Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Goonda (1984)




చిత్రం: గూండ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, రాధ
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: మిద్దె రామారావు
విడుదల తేది: 23.02.1984



Songs List:


అందగత్తె ఆటకేమో వందనాలు... పాట సాహిత్యం

 
చిత్రం: గూండా (1984)
సంగీతం: కె.చక్రవర్తి
వేటూరి: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్. జానకి 

పల్లవి:
హోయ్.. అందగత్తె ఆటకేమో వందనాలు... హా..
ఆటకొచ్చి ఊగినోళ్ల తందనాలు.. అహా..
అరే.. అందగత్తె ఆటకేమో వందనాలు... అహా..
ఆటకొచ్చి ఊగినోళ్ల తందనాలు.. అహా..
చిరునవ్వు నవ్వితే చిచ్చేలే లోకము
ఒకసారి ఆడితే వన్స్ మోరు

హా.. అందగాడి పాటకేమో వందనాలు.. అహా
పాటవిన్న పడుచువాళ్ళ తందనాలు...
అహా.. అందగాడి పాటకేమో వందనాలు.. అహా
పాటవిన్న పడుచువాళ్ళ తందనాలు... అహా...

దరువేసే వాటము దడపుట్టే తాపము
వందసార్లు ఆడినా వన్స్ మోరు

చరణం: 1
వన్నెలు చూస్తుంటే కన్నులు కుట్టాలా
చూసిన కళ్ళల్లో చుక్కలు పుట్టాలా
హోయ్.. ఒంటిలోని ఊపుల్లో.. ఓరకంటి చూపుల్లో
ఒంటిలోని ఊపుల్లో.. ఓరకంటి చూపుల్లో
నల్లమబ్బు లేకుండా మెరుపులెన్నో రావాలా
వాటేసే ఆటల్తో వయ్యరాలే తాకాలా
పడుచోళ్ళ కళ్ళల్లో కలలెన్నో రావాలా
పడకిళ్ళ దిళ్ళల్లో కలహాలే రేగాలా

అహా.. అందగాడి పాటకేమో వందనాలు.. అహా
పాటవిన్న పడుచువాళ్ళ తందనాలు... అహా

అరెరే.. చిరునవ్వు నవ్వితే చిచ్చేలే లోకము
ఒకసారి ఆడితే వన్స్ మోరు

చరణం: 2
వేసే తాళాలే వెర్రిగ మారాలా
హోయ్.. వచ్చే మైకంలో వయసు ఊగాలా
రాజసాల నవ్వుల్లో రాజహంసనడకల్లో
రాజసాల నవ్వుల్లో రాజహంసనడకల్లో
ఎండకన్ను పడకుండా కొండమల్లి పూయాలా
కందే నీ పాదాల్లో మందారాలే రాలాలా
నే వలచి వస్తుంటే మైమరచి పోవాలా
కను మెచ్చి చూస్తేనే కలలాగా తోచాలా

హోయ్.. అందగత్తె ఆటకేమో వందనాలు... హా..
ఆటకొచ్చి ఊగినోళ్ల తందనాలు.. హొయ్..హోయ్ ..
అరే.. అందగత్తె ఆటకేమో వందనాలు... అహా..
ఆటకొచ్చి ఊగినోళ్ల తందనాలు.. అహా..

చిరునవ్వు నవ్వితే చిచ్చేలే లోకము
ఒకసారి ఆడితే వన్స్ మోరు
అహా.. అందగాడి పాటకేమో వందనాలు.. అహా
పాటవిన్న పడుచువాళ్ళ తందనాలు... అహా

దరువేసే వాటము దడపుట్టే తాపము
వందసార్లు ఆడినా వన్స్ మోరు




గుండెలుతీసిన బంటు పాట సాహిత్యం

 
చిత్రం: గూండా (1984)
సంగీతం: కె.చక్రవర్తి
వేటూరి: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

గుండెలుతీసిన బంటు 



నీ చిలిపి కాళ్ళమీద పాట సాహిత్యం

 
చిత్రం: గూండా (1984)
సంగీతం: కె.చక్రవర్తి
వేటూరి: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

నీ చిలిపి కాళ్ళమీద 





కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.. పాట సాహిత్యం

 
చిత్రం: గూండ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి

పల్లవి:
కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.. కొండెక్కి చూసింది చందమామ
కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.. కొండెక్కి చూసింది చందమామ
కోయిలమ్మ గొంతులో రాగాలు.. చందమామ మనసులో భావాలు
కోయిలమ్మ గొంతులో రాగాలు.. చందమామ మనసులో భావాలు

చరణం: 1
గాలులతో వ్రాసుకున్న పూల ఉత్తరాలు.. దిద్దినక ధింత.. దిద్దినక ధింత
పువ్వులతో చేసుకొన్న తేనె సంతకాలు.. దిద్దినక ధింత.. దిద్దినక ధింత
మసకల్లో ఆడుకున్న చాటు మంతనాలు.. దిద్దినక ధింత.. దిద్దినక ధింత
వయసులతో చేసుకొన్న చిలిపి వందనాలు.. దిద్దినక ధింత.. దిద్దినక ధింత

సందెల్లో చిందినా వలపులన్నీ.. సంపంగితోటలో వాసనల్లే
పూలపల్లకి మీద సాగి వచ్చు వేళ

లలలలలలలలల...
కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.. కొండెక్కి చూసింది చందమామ
కోయిలమ్మ గొంతులో రాగాలు.. చందమామ మనసులో భావాలు

చరణం: 2
చూపులతో చెప్పుకొన్న తీపి స్వాగతాలు.. దిద్దినక ధింత.. దిద్దినక ధింత
నవ్వులతో పంచుకొన్న మధుర యవ్వనాలు.. దిద్దినక ధింత.. దిద్దినక ధింత
ఎప్పటికీ వీడలేని జంట జీవితాలు.. దిద్దినక ధింత.. దిద్దినక ధింత
ఎన్నటికీ చెప్పలేవు ఎదకు వీడుకోలు.. దిద్దినక ధింత.. దిద్దినక ధింత

జాబిల్లి కొంగునా తారలన్నీ...  నా తల్లో విరిసినా జజులల్లే
ప్రేమ పూజలే నీకు చేసుకొన్న వేళ...

లలలలలలలలల..
కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.. కొండెక్కి చూసింది చందమామ
కోయిలమ్మ గొంతులో రాగాలు.. చందమామ మనసులో భావాలు

కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ.. కొండెక్కి చూసింది చందమామ




నా గీతం నీ సంగీతం పాట సాహిత్యం

 
చిత్రం: గూండా (1984)
సంగీతం: కె.చక్రవర్తి
వేటూరి: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

నా గీతం నీ సంగీతం 

Most Recent

Default