చిత్రం: ఆత్మబలం (1964) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, బి. సరోజాదేవి, జగ్గయ్య దర్శకత్వం: వి.మధుసూదనరావు నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 09.01.1964
Songs List:
చిటపట చినుకులు పడుతూవుంటే పాట సాహిత్యం
చిత్రం: ఆత్మబలం (1964) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల చిటపట చినుకులు పడుతూవుంటే చెలికాడే సరసన వుంటే చెట్టపట్టగ చెతులుపట్టి చెట్టునీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి ఉరుములు పెళపెళ ఉరుముతు వుంటే మెరుపులు తళతళ మెరుస్తు వుంటే మెరుపు వెలుగులొ చెలికన్నులలొ బిత్తర చూపులు కనపడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి కారుమబ్బులు కమ్ముతువుంటే కమ్ముతువుంటే... ఓ.. కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే కారుమబ్బులు కమ్ముతువుంటే కమ్ముతువుంటే... ఓ.. కళ్ళకు ఎవరు కనబడకుంటే కనబడకుంటే జగతిన వున్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే జగతిన వున్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి చలిచలిగా గిలివేస్తుంటే ఆ..హా..హా..హా... గిలిగింతలు పెడుతూవుంటే ఓ..హో..హో..హో చలిచలిగా గిలివేస్తుంటే ఆ..హా..హా..హా... గిలిగింతలు పెడుతూవుంటే ఓ..హో..హో..హో చెలిగుండియలొ రగిలేవగలే చెలిగుండియలొ రగిలేవగలే చలిమంటలుగా అనుకుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి చిటపట చినుకులు పడుతూవుంటే చెలికాడే సరసన వుంటే చెట్టపట్టగ చెతులుపట్టి చెట్టునీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ వుంటుందోయి
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి పాట సాహిత్యం
చిత్రం: ఆత్మబలం (1964) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి వయసుతోటి దోర దోర సొగసులొస్తాయి సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి వయసుతోటి దోర దోర సొగసులొస్తాయి సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి చూపులతో లేని పోని గీరలొస్తాయి ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి కళ్ళలు వదిలితే కదం తొక్కుతాయి పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయి గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి హృదయమంతా పాకుతుంది హుషారైన హాయి మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి హృదయమంతా పాకుతుంది హుషారైన హాయి కలకాలం ఉండదు ఈ పడచు బడాయి తొలినాడే చల్లబడి పోవునమ్మాయి బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి కళ్ళు చూసి మోసపోయి కలవరించకు ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు ఇస్తేను హృదయమెంతో మెత్తనైనది ఎదురుతిరిగితే అదే కత్తి వంటిది గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో ఉన్నది భలే బడాయి
ఎక్కడికి పోతావు చిన్నవాడా పాట సాహిత్యం
చిత్రం: ఆత్మబలం (1964) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల ఎక్కడికి పోతావు చిన్నవాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు మనసు మనసు తెలిసినాక మారలేవు మనసు మనసు తెలిసినాక మారలేవు ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా నన్నిడిచి నువ్వేళితే నీ వెంట నేనుంటా నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ప్రేమంటే అంతేరా పిచ్చివాడా ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా ఎక్కడికి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా పాడమ్మా పాడు పాడమంటే పాడేది పాటకాదు ఆడమంటే ఆడేది ఆటకాదు పాడమంటే పాడేది పాటకాదు ఆడమంటే ఆడేది ఆటకాదు ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా నీ చూపులను ఓపలేను పిల్లవాడా ఎక్కడికి పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా ఎక్కడికి పోలేను చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా
పరుగులు తీసే నీ వయసునకు పాట సాహిత్యం
