Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Gharana Mogudu (1992)

చిత్రం: ఘరానా మొగుడు (1992)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: చిరంజీవి, నగ్మా, వాణి విశ్వనాధ్
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.దేవివరప్రసాద్
విడుదల తేది: 09.04.1992

Songs List:

బంగారు కోడిపెట్ట పాట సాహిత్యం

చిత్రం: ఘరానా మొగుడు (1992)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర,  యస్ పి బాలు

(ఈ పాటను మగధీర (2009)  సినిమాలో రీమిక్స్ చేశారు.  రాంచరణ్, కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి కూడా  ఎమ్. ఎమ్. కీరవాణి గారే సంగీతాన్ని స్వరపరచగా, రంజిత్, శివాని ఆలపించారు )

పల్లవి:
అప్ అప్ హ్యాండ్సప్ పాపా హ్యాండ్సప్... హ హ...
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌ తో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌ తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప

చరణం: 1
ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు
అంతంత ఉన్నాయ్ ఎత్తులు బోలొ బోలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యో
పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లొ చెల్లో
సిగ్గులేని రైక టెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళి వస్తానయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకు
హే హే అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌ తో
రైటో జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌ తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప

చరణం: 2
ఏంటమ్మా ఏంటమ్మా అంతుల్లో
అందాల చిట్టి గంపల్లో బోలొ బోలో
నా ఈడు నక్కింది బావయ్యో
చేయ్యెసినాక మత్తుల్లో చెల్లొ చెల్లో
చేతచిక్కినావే గిన్నెక్కోడి 
దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా
కాక మీద వున్న దాన్నిరయ్యో దాక మీద కోపమెందుకు
హే హే అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌ తో
ఓకే జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌ తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌ తో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌ తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప

కిటుకులు తెలిసిన పాట సాహిత్యం

చిత్రం: ఘరానా మొగుడు (1992)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర ,  యస్ పి బాలు

పల్లవి:
కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
పిటపిటలాడిన పరువపు తళుకులు
అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన
అబ్బబ్బా... ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
చినుకులు కావవి మగసిరి పిలుపులు
అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వానా
అబ్బబ్బా... ఇది ఏమి వానా

చరణం: 1
రివ్వున కొట్టిన ఓ చినుకూ కసిగా పదమంటే
రైకను తట్టిన ఆ చినుకే రైటు కొట్టమంటే
హత్తుకుపోయిన ఓ చినుకూ వగలే ఒలికిస్తే
చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే
కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణా
ఆ కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణా
ముదిరే చలిగాలిలోన అదిరే పని మొదలెడదామా
అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన
అబ్బబ్బా... ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
చినుకులు కావవి మగసిరి పిలుపులు
అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన
అబ్బబ్బా... ఇది ఏమి వాన

చరణం: 2
హద్దులు మీరిన ఆవేశం తలుపే తడుతుంటే
అల్లరి ఆశల ఆరాటం రెచ్చి రేగుతుంటే
తుంటరి చేతుల పిల్లాడా తడిమే పని రద్దు
కమ్ముకుపోయిన వేళల్లో గుట్టు దాచవద్దు
ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా
ఆ ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా
తడిలో అందాల పాప పడితే పులుసౌతది చేప
అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన
అబ్బబ్బా... ఇది ఏమి వాన

కిటుకులు తెలిసిన చిటపట చినుకులు
పిటపిటలాడిన పరువపు తళుకులు
అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన
అబ్బబ్బా... ఇది ఏమి వాన

హే పిల్ల హల్లో పిల్ల పాట సాహిత్యం

చిత్రం: ఘరానా మొగుడు (1992)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర ,  యస్ పి బాలు

పల్లవి:
హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు
పాంపప్ప హారం కొట్టి మా నట్టింట్లో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు
రా...చెలియా సఖియా త్వరగా ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు

హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు

చరణం: 1
చిట్కాలే వెయ్యమాకు వాణి ఆఖరు అంచుకు చేరుకొని
కంగారు పెట్టమాకు జాని చీకటి మొగ్గని కోరుకొని
కొత్త ఎత్తులో కొంగొత్త మత్తులో నక్కి నక్కి చూస్తే ఏం చేయను
మెత్త మెత్తగా గుమ్మెత్తి వత్తుగా నన్ను హత్తుకుంటే ఏం కాను
రా... మగువా మదనా త్వరగా ఇక పడగోట్టేస్తా ఇంకో వికెట్టు

