Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manchi Manasulu (1962)




చిత్రం: మంచిమనసులు (1962)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: సి. సుందరం
విడుదల తేది: 11.04.1962



Songs List:



ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట పాట సాహిత్యం

 
చిత్రం: మంచిమనసులు (1962)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

ఏమండోయ్...
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ

ఏమండోయ్...హోయ్

పసివాని చూచుటకీ తొందరా
మైమరి ముద్దాడి లాలించురా
పసివాని చూచుటకీ తొందరా
మైమరి ముద్దాడి లాలించురా
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా

ఏమండోయ్...
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ
ఏమండోయ్...హోయ్


అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
అబ్బాయి పోలిక ఈ తండ్రిదా
అపురూపమైన ఆ తల్లిదా
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ది రానీకు భగవంతుడా

ఏమండోయ్...
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ
ఏమండోయ్...హోయ్

ప్రియమైన మాఇల్లు విడనాడిపోతే 
తలదాచుకొన మీకు తావైన లేదే, అయ్యో పాపం
ప్రియమైన మాఇల్లు విడనాడిపోతే 
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కపటాలు మానేసి నా మదిలోన 
కాపురము చేయండి కలకాలము

ఏమండోయ్...
ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట
ఏవూరూ వెళతారూ ఏదీకాని వేళ
ఏమండోయ్...హోయ్




నన్ను వదలి నీవు పోలేవులే.. పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనసులు (1962)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల

నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే..ఏ..ఏ..
పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే ...

తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..

తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ...
రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినము రానున్నదిలే..
ఓ…

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే

తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగా...
నీ మేని హొయలు నీలోని వగలు...
నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసి ఉయ్యాలలూగి...
ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
పైపైకి సాగే మేఘాలదాటి..
కనరాని లోకాలు కనగా...

ఆహా ఓహో ఉహు...ఆ… ఆ…ఓ…
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే..




మావా మావా మావా పాట సాహిత్యం

 
చిత్రం: మంచిమనసులు (1962)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, జమున

మావా మావా మావా
మావా మావా మావా 
ఏమే ఏమే భామా
ఏమే ఏమే భామా
పట్టుకుంటే కందిపోవు
పండు వంటి చిన్నదుంటే
చుట్టు చుట్టుతిరుగుతారు మర్యాదా?
తాళి కట్టకుండ ముట్టుకుంటే తప్పుకాదా?
మావా మావా మావా
మావా మావా మావా

వాలువాలు చూపులతో
గాలమేసి లాగిలాగి
ప్రేమలోకి దింపువాళ్లు మీరు కాదా?
చెయ్యి వెయ్యబోతే
బెదురుతారు వింతగాదా?
ఏమే ఏమే భామా
ఏమే ఏమే భామా

నీవాళ్లు నావాళ్లు రాకనే
మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే
నీవాళ్లు నావాళ్లు రాకనే
మనకు నెత్తిమీద అక్షింతలు పడకనే 
సిగ్గు దాచి... ఓహో...
సిగ్గు దాచి ఒకరొకరు
సిగను పూలు కట్టుకొని
టింగు రంగయంటు ఊరు తిరుగొచ్చునా
లోకం తెలుసుకోక
మగవాళ్లు మెలగొచ్చునా
మావా మావా మావా
మావా మావా మావా 
హోయ్ హోయ్ హోయ్ 
హోయ్ హోయ్ హోయ్

కళ్లు కళ్లు కలుసుకోని రాకముందే
అహ కప్పుకున్న సిగ్గు జారిపోకముందే
మాయజేసి ఒహో
మరులుగొల్పి ఒహో
మాయజేసి మరులుగొల్పి మాటగల్పి
మధురమైన మా మనసు దోచవచ్చునా?
నీవు మర్మమెరిగి ఈమాట అడగవచ్చునా
ఏమే ఏమే భామా
ఏమే ఏమే భామా

పడుచుపిల్ల కంటపడితే వెంటబడుదురు
అబ్బో వలపంతా ఒలకబోసి ఆశ పెడుదురు॥
పువ్వు మీద. ఒహో
పువ్వు మీద వాలు పోతు తేనెటీగ వంటి
మగవాళ్ల జిత్తులన్నీ తెలుసులేవయ్యా
మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా
మావా మావా మావా
మావా మావా మావా
హోయ్ హోయ్ హోయ్ 
హోయ్ హోయ్ హోయ్

కొత్త కొత్త మోజుల్ని కోరువారు
రోజు చిత్రంగా వేషాలు మార్చువారూ
టక్కరోళ్లుంటారు టక్కులు జేస్తుంటారు
నీవు చెప్పు మాట కూడ నిజమేనులే
స్నేహం దూరంగా ఉన్నపుడే జోరవునులే
అవునే అవునే భామా
అవునే అవునే భామా

కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి
ఆత్రపడక కొంతకాలమాగుదామయా
కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి
ఆత్రపడక కొంతకాలమాగుదామయా
ఫెళ్లున పెళ్లైతే ఇద్దరికీ అడ్డులేదయ్యా
మావా మావా మావా
మావా మావా మావా





ఓహో పావురమా పాట సాహిత్యం

 
చిత్రం: మంచిమనసులు (1962)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఎస్. జానకి

ఓహో.. ఓహో..  
ఓహో.. ఓహో  పావురమా వయ్యారి పావురమా 
ఓహో.. ఓహో  పావురమా వయ్యారి పావురమా 
మావారి అందాలు నీవైన తెలుపమా 
మావారి అందాలు నీవైన తెలుపమా

ఓహో.. ఓహో  పావురమా వయ్యారి పావురమా 

మనసు మధురమైనది మమతలు నిండినది 
సొగసు నెనెరుగనిది  చూడాలని ఉన్నది 
మనసు మధురమైనది మమతలు నిండినది 
సొగసు నెనెరుగనిది  చూడాలని ఉన్నది 
అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా ? 
అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా ? 
కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ.. 
ఓహో.. ఓహో..

