చిత్రం: కొండవీటి దొంగ (1990) సంగీతం: ఇళయరాజా నటీనటులు: చిరంజీవి, రాధ, విజయశాంతి, నాగబాబు , మోహన్ బాబు కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే : యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి నిర్మాత: టి. త్రివిక్రమరావు ఫోటోగ్రఫీ: వి.యస్. ఆర్.స్వామి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు బ్యానర్: విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ విడుదల తేది: 09.03.1990
Songs List:
కోలో కోలమ్మ పాట సాహిత్యం
చిత్రం: కొండవీటి దొంగ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, యస్. జానకి కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా ఘాటుగ కౌగిళ్ళిచ్చి మాటుకోమంటావా కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా చరణం: 1 కొండ కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరెలే సోకి నా ఒళ్ళు కోకలో గళ్ళు పడ్డ నీ ఒళ్ళు వదలను చూపుకే సుళ్ళు తిరిగి నా ఒళ్ళు కట్టు కౌగిళ్ళు వదలకు కుదేశాక అందాలన్ని కుదేలైన వేళల్లో పడేసాకా వల్లో నన్నే ఒడే చాలు ప్రేమల్లో సందె ఓ షేపు చిందే ఓ వైపు అందే నీ సోకులే తణక్కు దిన చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చరణం: 2 మెత్తగా తాకు చూపుకే మేలుకున్నాయి సొగసులే కోత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే కుర్ర నా ఈడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా కళ్ళతో నీకు కళ్ళెమేశాను కమ్ముకో నన్ను కుదురుగా భరోసాల వీరా రారా భరిస్తాను నీ సత్తా శృతేమించు శృంగారంలో రతే నీకు మేనత్తా ముద్దు ఆ వైపు రుద్దు ఈ వైపు హద్దులే లేవులే తణక్కు దిన కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా లాటుగా అందాలన్ని చాటుగా ఇస్తావా ఘాటుగ కౌగిళ్ళిచ్చి మాటుకోమంటావా కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా హే చేలో నీ సోకులన్ని సోలోగ పాడుకుంట నా ముద్దు పుచ్చుకోవా
శుభలేఖ రాసుకున్న పాట సాహిత్యం
చిత్రం: కొండవీటి దొంగ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, చిత్ర (ఈ పాటని రాంచరణ్ తేజ్ నటించిన నాయక్ (2012) సినిమాలో రీమిక్స్ చేశారు. పాడినవారు: హరిచరన్, శ్రేయగోషల్. సంగీతం: యస్.యస్.థమన్ ) శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో అది మీకు పంపుకున్న అపుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్నా కలయో నిజమో తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి మల్లెమబ్బు లాడెనేమో బాలనీలవేణికి మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు అంతేలే, కథ అంతేలే, అదంతేలే శుభలేఖ అందుకున్నా కలయో నిజమో తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్నా కలయో నిజమో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో హంసలేఖ పంపలేక హింస పడ్డ ప్రేమకి ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో వేసవల్లె వేచివున్నా వేణుపూల తోటలో వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు ఒళ్ళో దాటి వెళ్ళ సాగే ఎన్నో వాంఛలు అంతేలే, కథ అంతేలే, అదంతేలే శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో అది మీకు పంపుకున్న అపుడే కలలో శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంద్యను రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
అరె చమ్మక్కు చమ్మక్కు చాం పాట సాహిత్యం