హే పిల్ల హలో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు

చరణం: 2
చింపేసి చుట్టుకుంది ఓణి చారెడు చూపులు గుచ్చుకొని
హోయ్ సిగ్గేదో దాచుకుంది ఓణి బారెడు ముద్దులు చాలవని
ఎన్ని చిక్కులో సన్నాయి నొక్కులో పిక్క ఎక్కువైతే ఏం కాను
వెక్కిరింపులో వెర్రెక్కు వంపులో చిచ్చి కొట్టమంటే ఏం చేయను
రా... మగడా గురుడా సరదా మరి కొట్టించ్చేయి నీ ట్రాఫ్ఫిక్ టికెట్టు

హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు
జాంచక్క జెర్కలిచ్చి అందాలన్ని లెగ్గొట్టి కొట్టేయి అల్లం పెసరట్టు
పాంపప్ప హారం కొట్టి మా నట్టింట్లో కాలెట్టు అందిస్తా బెల్లం బొబ్బట్టు
రా...చెలియా సఖియా త్వరగా ఇక మోగించేద్దాం లవ్లీ ట్రంపెట్టు

హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం వన్ బై టూ వన్ బై టూ
ఆవ్ మల్ల అడిగిందల్లా ఇచ్చావంటే ఇల్లు ఒళ్ళు తాకట్టు తా క ట్టు

కప్పుకో దుప్పటి పాట సాహిత్యం

చిత్రం: ఘరానా మొగుడు (1992)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర ,  యస్ పి బాలు

పల్లవి:
కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా హా
చెదరని పాపిడి వయసుకే శాపము
అలిగిన పైటకి నలిగితే మోక్షము
స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో... ఓ ఓ ఓ

కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా హా

చరణం: 1
పాపా పిండేసినాకా నీ కోక నాపై ఆరేసుకో
కాగుతున్న ఈడే కస్సుమన్న నాడే సాగుతున్న ఏరువాకలో
బాబూ కన్నేసి బాణం వేసేసి లీనం చేసేసుకో
ఊసులాడు కొంటూ అభాసు చేయకుండా అనాసపండు చెక్కి తీసుకో
చెయ్యకే అల్లరి ఎప్పుడు తప్పదే నా గురి
వేలికేస్తే కాలికేసి ఒంటిగుట్టు రట్టు చేసుకో... ఓ ఓ ఓ

కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా హా

చరణం: 2
రాజా నీ కస్సు వింటే ఓ యస్సు అంటూ ఓటేయనా
ఎంతసేపు తిన్నా గులాబి పూల వెన్న మరింత ముంత దోచి ఇవ్వనా
రాణి అడ్రస్సు కేరాఫ్ నీ డ్రస్సు బోనీ చేసేయ్యనా
కోడి కుయ్యకుండా నా కూత ఆపకుండా సుఖాంత సేవ మొదలుపెట్టనా
నెమ్మది నెమ్మది ఎక్కడో హాయిగా ఉన్నదీ...
ఓపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో... ఓ... హే... ఆఁ హాఁ హాఁ హాఁ

కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా హా

చెదరని పాపిడి వయసుకే శాపము
అలిగిన పైటకి నలిగితే మోక్షము
స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో... ఓ ఓ ఓ

కప్పుకో దుప్పటి చలేస్తే హా హా
కోరుకో కౌగిలి గిలేస్తే హా ఆహ్...

ఏందిబే ఎట్టాగ పాట సాహిత్యం

చిత్రం: ఘరానా మొగుడు (1992)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర ,  యస్ పి బాలు

పల్లవి:
ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు
విస్కీ పట్టూ ఇలా ఇలా 
సోడా కొట్టూ అలా అలా
ఎక్కిస్తే కిక్కిచ్చేలా... హా హా 
ఏందిబే...ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు

చరణం: 1
హే లబకు జబకు గడుసు పెళ్ళాంసూ
తలుపుకింక వేసుకోకు గొళ్ళెంసు
హే జటకు బటకు చిలిపి మొగుడ్సూ
రిస్కు చేసి తెంపమాకు రిబ్బన్సూ
చిప్సు ఉన్నాయా చీకులున్నాయా నాటుకోడి లెగ్సు ఉన్నాయా
చిప్సు ఉన్నాయి శభాష్ లిప్సు ఉన్నాయి అబ్బా పిడత కింద పప్సు ఉన్నాయి
అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ
అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ
    
ఏందిబే... ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు

చరణం: 2
నీ లటక్ పటక్ చురుకు చూపుల్సూ
గుచ్చుకుంటె రెచ్చిపోయే బుగ్గల్సూ
నీ కసక్ మిసక్ నడుము ఒంపుల్సూ
తడుముతుంటే రేగిపోయె జిల్ జిల్సూ
పెట్టు ముద్దుల్సూ లేవు హద్దుల్సూ ఓకే ఇవ్వమంది ఈడు స్యాంపుల్సూ
కొట్టు బాటిల్సూ పీరు పీపుల్సూ మోగుతుంటే జోడు మద్దెల్సు తరగిడతోం
అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ
అడి తప్పా టప్పా టపా టప్పా రెడి రబ్బా రబ్బా యమ దెబ్బ

ఏందిబే... ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త ముందుకెళ్ళు చట్టిలో సరుకేదో నింపుకెళ్ళు
విస్కీ పట్టూ ఇలా ఇలా సోడా కొట్టూ అలా అలా
ఎక్కిస్తే కిక్కిచ్చేలా... హా హా

ఏందిబే...ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చాప ముల్లు
ఓసినీ ఇంకాస్త హుహుహు చట్టిలో సరుకేదో హుహుహు

పండు పండు పండు పాట సాహిత్యం

చిత్రం: ఘరానా మొగుడు (1992)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: చిత్ర ,  యస్. పి. బాలు

పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
వాత్సాయణ లిఖించు నాయనా లవంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్
సిగ్గేసినా చేసేది చేయ్యనా శుభః శీఘ్రమింక  లవ్ లవ్ లవ్ లవ్
హే...లవ్ మి నౌ పండు పండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు

మొగ్గలేసె బుగ్గపండు నక్కి చూసె నిమ్మపండు
ఖుషీగా ఇస్తే వస్తా కాసుకో
అంత ఆశ అమ్మపండు ఇచ్చుకుంటే మల్లెచెండు
మరింటో తంటా మూడే మార్చుకో
లిప్పూ లిప్పు ఫ్రెండ్ షిప్పు చేసిన రోజే రెచ్చిపో
హిప్పూ హిప్పు జంచెక్కలాడిన వేళే సొక్కిపో
వాల్మీకిలా తరించి రాయనా వరాల మొగ్గ మీటి లవ్ లవ్ లవ్ లవ్
ప్రేమాయణం పసెంతో చూడనా నట్టింట లగ్గమెట్టి నౌ నౌ నౌ నౌ
హే...క్రష్ మి నౌ

పండు పండు పండు ఎర్రపండు 
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు

జబ్బు చేసె జామ పండు ఒత్తిగిల్లే అత్తిపండు
సపోటా పోటీ పెట్టా చూసుకో
దాచుకుంటే దోసపండు దోచుకుంటా దొంగ పండు
లఫాటా వేట నేడే కాసుకో
పండే పండు పండక్కి ఇస్తా ప్రాణం తీయకు
దక్కే పండు దమ్మెంతో చూస్తా పాఠం నేర్పకు
ఓర్నాయనా సుఖించి రాయనా సుఖాల భారతాన్ని  నౌ నౌ నౌ నౌ
లవ్ సాగరం మధించి తీయనా మజాల అమృతాన్ని లవ్ లవ్ లవ్ లవ్
హే...గివ్ మి నౌ పండు పండు

పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు
వాత్సాయణ లిఖించు నాయనా లవంగి మొగ్గ తుంచి లవ్ లవ్ లవ్ లవ్
సిగ్గేసినా చేసేది చేయ్యనా శుభః శీఘ్రమింక  లవ్ లవ్ లవ్ లవ్
హే...లవ్ మి నౌ పండు పండు
పండు పండు పండు ఎర్రపండు యాపిల్ దానిపేరు
జర్ర గమ్మునుండు బుజ్జి పండు పడింది టాపు గేరు

Most Recent

Default