చిత్రం: ఆత్మబలం (1964) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు ఓహోయని పలికెను నీ వలపు ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు ఓహోయని పలికెను నీ వలపు ఓయని పలికెను నీ వలపునకు తీయగా మారెను నా తలపు తియ్యతీయగా మారెను నా తలపు ఒహొహొహొ హొహొహొ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు ఆహా దోబూచాడెను నా నగవు దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు దోరదోరగ పండెను నీ మరులు ఒహొహొహొ హొహొహొ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు లేదనిపించే నీ నడుము అహహ నాదనిపించెను ఈ క్షణము ఒహొ లేదనిపించే నీ నడుము నాదనిపించెను ఈ క్షణము ఉందో లేదో ఈ జగము ఉందువు నీవు నాలో సగము ఇది నిజము కాదనుము పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
తెల్లవారనీకు ఈ రేయిని పాట సాహిత్యం
చిత్రం: ఆత్మబలం (1964) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి.సుశీల తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని నీ కన్నులలో మధువులన్నీ జురుకోని ఆ కైపులో లోకాలే మరువన్ నీ కన్నులలో మధువులన్నీ జురుకోని ఆ కైపులో లోకాలే మరువన్ మనసులో మనసునై మసలనీ మనసులో మనసునై మసలనీ నీ మనిషినై మమతనై మురిసిపోనీ తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని నీ కురులే చీకటులై కప్పివేయనీ ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోనీ నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ తడి ఆరని హృదిలో నను మెలకలెత్తనీ తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ అల్లరి పడుచుదనం కొల్లబోనీ మల్లెపూల తెల్లదనం మనసు నిండనీ అల్లరి పడుచుదనం కొల్లబోనీ కొల్లగొన్న మనసే నా ఇల్లనీ కొల్లగొన్న మనసే నా ఇల్లనీ చల్లగా కాపురము ఉండిపోనీ తెల్లవారనీకు ఈ రేయిని తీరిపోనీకు ఈ తియ్యని హాయిని తెల్లవారనీకు ఈ రేయిని
నాలుగు కళ్ళు రెండైనాయి పాట సాహిత్యం
చిత్రం: ఆత్మబలం (1964) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి ఉన్న మనసు నీ కర్పణ జేసి లేనిదాననైనాను ఏమిలేనిదాననైనాను నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళైనా కరువైనాయి కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళైనా కరువైనాయి రెండూ లేక పండు రేకులై ఎందుకు నాకీ కనుదోయి ఇంకెందుకు నాకీ కనుదోయి నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి కదిలే శిలలా మారిపోతిని కథగానైనా మిగలనైతిని కదిలే శిలలా మారిపోతిని కథగానైనా మిగలనైతిని నిలువునా నన్ను దోచుకుంటివి నిరుపేదగా నే నిలిచిపోతిని నిరుపేదగ నే నిలిచిపోతిని నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి ఉన్న మనసు నీ కర్పణ జేసి లేనిదాననైనాను ఏమిలేనిదాననైనాను నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
నాలుగు కళ్ళు రెండైనాయి పాట సాహిత్యం
చిత్రం: ఆత్మబలం (1964) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, జమునారాణి నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి ఉన్న మనసు నీ కర్పణ జేసి లేనిదాననైనాను ఏమిలేనిదాననైనాను నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళైనా కరువైనాయి కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళైనా కరువైనాయి రెండూ లేక పండు రేకులై ఎందుకు నాకీ కనుదోయి ఇంకెందుకు నాకీ కనుదోయి నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి కదిలే శిలలా మారిపోతిని కథగానైనా మిగలనైతిని కదిలే శిలలా మారిపోతిని కథగానైనా మిగలనైతిని నిలువునా నన్ను దోచుకుంటివి నిరుపేదగా నే నిలిచిపోతిని నిరుపేదగ నే నిలిచిపోతిని నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి ఉన్న మనసు నీ కర్పణ జేసి లేనిదాననైనాను ఏమిలేనిదాననైనాను నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
రంజు రంజు పాట సాహిత్యం
చిత్రం: ఆత్మబలం (1964) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఘంటసాల, పి. సుశీల రంజు రంజు