Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bhakta Tukaram (1973)




చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శివాజి గణేషన్, అంజలిదేవి, బేబీ శ్రీదేవి 
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: పి.ఆదినారాయణరావు
విడుదల తేది: 05.07.1973



శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సినిమాలు
1. భార్యా బిడ్డలు  (1972)
2. భక్త తుకారాం (1973)
3. మరపురాని మనిషి  (1973) 



Songs List:



ఘనాఘన సుందరా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఘంటసాల

హరి ఓం హరి ఓం హరి ఓం  ఆ... ఆ... ఆ... 
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా 
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా 
అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో 
అది మధుర మధుర మధురమౌ ఓంకారమౌ
పాండురంగ పాండురంగ 
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా 

చరణం: 1
ప్రాభాత మంగళ పూజావేళ 
నీ పద సన్నిధి నిలబడీ నీ పదపీఠిక తలనిడి 
ప్రాభాత మంగళ పూజావేళ 
నీ పద సన్నిధి నిలబడీ నీ పదపీఠిక తలనిడీ
నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా 
వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా 

చరణం: 2
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీపాద ధ్యానమే నిరతము నీ నామ గానమే 
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీపాద ధ్యానమే నిరతము నీ నామ గానమే 
సకల చరాచర లోకేశ్వరేశ్వరా
సకల చరాచర లోకేశ్వరేశ్వరా 
శ్రీకరా భవహరా పాండురంగ పాండురంగ
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా 
ఘనాఘన సుందరా

పాండురంగ పాండురంగ (8)





బలే బలే అందాలు పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: వీటూరి
గానం: ఘంటసాల

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)

ఆ నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి 
మరచితివో మానవ జాతిని దయమాలి

బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు

మాటలు రాని మృగాలు సైతం మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి మారణ హోమం సాదించేను
మనిషే పెరిగి మనసే తరిగి 
మనిషే పెరిగి మనసే తరిగి మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు...

బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు

ఆ ఆ... చల్లగ సాగే చలయేటివోలే మనసే నిర్మలమై వికచించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలే అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని 
మంచిగ మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి...

బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు




చిందులు వేయకురా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: వీటూరి
గానం: ఘంటసాల

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)

శ్రీ పాండురంగ విఠల్ కి జై
జై జై విఠల్ పాండురంగా విఠల్ విఠల్ పాండురంగ (5)
ఓ నరుడా... పామరుడా...
చిందులు వేయకురా 
ఆ... చిందులు వేయకురా 
చిందులు వేయకురా 
శ్రీరంగ నీతులు చెప్పకురా
శ్రీరంగ నీతులు చెప్పకురా
తెలిసీ తెలియని అజ్ఞానముతో
తెలిసీ తెలియని అజ్ఞానముతో
ప్రజలను వంచన చేయకురా
ప్రజలను వంచన చేయకురా

చిందులు వేయకురా 

తనకంతా తెలుసునని తన మాటే వేదమని
తనకంతా తెలుసునని తన మాటే వేదమని
తానే ఒక ఘనుడని తలచే నరుడు వానరుడు పామరుడు

ఆ ఆ... తానెవరో తెలుసుకొని...
తన తప్పులు ఒప్పుకొని...
తనబాధ్యత  గ్రహించువాడే జ్ఞాని విజ్ఞాని
విత్తముపై ఆశలు విడచి చిత్తములో రంగని కొలిచి
విత్తముపై ఆశలు విడచి చిత్తములో రంగని కొలిచి
పరమార్ధం గ్రహించరా తత్వము తెలిసి తరించరా

చిందులు వేయకురా 





ధాన్యలక్ష్మి పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: వీటూరి
గానం:  పి. సుశీల

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)

ధాన్యలక్ష్మి 



కలియుగం కలియుగం పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి 
గానం:  యస్. పి. బాలు 

కలియుగం అయ్యో కలియుగం
కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం
అసలైన భక్తులకు అడుగడుగున సంకటం (2)

హరే రామ హరే రామ రామ రామ హరే హరే 
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 

