చిత్రం: మనసు మాంగల్యం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల, పి.సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు, జమున
దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ
నిర్మాత: కోగంటి కుటుంబరావు
విడుదల తేది: 28.01.1971
ఏ శుభ సమయం లో ఈ కవి హృదయం లో
ఏ కాలి అందెలు మోగినావో
ఎన్నెని ఆశలు పొన్గినవొ
ఏ శుభ సమయం లో ఈ చెలి హృదయం లో
ఏ ప్రేమ గీతం పలికిన్దొ ఎన్నెన్ని మమతలు చిలికిన్దొ
అహా అహా ..అహా అహా..అహాహా అహాహా ఆ హా హ.
కలలో నీవె వూర్వసివే ఇల లో నీవు ప్రేయసివే
ఆ..ఆ..ఆ..నీడె లేని నాకోసం తొడై ఉన్న డెవుడవె
చిక్కని చీకటి లోన అతి చక్కని జాబిలి నీవె ఏ శుభ సమయం లో...ఓ..
మనిషై నన్ను దాచావు
కవివై మనసు దోచావు
నిన్నే గెలుచుకున్నాను
నన్నే తెలుసు కున్నాను
పందిరి నోచని లతకు
నవ నందన మేతీవి నీవె...ఏ శుభ సమయం లో ..ఓ
నీలో వీరిసీ హరివిల్లు నాలోకురిసే విరిజల్లు
కనులె కాంచి స్వప్నాలు నిజమై తొచే స్వర్గాలు
నవ్వుల ఊయల లోనే..నవయవ్వన శోభవు నీవె..
ఏ శుభ సమయం లో ..ఓ
******* ********* ********
చిత్రం: మనసు మాంగల్యం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల
ఆవేశం రావాలి ఆవేదన కావాలి
గుండెలోని గాయాలు మండించే గేయాలు
గుండెలోని గాయాలు మండించే గేయాలు
వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు
రగలాలి విప్లవాలు
ఆవేశం రావాలి ఆవేదన కావాలి
నరజాతిని భవితవ్యానికి నడిపేదే ఆవేశం
పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన
వేగంతో వేడిమితో సాగేదే జీవితం
సాగేదే జీవితం
ఆవేశం రావాలి ఆవేదన కావాలి
రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలి
సమవాదం నవనాదం ప్రతి ఇంటా పలకాలి
ప్రతి మనిషీ క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలి
రుద్రమూర్తి కావాలి
ఆవేశం రావాలి ఆవేదన కావాలి
తరతరాల దోపిడీల ఉరితాళ్ళను తెగతెంచి
నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించి
మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలీ
నిదురించిన నా కవితను కదలించిన ఆవేశం
మరుగు పడిన నా మమతకు తెర విప్పిన ఆవేదన
కన్నుగప్పి వెళ్ళింది నన్ను మరచిపోయింది
నన్ను మరచిపోయింది
******** ******** ********
చిత్రం: మనసు మాంగల్యం (1971)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల
సన్నని వెన్నెల జలతారువలే
కన్నుల కమ్మెను కన్నీటి చెల
ఆ తెరలో ఈ రాతిరిలో
నిన్ను నేను చూస్తున్నా నిన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా
ఇద్దరిలో జగతిలోన ప్రేమ కొరకు వేగిపోవు
వేలవేల హృదయాలే చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా నీలో నన్ను నేను చూస్తున్నా
కదలీ కదలక కదలే నీ కదలికలో
కదలీ కదలక కదలే నీ కదలికలో
చిరుగాలికి ఊగాడే వరి మడినే చూస్తున్నా
ఆ వరి మడిలో ఆ ఒరవడిలో
వంగి వంగి కలుపుతీయు కాపు కన్నె వంపులన్ని చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా నీలో నన్ను నేను చూస్తున్నా
విరిసీ విరియని విరివంటి పరువంలో
కెరటాల గోదారి ఉరకలనే కంటున్నా
ఆ ఉరకలలో ఆ నుఱుగులలో
ఆ ఉరకలలో నుఱుగులలో జడవేస్తూ పడవ నడుపు
పల్లెపడుచు పకపకలే వింటున్నా
నిన్ను నేను చూస్తున్నా నీలో నన్ను నేను చూస్తున్నా
చిదుమని చెక్కిలి చిందే సిగ్గుల్లో
సందెవేళ అలముకునే ఎఱ్ఱజీర చూస్తున్నా
ఆ ఎఱ్ఱదనంలో ఆ కుర్రతనంలో
ఆ ఎఱ్ఱదనంలో ఆ కుర్రతనంలో
వెనకజన్మలెన్నెన్నో పెనవేసిన వెచ్చదనం కంటున్నా
నిన్ను నేను చూస్తున్నా నీలో నన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా