Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Fashion Designer s/o Ladies Tailor (2017)



చిత్రం: ఫ్యాషన్ డిజైనర్ (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  చైతన్య ప్రసాద్
గానం: శ్రీ కృష్ణ , గీతామాధురి
నటీనటులు. సుమంత్ అశ్విన్ , అనిషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్ష
దర్శకత్వం: వంశీ
నిర్మాత: 'మధుర' శ్రీధర్ రెడ్డి
విడుదల తేది: 02.06.2017

పాపి కొండల్లో లేత ఎండల్లో
పాట పుట్టిందోయి  తేటి గుండెల్లో
ఏటి పాయల్లో గూటి పడవల్లో
ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో
నువు టక్కరి దొంగవు కదా
గడసరి జోడీ నువు కదా
ఇక చెప్పకు తీయని సొద
పిలిచెను నేడే ప్రతిపొద
దోర దోర సొగసిదీ దొరకక దొరికిన పులసిదీ

పాపి కొండల్లో లేత ఎండల్లో
పాట పుట్టిందోయి  తేటి గుండెల్లో
ఏటి పాయల్లో గూటి పడవల్లో
ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో

నీ వెనకే నీడలా - ఉన్నావయ్యా కొన్నాళ్ళుగా!
నీ అడుగూ జాడలా  - వచ్చావయ్యా కంగారు పడగా!
నువు నవ్వితే హాయిగ నేనూ  - నవ్వావయ్యా నవాబులా!
నువు నవ్వని వేళల నేను - చూసానయ్యా దిగాలు పడగా!
పిచ్చోడి లాగ తిరగనీ వయసిక వరదగ ఉరకనీ!

పాపి కొండల్లో లేత ఎండల్లో
పాట పుట్టిందోయి  తేటి గుండెల్లో
ఏటి పాయల్లో గూటి పడవల్లో
ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో

వాటముగా రాయిక - వచ్చా వచ్చా వచ్చానులే!
ఈ ఇసుకే వేదిక  - ఇచ్చా ఇచ్చాను కానుకే!
చలి గిచ్చిన వేళల లోన  -  అయ్యో గియ్యో అన్నానులే!
నులి వెచ్చని కౌగిలి లోన - వయ్యారాన్నే వడ్డించి వేస్తిలే!
పింఛాలు లేని నెమలినీ మనసున సొగసుగ నమలనీ

పాపి కొండల్లో లేత ఎండల్లో
పాట పుట్టిందోయి  తేటి గుండెల్లో
ఏటి పాయల్లో గూటి పడవల్లో
ఈడు నవ్విందోయి ఏడు రంగుల్లో



********  *********  *********


చిత్రం: ఫ్యాషన్ డిజైనర్ (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  శ్రీవల్లి
గానం: మాళవిక , దిన్ కర్

అన్వేష  అన్వేష (2)

వెన్నెల నేసిన అందమా సీతాకోకల చందమా
వెన్నెల నేసిన అందమా సీతాకోకల చందమా
నువ్వెక్కడ ఉన్నా పసిడి కోక నేనటుగా వస్తున్నా
ఓ చిక్కిన లక్కా చక్కని చుక్కా నిన్నే చూస్తున్నా
నీ పేరులో మణి ఉందిగా
యవ్వారము బాగుందిగా
ఈ మగ్గం పగ్గం వదిలిక నీ వెనుక

అన్వేష  అన్వేష (4)

ఈ పాపా కనుపాప కలిపేసింది సోదరా
ఒడి లోన పడిపోయి మెలికలు పెట్టేస్తోందిరా
తీగె లాగావా మనసంతా కదిలిందిరా
ఆటే మొదలాయే చూపిస్తారా ప్రేమగా
దారేదిక దిక్కేదిక నక్కేదెలా నా కన్యక
ఎదో ఇది తెలియని తికమక థిల్లానా

అన్వేష  అన్వేష (2)

వయసైనా పడవల్లే కుదిపేసింది నన్నిలా
వల వేసి వలపేసి దొరికే తానే చేపలా
రేవే పులకించి నిన్నే పిలిచే దేవరా
రేయి పగలంటూ లేనేలేదు స్వామిరా
ఇంకెవరురా నీ అప్సర ఆ కాసు లోన తిరకాసు రా
తానెక్కడ ఉందో వెతికేదేల్లాగా

అన్వేష  అన్వేష (2)



********  *********  *********


చిత్రం: ఫ్యాషన్ డిజైనర్ (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం:  శ్రీ మణి
గానం: సాయి చరణ్ , సాహితి చాగంటి

మేఘాలే తేలే నా లోనా రాగాలే గుండె గదిలోన
ఆ గువ్వలకే కొమ్మవుతున్నా
హరివిల్లులకే విల్లు అవనా వెన్నెల నా ఒళ్ళో వాలా
నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమంటున్న

మేఘాలే తేలే నా లోనా రాగాలే గుండె గదిలోన

ఈ గాలులు అల్లగా మనపై వార్తలు మెల్లగా
ఆ చందమామ గారు కూడా విన్నారట
ఆ జాబిలి చెప్పగా అరె ఈ సూర్యుడు నవ్వగా
వేసంగి పొంగు వెన్నెలల్లే కాసింది గా
పరుగులు ను ఆపి - కాలమే
కబురులిని మనకే - చెప్పెనే
ఏకాంతాలన్ని మన కాంతులకే పారిపోయే

మేఘాలే తేలే నా లోనా రాగాలే గుండె గదిలోన
ఆ గువ్వలకే కొమ్మవుతున్నా
హరివిల్లులకే విల్లు అవనా వెన్నెల నా ఒళ్ళో వాలా
నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమంటున్న

ఏ జల్లులు జారిన అలుపే లేదే ఒంటికి
చినుకమ్మ నీరు ఇంకి పోయే ఈ హాయికి
ఏ వేసవి కాసినా అలుపే తెలియదు మనసుకి
ఎండమ్మ గుండె వెన్నెల అయ్యే ఈ తీపికి కి
ఏ తీరమో ఇక - చివరికి
ఇక చాలులే పద - ఇంటికి
ఏ ఇల్లు వాకిలి వద్దే వద్దు ఈ ప్రేమకి

మేఘాలే తేలే నా లోనా రాగాలే గుండె గదిలోన
ఆ గువ్వలకే కొమ్మవుతున్నా
హరివిల్లులకే విల్లు అవనా వెన్నెల నా ఒళ్ళో వాలా
నీలోనా నాలోనా ఈ వింతే తొలి ప్రేమంటున్న

Most Recent

Default