Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Amma Rajinama (1991)

చిత్రం: అమ్మా రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: సత్యనారాయణ కైకాల , శారద, సాయికుమార్ , దాసరి నారాయణరావు
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాతలు: కె.దేవి వరప్రసాద్, టి.త్రివిక్రమ రావు, సి.అశ్వనీదత్
విడుదల తేది:  Dec. 1991

Songs List:

చనుబాలు తాగితేనే పాట సాహిత్యం

చిత్రం: అమ్మా రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది
ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది
చనుబాలు తాగితేనే బ్రతుకు తీపి తెలిసింది
ఆరు రుచులు తగలగానే అమ్మే చేదవుతుంది
రొమ్మేగా... రొమ్మేగా అందించెను జీవితాన్ని నోటికి
అమ్మేగా తన నెత్తురు నింపెను నీ ఒంటికి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగంలా తియ్యని రాగం

ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు
అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు
ఆలైన బిడ్డలైన ఒకరు పొతే ఇంకొకరు
అమ్మా పదవి ఖాలీ అయినా అమ్మా అవరు ఇంకెవరు

అమ్మంటే...అమ్మంటే విరమించని వట్టి వెట్టి చాకిరీ
అమ్మంటే రాజీనామా ఎరగనీ ఈ నౌకరి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగంలా తియ్యని రాగం

ఎవరు రాయగలరు...పాట సాహిత్యం

చిత్రం: అమ్మా రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర 

పల్లవి:
ఎవరు రాయగలరు... 
అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు...
అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

అమ్మేగా... అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

చరణం: 1
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అవతారమూర్థైనా అణువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు

అమ్మేగా... అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

చరణం: 2
శ్రీరామరక్ష అంటూ... నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు అంటూ... నిత్యం దీవించింది
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు అంటూ నిత్యం దీవించింది

నూరేళ్ళు... నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మచేతి వేళ్ళతో

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

చీకటిలో ఆడపిల్ల పాట సాహిత్యం

చిత్రం: అమ్మా రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో , మిన్ మిని 

చీకటిలో ఆడపిల్ల 

ఇది ఎవ్వరూ ఎవ్వరికి పాట సాహిత్యం

చిత్రం: అమ్మా రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో 
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని

ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు

పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు బార్యయై 
బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా
నవ్వులు ఏడుపులు కలిపి దిగమింగి ఇంటినే గుడిచేసిన దేవతా
శలవిమ్మని అడిగితే...
ఇక శలవిమ్మని అడిగితే...
ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు

భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై 
నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి
బ్రతుకే హారతి ఇచ్చిన దేవతా
శలవిమ్మని అడిగితే...
ఇక శలవిమ్మని అడిగితే...
ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో 
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు

సృష్టికర్త ఒక బ్రహ్మ పాట సాహిత్యం

చిత్రం: అమ్మా రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జే. ఏసుదాసు

పల్లవి:
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్థంభింప చేసే తంత్రాలు ఎన్నో

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

చరణం: 1
బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
విత్తునాటి చెట్టు పెంచితే...
చెట్టు పెరిగి పళ్ళు పంచితే...
తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే
లోకమా... ఇది న్యాయమా? 
లోకమా... ఇది న్యాయమా?

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

చరణం: 2
ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఉగ్గుపోసి ఊసు నేర్పితే... 
చేయిబట్టి నడక నేర్పితే...
పరుగు తీసి పారిపోతే చేయిమార్చి చిందులేస్తే
లోకమా... ఇది న్యాయమా? 
లోకమా... ఇది న్యాయమా?

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో...
ఈ సృష్టినే స్థంభింప చేసే తంత్రాలు ఎన్నో

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ

Most Recent

Default