చిత్రం: కొండవీటి దొంగ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్. పి. బాలు, చిత్ర (ఈ పాటని సాయిధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్ (2018) సినిమాలో రీమిక్స్ చేశారు. పాడినవారు: యస్.పి.బి.శరణ్, హరిణి ఇవటూరి. సంగీతం: యస్.యస్.థమన్ ) అరె చమ్మక్కు చమ్మక్కు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ అయ్యారే తస్సాదియ్యా చాం చాం చక్కచాం చక్కచాం చాం త్వరగా ఇచ్చై నీ లంచం చాం చాం చక్కచాం చక్కచాం చాం చొరవే చేసే మరికొంచెం అరె చమ్మక్కు చమ్మక్కు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య హే ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా నాగ స్వరములా లాగిందయ్యా తీగ సొగసు చూడయ్యా తాగు పొగరుతో రేగిందయ్యా కోడె పడగ కాటెయ్యా మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా మంత్రం వేస్తే కస్సూ బుస్సూ ఇట్టే ఆగాలయ్యా బంధం వేస్తావా అందే అందంతో పందెం వేస్తావా తుళ్ళే పంతంతో అరె కైపే రేపే కాటే వేస్తా కరారుగ కథ ముదరగ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా అరె చమ్మక్కు చమ్మక్కు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా చాం చాం చక్కచాం చక్కచాం చాం చొరవే చేసే మరికొంచెం చాం చాం చక్కచాం చక్కచాం చాం త్వరగా ఇచ్చై నీ లంచం అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేక పోతున్నా ఈతముల్లులా ఎదలో దిగెరో జాతి వన్నెదీ జాణ అంతో ఇంతో సాయం చెయ్యా చెయ్యందియ్యాలయ్యా తీయని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా రాజీ కొస్తాలే కాగే కౌగిళ్ళో రాజ్యం ఇస్తాలే నీకే నా ఓళ్ళో ఇక రేపో మాపో ఆపే ఊపే హుషారుగా పదపదమని చమ్మక్కు చమ్మక్కు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య అహ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ ఒయ్యారం సయ్యందయ్యా హొయ్యారే హొయ్య హొయ్యా హొయ్ అయ్యారే తస్సాదియ్యా చాం చాం చక్కచాం చక్కచాం చాం త్వరగా ఇచ్చై నీ లంచం చాం చాం చక్కచాం చక్కచాం చాం చొరవే చేసే మరికొంచెం అరె చమ్మక్కు చక్కచాం చాం చుట్టుకో చుట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్య అహ ఝన్నక్కు ఝన్నక్కు ఝాం పట్టుకో పట్టుకో చంప దరువులే వెయ్యా
టిప్ టాప్ లుక్ పాట సాహిత్యం
చిత్రం: కొండవీటి దొంగ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, యస్. జానకి టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి లక్కు కొద్ది చిక్కినాడు చక్కనోడు చుక్కలేల చందమామ వీడు గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు చెప్పలేను దానికున్న స్పీడు వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే... రంప బంప బప్ప బప్ప పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ వేళలేని పాలలేని వెర్రిలో వేడిబుగ్గ లంటుకొంటె వేడుక జుర్రుకుంటే కుర్రకారు జోరులో పాల ఈడు పాయసాల కోరిక సమ్మరింటే సాల్ట్ సందెవేళ బోల్ట్ అందమైన స్టార్ట్ ఆకశాన హాల్ట్ సొమ్ములప్పజెప్పేటి సోకు చూసి పోనా సొంతమైనదిచ్చేసి సొమ్మసిల్లిపోనా షేకునిన్ను చేసేసి షాకు చూసుకోన బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోన పడుచురుకుల వడిదుడుకులు ముడిసరుకుల ముడి విడుపులలో హో పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ మత్తు మత్తు ఊగులాట మధ్యలో ఎత్తుకున్న పాటకేది పల్లవి హా కొత్త కొత్త కొంగులాట మధ్యలో మొత్తుకున్న మోజులన్ని పిల్లవి పైన కోక నట్టు లోన చాకిలెట్టు ఈడి స్పీడ్ జెట్ లేండ్ కాదు ఒట్టు టన్ను మాటలమ్మేసి నిన్ను కమ్ముకోన ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోన చంప చేతికిచ్చేసి చెమ్మగిల్లిపోన తేనే పట్టు వంచేసి తెప్పరిల్లి పోనా కచటతపల కసివయసుల కెచట ఎపుడు చలి ముడి పడునో హో టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి లక్కు కొద్ది చిక్కినాడు చక్కనోడు చుక్కలేల చందమామ వీడు గుప్పు మంది గుట్టు గున్న కన్నె ఈడు చెప్పలేను దానికున్న స్పీడు వాడితోటి ఈ పూట వాటమైన సయ్యాటలే... దాద దివుద దీద దాద టిప్ టాప్ లుక్ లిప్ మీద క్లిక్ ఎప్పుడంటే అప్పుడే రెడీ పింగ్ పాంగ్ బాడి జింగ్ షింగ్ లేడి తాకితేనే పిచ్చ తాకిడి హే రప్ప పాబ బప్ప రప్ప పాబ పప్ప రంప పాబ రంప పాపపా
జీవితమే ఒక ఆట పాట సాహిత్యం
