చిత్రం: అదృష్టవంతులు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు, జయలలిత దర్శకత్వం: వి.మధుసూదనరావు నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 03.01.1969
Songs List:
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతులు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వెంకటరత్నం గానం: పి. సుశీల మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా వేళ దాటి వస్తినా వెన్నక్కి తిరిగి పోతివా తంటా మన ఇద్దరికి తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా!! మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు హా..ఓ..హ్మ్మ్.. మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాము అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాము గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తినా తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా
అయ్యయ్యో బ్రహ్మయ్యా పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతులు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల పల్లవి: అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా చరణం: 1 చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్లు పసినిమ్మ పండులాగా మిసమిసలాడే ఒళ్లు బెట్టుచూసి గుట్టుదాచే గడసరి సొగసరికళ్లు కొంత కొడెతనముంది మరికొంత ఆడతనముంది అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా చరణం: 2 మూతిచూస్తే మీసమింకా మొలిచినట్టులేదూ బెదరుచూస్తే ఎవ్వరితోను కుదిరినట్టులేదూ -ఆ కసురులోనె అలకనవ్వులు విసురు లేకపోలేదు కొంత చిలిపితనముంది మరికొంత కలికితనముంది అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా చరణం: 3 బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెక్కిపోతుంటే కన్నెపిల్లలే చూశారా కన్నుగీటక మానేరా? కవ్వించే కౌగిలిలో కరిగించక వొదిలేరా? అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
నా మనసే గోదారి పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతులు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: నా మనసే గోదారి నీ వయసే కావేరి నా మనసే గోదారి నీ వయసే కావేరి బోల్ రాధా బోల్ రెండూ కలిసేనా లేదా అరే బోల్ రాధా బోల్ జోడీ కుదిరేనా లేదా నా మనసే గోదారి నీ వయసే కావేరి బోల్ రాధా బోల్ రెండూ కలిసేనా లేదా అరే బోల్ రాధా బోల్ జోడీ కుదిరేనా లేదా నేనేం చేసేదయ్యో దద్దమ్మవు దొరికావు అరే ఏం చెప్పేదయ్యో శుద్ధ మొద్దువి దొరికావు నేనేం చేసేదయ్యో దద్దమ్మవు దొరికావు అరే ఏం చెప్పేదయ్యో శుద్ధ మొద్దువి దొరికావు దద్దమ్మవు దొరికావు...శుద్ధ మొద్దువి దొరికావు చరణం 1: కృష్ణుడు నేనే రుక్మిణి నీవే రాతిరి ఎత్తుకు పోతాను లారీ మెల్లగా తోలుకువస్తా చల్లగ లేచిపోదాము మీ అమ్మే యమగండం మా తల్లే సుడిగుండం బోల్ రాధా బోల్ గండం తప్పేనా లేదా అరే బోల్ రాధా బోల్ జోడీ కుదిరేనా లేదా చరణం: 2 లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యె ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె మనసే ఠారెత్తె మా ప్రేమయే జావై పోయెను గుండెలే పగిలి చద్దామింక దిక్కెవ్వరో.... పోవే శాకినీ ఢాకినీ కదులు పో పో వెళ్ళిపో లంకిణీ... చరణం: 3 బోల్ అమ్మా బోల్ జోడీ కలిసిందా లేదా బోల్ అత్తా బోల్ రోగం కుదిరిందా లేదా బోల్ అమ్మా బోల్ జోడీ కలిసిందా లేదా బోల్ అత్తా బోల్ రోగం కుదిరిందా లేదా బోల్ అమ్మా బోల్ జోడీ కలిసిందా లేదా బోల్ అత్తా బోల్ రోగం కుదిరిందా లేదా.... రోగం కుదిరిందా లేదా....