ఆ… కూడు గుడ్డ లేని వాళ్ళు అవుతారా భక్తులు - అవుతారా భక్తులు
కోవెలలో దేవుడెలా ఉంటాడు పంతులు  - అరె ఉంటాడు పంతులు
ఉన్నవాళ్లు ఇవ్వాలి కానుకలు - ఇవ్వలి కానుకలు
ఊరికి ఉపకారం చెయ్యాలి ఉత్తములు నా లాంటి ఉత్తములు

ఓ హో హో కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం
అసలిన భక్తులకు అడుగడుగున సంకటం

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ  కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే

ఆ.. కాంతా కనకాలే కదా పాపాలకు మూలం  - నీ పాపాలకు మూలం
ఆ రెండు మాకు వదిలి చేసుకోండి పుణ్యం - అహ చేసుకోండి పుణ్యం
శివుడు మింగే హలాహలం జగతి కోసము 
మీరిచ్చేదంతా మింగుతాము మీ కోసము
క్రింద నున్న వారినంత పైకి తెచ్చి 
కిటుకు తెచ్చి చిటికెలో చూపుతాము స్వర్గము - చూపుతాము స్వర్గము

కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం 
అసలైన భక్తులకు అడుగడుగున సంకటం

హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ  కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే




కరుణామయ దేవా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి 
గానం:  వి.రామకృష్ణ 

రంగా…. రంగా.....
కరుణామయా దేవా చేరనీయవా రావా పండరీక పాండురంగ విటలా
రావా దేవా కరుణామయా దేవా

దేశాన్ని పాలించు మహారాజు నేడు నీ పాద సన్నిది నిలుచున్నాడు
దేశాన్ని పాలించు మహారాజు నేడు నీ పాద సన్నిది నిలుచున్నాడు
పగవారి నుండే ప్రభువులు కాచి
పగవారి నుండే ప్రభువులు కాచి
ప్రజలకు సుఖ శాంతులదీయవా

కరుణామయా దేవా చేరనీయవా రావా పండరీక పాండురంగ విటలా
రావా దేవా కరుణామయా దేవా

పావనమైన నీ ఆలయాన పాపులు చేరుట సాధ్యమేనా
పావనమైన నీ ఆలయాన పాపులు చేరుట సాధ్యమేనా
దుష్ట శిక్షకుడవంటారే శిష్ట రక్షకుడవంటారే 
దుష్ట శిక్షకుడవంటారే శిష్ట రక్షకుడవంటారే 
పరమ భక్తులను బ్రోవని నాడు కరుణామయుడని బిరుదెoదుకురా
ఆపద్భాంధవ రావా  ఆపదలో కాపాడవా 
ఆపద్భాంధవ రావా  ఆపదలో కాపాడవా 

పాండురంగ హరి జై జై  రామక్రిష్ణ హరి జై జై (3)

పండరినాధ పాండురంగ  
విఠల  విఠల పాండురంగ  
పాండురంగ  పాండురంగ  
విఠల  విఠల పాండురంగ   




కేశవా మాధవ పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: వీటూరి
గానం:  ఘంటసాల

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)

కేశవా మాధవ 




మనసున నీవే పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి 
గానం:  వి.రామకృష్ణ 

మనసున నీవే 




నీవే ఆది దైవము పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి 
గానం:  వి.రామకృష్ణ 

నీవే ఆది దైవము 




పాండురంగ నామం పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: వీటూరి
గానం: వి.రామకృష్ణ 

(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)

పాండురంగ నామం పరమ పుణ్య ధామం 
పాండురంగ నామం పరమ పుణ్య ధామం 
పాండురంగ నామం అదే మోక్ష తీరం వేద సారం మధురం మధురం

పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం

ఎంత పాడుకున్న అంతులేని కావ్యం
ఎంత పాడుకున్న అంతులేని కావ్యం
ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం

పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం

పాండురంగ సన్నిది మాసిపోని పెన్నిధి
పాండురంగ సన్నిది మాసిపోని పెన్నిధి
ప్రభుని  కరుణ లేనిది జగతినేమి ఉన్నది 