చిత్రం: కొండవీటి దొంగ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకు కన్నీళ్ళూ అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ ఎదురే నాకు లేదు నన్నేవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నేవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట అనాద జీవులా... ఉగాది కోసం...మ్మ్ అనాద జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా అనాద జీవుల ఉగాది కోసం సూర్యుడిలా నే ఉదయిస్తా గుడిసె గుడిసెను గుడిగా మలచి దేవుడిలా నే దిగివస్తా బూర్జు వాలకు భూస్వాములకు బూర్జు వాలకు భూస్వాములకు బూజు దులపకా తప్పదురా తప్పదురా తప్పదురా తప్పదురా జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట న్యాయ దేవతకు...కన్నులు తెరిచే... న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా న్యాయ దేవతకు కన్నులు తెరిచే ధర్మ దేవతను నేనేరా పేద కడుపుల ఆకలి మంటకు అన్నదాతనై వస్తారా దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం దోపిడి రాజ్యం దొంగ ప్రభుత్వం నేల కూల్చకా తప్పదురా తప్పదురా తప్పదురా తప్పదురా అహా జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళూ ఉండవు మీకు కన్నీళ్ళూ అనాధలైనా అభాగ్యులైనా అంతా నావాళ్ళూ ఎదురే నాకు లేదు నన్నేవరూ ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నేవరూ ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూబాట జీవితమే ఒక ఆట సాహసమే పూబాట
శ్రీ ఆంజనేయం పాట సాహిత్యం
చిత్రం: కొండవీటి దొంగ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, యస్. జానకి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం బ్రహ్మచారి భరించలేడు గాయం ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం స్వామి నిన్నే స్మరించి భరిస్తే అజేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం రామ అంటే నీకు ప్రేమ భామ అంటే నాకు ప్రేమ ప్రేమ భిక్ష నాకు పెట్టరా ఆకు పూజ నీకు నోము సోకుపూజ నాకు నోము జంటకింక గంట కొట్టగా ముద్దులేక ముచ్చటాడు పొద్దులేక పొందులేక ముక్కు మూసుకున్న నాకు దిక్కు చూపరా మొహనాలు మోయలేక సోయగాలు దాయలేక మోజు పడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా జింక లాంటి కంట్లో జిగేలు మంది ప్రాయం జివ్వు మన్న ఒంట్లో చివుక్కు మంది ప్రాణం ప్రేమ పుష్పం సుమించి ఫలించు వేళలోన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం బ్రహ్మచారి భరించలేడు గాయం ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం స్వామి నిన్నే స్మరించి మదిస్తే అజేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం కోడె గాలి కొట్టగానే కొంగు జారి కొంప తీసి ఒంపు సోంపు గంప కెక్కెరా ఆడగాలి సోకగానే కచ్చె పుట్టి రెచ్చగొట్టి కన్నెనీడ కౌగిలించరా పూటకొక్క పువ్వు పెట్టి పూల బాణమేసికొట్టు మన్మధున్ని ఆపలేని మత్తు పుట్టెరా మాపటేల మల్లెలెట్టి చీకటేల చిచ్చుబెట్టు పిల్లదాన్ని చూడగానే పిచ్చె పట్టెరా పెట్టలేదు కామా ఇదేమి ప్రేమ గీతం చెప్పలేను రామ మదీయ మౌన భావం మంత్ర పుష్పం మనస్సు మదించు వేళలోన శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం ప్రేమ గుడ్లో ఈ వేళ పెళ్ళి కాయం బ్రహ్మచారి భరించలేడు గాయం స్వామి నిన్నే స్మరించి మదిస్తే అజేయం శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామ దేయం నా ప్రేమ గేయం ప్రియం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
దేవి శాంభవి పాట సాహిత్యం
చిత్రం: కొండవీటి దొంగ (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, యస్. జానకి దేవి శాంభవి దీన భాందవి పాహి పార్వతి కృపా సరస్వతి దేవి శాంభవి దీన భాందవి పాహి పార్వతి కృపా సరస్వతి లోకమాతవి ప్రాణదాతవి శోక గాదని కాపాడు శాంభవి అశ్రుదారాతో నీ కాలు కడగమా రక్త గంగతో పారాణి దిద్దమా దేవుదంటి మా ప్రభువు కోసము నీవు కోరితే మా ప్రాణమివ్వమా శ్రీ దుర్గా ఘన దుర్గా కొండదేవత కొంగుపట్టి అడిగినాము నీ స్వాహన