నీ కిరణములే
మనసును వెన్నెగా చేసెనయా
మనసును వెన్నెగా చేసెనయా
చెలిమి కోరుతూ ఏవో పిలుపులు
చెలిమి కోరుతూ ఏవో పిలుపులు
నాలో నాకే వినిపించెనయా

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ




సీతారం సీతారం పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: రేలంగి 

సీతారం సీతారం సీతారం జయ సీతారం 
సీతారం సీతారం సీతారం జయ సీతారం 

పైన పటారం లోన లోటారం
ఈ జగమంతా డంబాచారం

సీతారం సీతారం సీతారం జయ సీతారం 

నీతులు పలుకుతూ ధర్మ విచారం
గోతులు తీసే గూఢాచారం 

సీతారం సీతారం సీతారం జయ సీతారం 

చందాలంటూ భలే ప్రచారం
వందలు వేలు తమ ఫలహారం

సీతారం సీతారం సీతారం జయ సీతారం 

గుళ్ళో హాజరు ప్రతి శనివారం
గూడుపుఠాణి ప్రతాదివారం

సీతారం సీతారం సీతారం జయ సీతారం 

డాబులు కొడుతూ లోక విహారం
జేబులు కొట్టే ఘన వ్యాపారం

సీతారం సీతారం సీతారం జయ సీతారం 

టాకు టీకుల టక్కు టామారం
కలికాలం మన గ్రహచారం

సీతారం సీతారం సీతారం జయ సీతారం 
సీతారం సీతారం సీతారం జయ సీతారం 
సీతారం జయ సీతారం రం సీతారం జయ సీతారం  





శ్రీ జానకి దేవి పాట సాహిత్యం

 
చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు
గానం: 

శ్రీ జానకి దేవి సీమంతమలరె
మహలక్ష్మి సుందరవదనారము గనరే
పన్నీరు గంధాలు సఖిపైన చిలికించి
కానుకలు కట్నాలు చదివించరమ్మా
మల్లేమొల్లలసరులు సతిజడను సవరించి
ఎల్లా వేడుకలిపుడు చేయించరమ్మా
కులుకుచు కూర్చున్న కలికిని తిలకించి
అలుక చెందనీక అలరించరమ్మా
కులమెల్ల దీవించు కొమరును గనుమంచు
ఎల్లముత్తెదువులు దీవించరమ్మా

మేరీ :
ఏమిటో ఈ మాయా - ఓ
చల్లని రాజా- వెన్నెలరాజూ
వినుటయెకాని వెన్నెల మహిమలు
అనుభవించి నే నెరుగనయా
నీలో వెలసిన కళలూ కాంతులు
లీలగ యిపుడే కనుపించెనయా
కనుల కలికమిడి నీ కిరణములే
మనసును వెన్నగ చేసెనయా
చెలిమి కోరుచూ - ఏవో పిలువులు
నాలో నాకే వినుపించెనయా

Most Recent

Default