చిత్రం: బాణం (2009) సంగీతం: మణిశర్మ నటీనటులు: నారా రోహిత్, వేదిక దర్శకత్వం: చైతన్య దంతులూరి నిర్మాత: ప్రియాంక దత్ విడుదల తేది: 16.09.2009
Songs List:
కదిలే పాదం పాట సాహిత్యం
చిత్రం: బాణం (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వనమాలి గానం: శంకర్ మహదేవన్ కదిలే పాదం
నాలో నేనేనా ఏదో అన్నానా పాట సాహిత్యం
చిత్రం: బాణం (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం : హేమచంద్ర , సైంధవి నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపునా... ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా... నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపునా... ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా... అలా సాగిపోతున్న నాలోన ఇదేంటిలా కొత్త ఆలోచన మనసే నాది మాటే నీది ఇదే మాయో నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపునా... ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా... ఔనో కాదో తడబాటునీ అంతో ఇంతో గడి దాటనీ విధి విడిపోనీ పరదానీ పలుకై రానీ ప్రాణాన్ని ఎదంత పదాల్లోన పలికేనా... నా మౌనమే ప్రేమ ఆలాపనా మనసే నాది మాటే నీది ఇదే మాయో నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపునా... ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా... దైవం వరమై దొరికిందనీ నాలో సగమై కలిసిందనీ మెల మెళకువ కాని హృదయాన్ని, చిగురైపోనీ సిసిరాన్ని నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం నాలో నేనేనా ఏదో అన్నానా నాతో నే లేని మై మరపునా... ఏమొ అన్నానేమో, నువ్వు విన్నావేమో చిన్న మాటేదో నిన్నడగనా...
పదర పదర పాట సాహిత్యం
చిత్రం: బాణం (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రంజిత్, ఖుషి మురళి పదర పదర
మోగింది జేగంట పాట సాహిత్యం
చిత్రం: బాణం (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శ్రేయ ఘోషాల్ తననాన నానాన తననాన నానాన మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట కొలిచే దైవాలంతా దీవించారనుకుంటా నను పిలిచినది పూబాట తనతో పాటే వెళ్లిపోతా... ఆకాశం నీడంతా నాదేనంటోంది అలలు ఎగసే ఆశ... ఏ చింతా కాసింత లేనే లేదంది కలత మరిచే శ్వాస... మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట మనసంటోంది ఈ మాట పదపదమని నది నడకనీ ఇటు నడిపినదెవరైనా తన పరుగులో తెలి నురగలో నను నేనే చూస్తున్నా ప్రతి పిలుపునీ కథ మలుపనీ మలి అడుగులు వేస్తున్నా అలుపెరుగనీ పసి మనసునై సమయంతో వెళుతున్నా నలుసంత కూడా నలుపేది లేని వెలుగుంది నేడు నా చూపున ఏ దూరమో ఏ తీరమో ప్రశ్నించనీ పయనంలోన ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా... మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట మనసంటోంది ఈ మాట ఒక చలువన ఒక వెలువన జత కలిసినదో సాయం మనసెరిగిన మధుమాసమై నను చేర్చిందే గమ్యం కల నిలవని కనుపాపలో కళలొలికినదో ఉదయం అది మొదలున నను ముసిరిన ఏకాంతం మటుమాయం నా చుట్టూ అందంగా మారింది లోకం ఊహల్లోనైనా లేదీ నిజం చిరునవ్వుతో ఈ పరిచయం వరమైయిలా నను చేరేనా బదులడగని ఈ పరిమళం నా జన్మనే మురిపించేనా... మోగింది జేగంట మంచే జరిగేనంటా మనసంటోంది ఈ మాట ఓ మనసంటోంది ఈ మాట
బాణం థీమ్ మ్యూజిక్ పాట సాహిత్యం
చిత్రం: బాణం (2009) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: రంజిత్, ఖుషి మురళి, నవీన్, హనుమంత్ రావు బాణం థీమ్ మ్యూజిక్