పడిన ముద్ర చెరిగిపోదురోయ్ పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతులు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల పల్లవి: హొ..హొ..హొ..హొహ్హొ.. హొ..హొ..హొ..హొహ్హొ.. పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ పడుచు గుండె విడిచి పోదురోయ్ పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా పిల్ల మనసు మారిపోదురోయ్... పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ పడుచు గుండె విడిచి పోదురోయ్.. పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా పిల్ల మనసు మారిపోదురోయ్... చరణం: 1 మచ్చికైన పాల పిట్టను...ఓ.. రాజా.. నా... రాజా మచ్చికైన పాల పిట్టను ... వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్ మచ్చికైన పాల పిట్టను ... వలపంతా ఇచ్చుకున్న కన్నెపిల్లనోయ్ నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్... నీ జబ్బ మీద పచ్చబొట్టునోయ్... ఔరౌరా... నీ రొమ్ము మీద పుట్టుమచ్చనోయ్... హొ..హొ..హొ..హ్హొ...హొ..హొ..హొ..హొ పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ పడుచు గుండె విడిచి పోదురోయ్ పెరటి చెట్టు పారిపోదురోయ్ సోగ్గాడా పిల్ల మనసు మారిపోదురోయ్... చరణం: 2 డేగలాగా ఎగిరిపోతివోయ్... నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్... డేగలాగా ఎగిరిపోతివోయ్... నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్... పాలలోన తేనె కలిసెనోయ్.....ఓ..రాజా..నా..రాజా పాలలోన తేనె కలిసెనోయ్... నేడే మన పరువానికి పండుగైనదోయ్... హొ..హొ..హొ..హొహ్హొ..హొ..హొ..హొ..హొ పడిన ముద్ర చెరిగిపోదురోయ్ వన్నెకాడ పడుచు గుండె విడిచి పోదురోయ్ పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా... పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా.. పడిన ముద్ర చెరిగిపోదురోయ్... సోగ్గాడా... పడిన ముద్ర చెరిగిపోదురోయ్...
చింత చెట్టు చిగురు చూడు.. పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతులు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్ నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్ చింత చెట్టు చిగురు చూడు.. చిన్నవాడి బెదురు చూడు చింత చెట్టు కాపుకొచ్చిందోయ్.. నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్ నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్ చరణం' 1 పాలవయసు పొందుకోరి పొంగుతున్నది నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది పాలవయసు పొందుకోరి పొంగుతున్నది నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది వగలమారి వాలుచూపు వొర్రగున్నది అది వెంటపడితె ఏదేదో వెర్రిగున్నది చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు చింత చెట్టు కాపుకొచ్చిందోయ్ నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్ నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్ చరణం: 2 పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నదీ ఈ ఈ.. పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నదీ జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు చింత చెట్టు కాపుకొచ్చిందోయ్.. నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్ నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్ చరణం: 3 వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది ఇంతలేసి కన్నులతో మంతరిస్తది... ఇంతలేసి కన్నులతో మంతరిస్తది... అహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా.. చిన్నదేమో తియ్యగున్నాదోయ్ నా సామిరంగా... చిన్నదేమో తియ్యగున్నాదోయ్ చింత చెట్టు చిగురు చూడు.. చిన్నవాడి బెదురు చూడు చింత చెట్టు కాపుకొచ్చిందోయ్ నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్ నా సామిరంగా.. చిన్నదేమో దాపుకొచ్చిందోయ్...
