Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aaradhana (1962)




చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాతలు: వి.బి రాజేంద్రప్రసాద్, డి.రంగారావు
విడుదల తేది: 16.02.1962



Songs List:



నా హృదయంలొ నిదురించే చెలీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల

నా హృదయంలొ నిదురించే చెలీ
కలలలోనె కవ్వించే సఖీ
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవె నన్ను దోచినావె
నా హృదయంలో నిదురించె చెలీ

నీ కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా
కన్నులలోనా దాగెనులే వెన్నెల సోనా
చకోరమై నిను వరించి అనుసరించినానే
కలవరించినానె

నా హృదయంలొ నిదురించే చెలీ

కలలలోనె కవ్వించే సఖీ
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవె నన్ను దోచినావె
నా హృదయంలో నిదురించె చెలీ

నా గానములొ నీవే
ప్రాణముగ పులకరించినావే
ప్రాణముగ పులకరించినావే
పల్లవిగ పలుకరించరావే
పల్లవిగ పలుకరించరావే
నీ వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా
వెచ్చని నీడా వెలసెను నా వలపుల మేడా
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానె

నా హృదయంలొ నిదురించే చెలీ
కలలలోనె కవ్వించే సఖీ
మయూరివై వయ్యారివై నేడే
నటనమాడి నీవె నన్ను దోచినావె
నా హృదయంలో నిదురించె చెలీ





నీ చెలిమి పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: నార్ల చిరంజీవి 
గానం: పి.సుశీల

నీ చెలిమి 



ఏమంటావ్ ఏమంటావోయ్ బావ పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, స్వర్ణలత 

ఏమంటావ్ ఏమంటావోయ్ బావ 




ఓహొహొ మామయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఇంటిని విడిచి షికారు కొడితే ఎంతో హాయి కలదయ్యా


ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి
ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి
మాటలు రాని మృగాలు కొన్ని మనిషి కి పాఠం చెబుతాయి

చరణం: 1
పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగిన ప్రమాదమే.. ఓ మావయ్యా మావయ్యా

కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు..
ఓ అమ్మాయీ.. అమ్మాయీ

శౌర్యం పెరిగిన మనిషిని మృగాన్ని కటకటాలలో పెడతారు
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

చరణం: 2
గుర్రపు అంశం గాడిద వంశం చారల చారల జీబ్రావి
చుక్కల జిరాఫి ఒంటెకు బంధువు.. మనిషికి బంధువు చింపాంజిపంజి
మనిషి చేష్టలు కోతులకుంటే .. కోతి చేష్టలు కొందరివి..
వా...ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ, బలెబలె బతికిన కాలేజి

చరణం: 3
తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది..
ఓ మావయ్యా.. మావయ్యా
ఏనుగు వంటిది నీటిగుర్రము.. దానికి తమ్ముడు ఖడ్గమృగం
అధికులు పేదల కాల్చుకు తింటే.. ఇవి ఆకూఅలమే తింటాయి
ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా

రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా
రోజులు మారాయ్ రాజులు పోయి ప్రజలే ప్రభువులు ఈనాడు..
అహ.. ప్రజలే ప్రభువులు ఈనాడు
మనుషుల పైన సవారికన్నా ఏనుగు సవారి నయం కదా
ఆ నిజం నిజం .. అహ మజా మజా

ఓహొహొ మామయ్యా ఇదేమయ్యా.. బలెబలె బాగా ఉందయ్యా
ఓహొహొ అమ్మాయీ ఇది కాలేజీ... బలెబలె బతికిన కాలేజి




ఆడదాని ఓర చూపులో పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం:  యస్.జానకి

ఆడదాని ఓర చూపులో 



వెన్నెలలో వికాశమే పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పి. సుశీల 

వెన్నెలలో వికాశమే




ఇంగ్లీషులోన మేరేజీ పాట సాహిత్యం

 
చిత్రం: ఆరాధన (1962)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, యస్.జానకి

పల్లవి:
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ
ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి
ఆహా... ఆ... ఆ...
ఓహో... హొ... హో...

చరణం: 1
ప్రేమించుకున్న పెళ్ళిలోనే హాయి ఉందోయీ
పెద్దాళ్ళు దానికి సమ్మతిస్తే ఖాయమౌతుందోయ్
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ
జరిగాక మనకు పెళ్ళి పోదాములే న్యూఢిల్లీ
ఆ మాటకే నా గుండెలు గెంతేను తృళ్ళి తృళ్ళి

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ ఆహ...
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

చరణం: 2
న్యూఢిల్లినుండి సింగపూరు వెళ్ళిపోదాము
న్యూయార్కులోన డాన్సుచేస్తూ ఉండిపోదాము
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు
కోసావు కోతలు తగ్గు వేసేను నాకు సిగ్గు
రంగేళికి సింగారికి రారాదు పాడు సిగ్గు

ఇంగ్లీషులోన మేరేజీ ఆహా...
హిందీలొ అర్థమూ షాదీ ఓహో...
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి

చరణం: 3
పొంగేను సోడాగ్యాసు లాగా నేడు నీ మనసు
మా నాన్న ముఖము చూడగానే నువ్వు సైలెన్సు
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు
తెస్తానులే లైసెన్సు కడదాము ప్రేమ హౌసు
నీమాటలే నిజమైనచో మన లైఫు నైసు నైసు

ఇంగ్లీషులోన మేరేజీ హిందీలొ అర్థమూ షాదీ
ఏ భాషలో ఏమన్ననూ మన తెలుగులోన పెళ్ళి


Most Recent

Default