పాండురంగ నామం పరమ పుణ్య ధామం పాండురంగ నామం

దాసులైన వారికి దాసుడీ తుకారాం 
దాసులైన వారికి దాసుడీ తుకారాం
ధన్య జీవులార అందుకోండి రాం రాం
అందుకోండి రాం రాం

పాండురంగ హరి జై జై రామ కృష్ణ హరి (5)




పిలుపు వినగాలేవ పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి 
గానం:  వి.రామకృష్ణ 

రంగా... పాండు రంగా...
పిలుపు వినగాలేవ నీ గుడికి తిరిగి రావా దేవాది దేవా
నా పిలుపు వినగలేవా
నీ రూపం కనరాని వేళ నీ నామం వినరాని వేళ
నీ భక్తులకు ఈ లోకమేలా
నీ ధ్యానమేరా నీ గానమేరా ఆనాడు ఈనాడు మా జీవితం

పిలుపు వినగాలేవ నీ గుడికి తిరిగి రావా దేవాది దేవా 
నా పిలుపు వినగలేవా

ఆలయాన నీవు అవతరించవా 
నీవున్నావని నిరుపించవా
ఆలయాన నీవు అవతరించవా 
నీవున్నావని నిరుపించవా
లేవయ్యా వెలికి రావయ్యా
లేవయ్యా వెలికి రావయ్యా

చిన్నబోయిన చీకటి గుడిలో వెన్నెల వెలుగులు నింపవయా
నీ దివ్య రూపము చూపవయా
రంగా... పాండురంగా... కరుణాతరంగా….మునిజన హృదయాబ్యబృంద…..




పూజకు వేళాయెరా... పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల

పూజకు వేళాయెరా...
రంగపూజకు వేళాయెరా...
పూజకు వేళాయెరా...

ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో
ఎన్ని రేలు ఎంతెంత వేగితినో
ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో
ఎన్ని రేలు ఎంతెంత వేగితినో

పిలుపును విని విచ్చేసితివని
నా పిలుపును విని విచ్చేసితివని
వలపులన్నీ నీ కొరకె దాచితిని
వలపులన్నీ నీ కొరకె దాచితిని
ఎవరూ పొందని ఏకాంతసేవలో
ఈవేళ తమితీరగా నిన్నె అలరించు
పూజకు వేళాయెరా పూజకు వేళాయెరా

చరణం: 1
ఈ నీలినీలి ముంగురులు ఇంద్రనీలాల మంజరులు
ఈ వికసిత సిత నయనాలు శతదళ కోమల కమలాలు
అరుణారుణమీ అధరము తరుణమందార పల్లవము
అ...ఎదలో పొంగిన ఈ రమణీయ పయోధరాలు
పాలకడలిలో ఉదయించు సుధాకలశాలు
ఎంత సుందరము శిల్ప బంధురము ఈ జఘన మండలము
సృష్టినంతటిని దాచుకున్న ఆ పృథివీ మండలము

ఓ అభినవ సౌందర్యరాశీ
ఓ అపూర్వ చాతుర్యమూర్తీ
నీ కటాక్షముల లాలనమ్ములో
నీ మధురాధర చుంబనమ్ములో
నీ కటాక్షముల లాలనమ్ములో
నీ మధురాధర చుంబనమ్ములో
మధురిమలెన్నో పొదుగుకున్న
నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో
అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో
హాయిగా నిదురించ గలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే
లేదాయె తల్లీ... తల్లీ... తల్లీ...

స్వామీ... 
అవునమ్మా నీవు ప్రదర్శించిన సౌందర్యం అనిత్యం
నీవు నమ్ముకున్న యవ్వనం అశాశ్వతం

దువ్వుకున్న ఆ నీలిముంగురులె దూదిపింజలై పోవునులే
నవ్వుతున్న ఆ కంటి వెలుగులే దివ్వెల పోలిక ఆరునులే
వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే వాడి వక్కలై పోవునులే
పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే
నడుము వంగగా నీ ఒడలు కుంగగా
నడుము వంగగా ఒడలు కుంగగా
నడువలేని నీ బడుగు జీవితం వడవడ వణకునులే
ఆశలు రేపే సుందర దేహము అస్థిపంజరంబౌవ్వునులే