కోడి కూసే జాము దాకా పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతులు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల పల్లవి: కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా చరణం: 1 కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను కన్నె బుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తె కైపులెక్కెను కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువరేడా కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా చరణం: 2 కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట మత్తు తెలిసిన చందురూడా...మసక వెలుగే చాలు లేరా కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా చరణం: 3 అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట తీపి మాపుల చందురూడా... కాపువై నువ్వుండి పోరా కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా కోడి కూసే జాము దాకా తోడురారా చందురూడా కోడె కారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
ము ము ముద్దంటే చేదా పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతులు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల ము ము ము ము ము ము ము ముద్దంటే ము ము ము ము ముద్దంటే ము ము ము ము ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా..రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా సైరా..ఓ అలీఫ్ లైలా..ఓ హసీన్ తబలా గుల్ మొహార్ పిల్లా..రావె రంగీలా హైరా..ఆ నజర్ కో ఘజలా..నీ ఫిగర్ ఓ పజిలా యువనరాల విజిలా..హార్ట్ ఫార్ములా మాష మాష అల్లా..పరువాల అంబరిల్లా నీ నీడలోనె తడిసా..ఇల్లా సోకు అగ్గిపుల్లా..నిలువెల్ల మత్తు జిల్లా ఈ రాత్రి నితో ఎల్లా..ఖిల్లా సైరా..ఓ అలీఫ్ లైలా..ఓ హసీన్ తబలా గుల్ మొహార్ పిల్లా..రావె రంగీలా హైరా..ఆ నజర్ కో ఘజలా..నీ ఫిగర్ ఓ పజిలా యువనరాల విజిలా..హార్ట్ ఫార్ములా ఓ ము ము ము ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా..రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా yo yo you are my laptop Let me get you load on cam I am so hot..show me your website Reach cam .. Blow me the whole night హే..కలీ కలీ అనార్కలీ..తూహీ మేరా దిల్ జరా చలో అనీ నీ సిగ్గుకే చెక్కుకోవే అల్విదా చెకూముకీ బహారులా చెంపకే మేరీ సాహిబా ముఖా ముఖీ తుహారిలో తెంపనా నీ దిల్ రుబా రేయి రేయి సెగలో రగడంటి జీవితానా అరె హాయి హాయి జగడం ప్రేమే ! సైరా..ఓ అలీఫ్ లైలా..ఓ హసీన్ తబలా గుల్ మొహార్ పిల్లా..రావే రంగీలా హైరా..ఆ నజర్ కో ఘజలా..నీ ఫిగర్ ఓ పజిలా యువనరాల విజిలా..హార్ట్ ఫార్ములా ఓ ము ము ము ము ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా..రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా హే ఖుషీ ఖుషీ దుబాయిలా..ఖూబ్ సూరత్ దాచకే కసీ కసీ హలీం లా లే షరాబీ లీయవే వహా వహా తపించకే..మేలి ముసుగూ చాటునా జహాపనా నేనయ్యి నీ లే జవానీ ఏలనా చిందులాటలోనా..ఇంకెంత గాయమైనా అందాలు పొందు యుద్దం ప్రేమే ! సైరా..ఓ అలీఫ్ లైలా..ఓ హసీన్ తబలా గుల్ మొహార్ పిల్లా..రావే రంగీలా హైరా..ఆ నజర్ కో ఘజలా..నీ ఫిగర్ ఓ పజిలా యువనరాల విజిలా..హార్ట్ ఫార్ములా ఓ ము ము ము ము ముద్దంటే చేదా..నీకా ఉద్దేశం లేదా ఇపుడొద్దాన్నావంటే కుర్రవాడా..రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
నమ్మరే నేను మారానంటే పాట సాహిత్యం
చిత్రం: అదృష్టవంతులు (1969) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల నమ్మరే నేను మారానంటే నమ్మరే....... నేనొకనాడు దొంగని అయితే మాత్రం ఏం? బాగుపడే యోగం లేదా? బ్రతికే అవకాశం ఈరా ? చెడినవాడు చెడే పోవాలా ?...... పాతిపెట్టిన పాతబ్రతుకు వలవేస్తుంది కోరుకున్న కొత్త జీవితం వెలివేస్తుంది కష్టం చేస్తానంటే కాదంటారే? నా శ్రమలో ద్రోహం ఉందా? నా చెమటలో దోషముందా? .......... ఎవరు నమ్మకున్నా నన్ను నమ్ముకున్న వారున్నారే వాళ్ళేం కావాలీ? నేనేం చేయాలీ ?