స్వామి మన్నించండి అందగత్తెననే అహంకారంతో
మిమ్మల్ని అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నించాను 
మిమ్మల్ని ఓడించాలనుకొని నేనోడిపోయాను 
మీరు నా హృదయంలోని చీకటి తెరలను తొలగించారు
పోరలుకమ్మిన నా కళ్ళు తెరిపించారు
స్వామి ఇక మీరే నాకు శరణ్యం ఈ నరకకూపం నుండి తప్పించి 
నాకు వెలుగుబాట చూపించండి

బహిన పతిత పవణుడైన ఆ పాండు రంగడే మనందరికీ శరణ్యం
ఆ దేవ దేవుని సేవించి తరించు

పాండురంగ హరి జైజై పాండురంగ హరి (5)
విఠల విఠల పాండురంగ (4)





సరిసరీ వగలు పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా...
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా...
సరిసరీ...

చెంతకు రమ్మన చేరనంటినా...
చెక్కిలినొక్కిన కూడదంటినా...
చెంతకు రమ్మన చేరనంటినా...
చెక్కిలినొక్కిన కూడదంటినా...

తొలిఝామైనా కానిదే
తొలిఝామైనా కానిదే తొందర ఎందుకు ఎందుకంటిరా...

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా...
సరిసరీ...

చరణం: 1
ఆ... మంచి గంధం పూయకముందే
మల్లెమొగ్గలు చల్లకముందే
మంచి గంధం పూయకముందే మల్లెమొగ్గలు చల్లకముందే
కులుకుటందెలు మోగకముందే
కొత్త జావళి పాడకముందే
గరిస నిపమప ససని ససనిసని
నినిప నినిపనిప
మగప మనిపసని పపాని
పమగమ గపామగ సనిస
ఆ... ఆ... ఆ...

కొత్త జావళి పాడకముందే
కంటి గిలుపుల జంట తలపుల
కొంటి చేతల కవ్వింతలింకేల చాలించవేరా...

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా...
సరిసరీ...

చరణం: 2
ఆ... పండువెన్నెల పానుపు చేసి
పైట కొంగున వీవన వీచీ
వేడిముద్దులు కానుక చేసి
విడని కౌగిట బందీచేసి
ఎన్నడెరుగని వన్నెతరుగని
కన్నెవలపులు అందించి అందాలు చిందింతులేరా...

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా...
సరిసరీ...




శ్యామసుందరా -1 పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి
గానం: వి.రామకృష్ణ

శ్యామసుందరా ప్రేమ మందిరా
నీ నామమే వీనుల విందురా
నీ నామమే వీనుల విందురా శ్యామసుందరా

ఆణువణువూ నీ అలయమేరా నీవే లేని చోటు లేదురా
ఆణువణువూ నీ అలయమేరా నీవే లేని చోటు లేదురా
నేనని నీవని లేనే లేదు నీకు నాకు భేదము లేదు

శ్యామసుందరా ప్రేమ మందిరా

సుఖదుఃఖాలకు నిలయం దేహం ఈ దేహముపై ఎందుకె మొహం
అహము విడిచితే ఆనందమురా అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం గానము వింటే తొలగిపోవును శోకంరా

శ్యామసుందరా ప్రేమ మందిరా 

సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
అలవాటైతే విషమే అయినా హాయిగ త్రాగుట సాధ్యమురా
హాయిగ త్రాగుట సాధ్యమురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా
కాల సర్పమును మెడలో దాల్చి పూల మాలగా తలచవచ్చురా
పూల మాలగా తలచవచ్చురా
ఏకాగ్రతతో ధ్యానము చేసి లోకేశ్వరునే చేర వచ్చురా
లోకేశ్వరునే చేర వచ్చురా
దాస తుకారాం తత్వ బోదతో  తరించి ముక్తిని పొందుమురా
తరించి ముక్తిని పొందుమురా

సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

అనిగిమనిగి నుండే వాడే అందరిలోకి ఘనులు
అనిగిమనిగి నుండే వాడే అందరిలోకి ఘనులు
డొద్దమాణులను కూల్చు తుఫాను గడ్డిపరకను కదల్చ గలదా
కదల్చ గలదా
చిన్న చీమలకు చెక్కెర దొరకెను గొప్ప మనిషికి ఉప్పే కరువు
ఉప్పే కరువు
అనుకువ కోరే తుకారాముని మనసే దేవుని మందిరము
మనసే దేవుని మందిరము

అనిగిమనిగి నుండే వాడే అందరిలోకి ఘనులు

పడవెళ్లి పోతుందిరా ఆ...ఆ... ఓ...
పడవెళ్లి పోతుందిరా ఓ మానవుడా దరిచేరే దారేదిరా
ఈ జీవితము కెరటాల పాలాయెరా
పడవెళ్లి పోతుందిరా...
తల్లిదండ్రి అతడే నీ ఇల్లువాకిలతడే
తల్లిదండ్రి అతడే నీ ఇల్లువాకిలతడే
ఆ పాండురంగడున్నాడురా...
నీ మనసు గోడు వింటాడురా నీ భారమతడు మోసేనురా
ఓ యాత్రికుడా నిన్నతడే కాసేనురా
పడవెళ్లి పోతుందిరా...
బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు
బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోనే చితుకు
ఇది శాశ్వతమని తలచేవురా నీ వెందుకని మురిచేవురా
నువు దరిచేరే దరి వెతకరా 
ఓ మానవుడా హరినామం మరవవద్దురా
పడవెళ్లి పోతుందిరా...





శ్యామసుందరా -2 పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

సర్వసుఖాలకు నిలయం దేహం ఈ దేహంపై అందుకె మొహం
అహము విడిచితే ఆనందమురా అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం గానము వింటే  మనసు ఊయలై ఉగునురా
ప్రేమ మందిరా శ్యామసుందరా 
ప్రేమ మందిరా నా శ్యామసుందరా 




ఉన్నావా అసలున్నావా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల 

ఉన్నావా… అసలున్నావా
ఉంటే కళ్ళుమూసుకున్నావా 
ఈ లోకం కుళ్ళు చూడకున్నవా (2)

ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు
ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు

ఉన్నావా… అసలున్నావా

నీ పేరిట వంచన పెరుగుతువుంటే
నీ ఎదుటే హింసలు జరుగుతు వుంటే
మనిషిని మనిషి దోస్తూవుంటే 
మంచికి సమాధి కడుతూ వుంటే
రాతి బొమ్మవై నిలిచావు చాతగాని వాడనిపించావు

ఉన్నావా… అసలున్నావా

నీ భక్తుడ నయ్యాను. నిత్య దరిద్రుడనయ్యాను
నీ భక్తుడ నయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను
సేవలు చేశాను నా బ్రతుకే నైవేద్యం చేశాను
చేసిన మేలునుమరిచేవాడా నువ్వా దేవుడివి
నువ్వొక వ్యర్థుడివి నీకొక పేరూ లేదు.. రూపం లేదు
నీతి లేదు నియమం లేదు. నిజానికి నువ్వే లేవు.. లేవు.. లేవు.. లేవు 




పడవెల్లిపోతుందిరా పాట సాహిత్యం

 
చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరధి
గానం: వి.రామకృష్ణ 

హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

పడవెళ్ళిపోతోందిరా...ఆ ఆ ఆ  ఓ ఓ ...

పడవెళ్ళొపోతుందిరా 
మానవుడా దరి చేరే దారేదిరా
ఈ జీవితము కెరటాల పాలాయెరా

పడవెళ్ళిపోతోందిరా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే
తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే
ఆ పాండురంగడున్నాడురా...
నీ మనసు గోడు వింటాడురా
నీ భారమతడే మోసేనురా 
ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా

పడవెళ్ళిపోతోందిరా

బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు
బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు
ఇది శాశ్వతమని తలచేవురా...
నీవెందుకని మురిసేవురా..
నువు దరిచేరే దారి వెతకరా 
ఓ మానవుడా హరినామం మరువవొద్దురా

పడవెళ్ళిపోతుందిరా ఆ ఆ....

హైలెస్సా హైలెస్సా హైలెస్సా (3)


Most Recent

Default