ఓహో.. ఓహో  పావురమా వయ్యారి పావురమా 

వలపు కన్న తీయని పలుకులు వారివి 
తలుచుకున్న చాలును పులకరించు నా మేను 
వలపు కన్న తీయని పలుకులు వారివి 
తలుచుకున్న చాలును పులకరించు నా మేను 
మగసిరి దొరయని మరునికి సరియని 
మగసిరి దొరయని  మరునికి సరియని 
అందరు అందురే అంత అందమైన వారా.. 
ఓహో.. ఓహో.. 

ఓహో.. ఓహో  పావురమా వయ్యారి పావురమా 

అందరి కన్నులు  అయ్యగారిమీదనే 
దిష్టి తగల గలదనీ  తెలిపిరమ్మ కొందరు 
అన్నది నిజమేనా  అల్లిన కథలేనా ? 
అన్నది నిజమేనా  అల్లిన కథలేనా ? 
కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా... 
ఓహో.. ఓహో.. 

ఓహో.. ఓహో  పావురమా వయ్యారి పావురమా 
మావారి అందాలు నీవైన తెలుపమా 
మావారి అందాలు నీవైన తెలుపమా

ఓహో.. ఓహో  పావురమా వయ్యారి పావురమా 




శిలలపై శిల్పాలు చెక్కినారు పాట సాహిత్యం

 
చిత్రం: మంచిమనసులు (1962)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల

అహో... ఆంధ్ర భోజా  శ్రీ కృష్ణ దేవరాయా 
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా
ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా

శిలలపై శిల్పాలు చెక్కినారు  
శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు

శిలలపై శిల్పాలు చెక్కినారు  

కనుచూపు కరువైన వారికైనా 
కనుచూపు కరువైన వారికైనా 
కనిపించి కనువిందు కలిగించు రీతిగా

శిలలపై శిల్పాలు చెక్కినారు  

ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు  
ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు 
ఒకచెంప శృంగార మొలుకు నాట్యాలు  
నవరసాలోలికించు నగరానికొచ్చాము 
కనులు లేవని నీవు కలత పడవలదు 
కనులు లేవని నీవు కలత పడవలదు 
నా కనులు నీవిగా చేసుకుని చూడు

శిలలపై శిల్పాలు చెక్కినారు  
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు  

ఏక శిల రధముపై  లోకేశు ఒడిలోన  
ఓరచూపుల దేవి ఊరేగి రాగా 
ఏక శిల రధముపై  లోకేశు ఒడిలోన  
ఓరచూపుల దేవి ఊరేగి రాగా 
రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి 
సరిగమా పదనిస స్వరములే పాడగా 
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు 
కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు 
కొడుకు పుట్టాలనీ కోరుతున్నారనీ

శిలలపై శిల్పాలు చెక్కినారు  
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు
శిలలపై శిల్పాలు చెక్కినారు  

రాజులే పోయినా  రాజ్యాలు కూలినా  
కాలాలు మారినా  గాడ్పులే వీచినా 
మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా  
చెదరనీ కదలనీ శిల్పాల వలెనే 
నీవు నా హౄదయాన నిత్యమై సత్యమై  
నిలిచి వుందువు చెలీ నిజము నా జాబిలీ ! 




త్యాగం ఇదియేనా ?  పాట సాహిత్యం

 
చిత్రం: మంచిమనసులు (1962)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పి.సుశీల

త్యాగం ఇదియేనా ? 
హృదయం శిల ఏనా ?
ఏల ఈ మోసం ?  (2)

ఇల్లాలి మనసే కల్లోలమాయె 
ఏలా, ఈ మోసం ఏదీ నీ హృదయం ? 
నీవు కట్టిన తాళి  నిగనిగ మెరిసేను 
కనికరమున గాజులు  కరముల వెలిగెను 
ఆనాటి పారాణి ఆనవాలు మిగిలేను 
ఆ జాలి, ఆ మమత నీకు లేక పోయేనా? 

ఏదీనీ హృదయం ? 

నిలువనీడ నిచ్చావు  నగలు చీరెలిచ్చావు 
అంతూ పొంతూ లేని ఆశలు కలిగించావు 
భాధ్యత అంతతో తీరెనని తలచావా? 
భాధ్యత అంతతో తీరెనని తలచావా? 
అంతేనా... అంతేనా ? 
చదివిన నీ చదువంతా వ్యర్ధమా ?

ఏదీ నీ హృదయం ?

రేయి పవలు కంటికి రెప్పగా
మేను మనసుమాటా ఒక్కటిగా 
జీవితమంతా చెంత నిలిచి ఉండాలి 
త్యాగమదే... త్యాగమదే...  
మూడు ముళ్ళు వేయుటయే త్యాగ మనితలచితివా

ఏదీ నీ హృదయం  త్యాగం ఇదియేనా ?  
హృదయం శిలఏనా ఏల ఈ మోసం ? 
కలకమ్టి కంట కన్నీరోలికినచో...
గరలమైపొవును అమృతమే మరువకుమా...
కన్నులున్న అంధుడవై బాధలు పడ నేలా..? 
కనులు లెలీ ధీనురాలి గాధలు వినలేవా...? 
మగువను నీ దానిని చేసుకో  
మనసును నీదారికి తీసుకో 
మానవ రూపంలో దేవునిగా మారిపో ! 




ఎంతా టక్కరివాడు పాట సాహిత్యం

 
చిత్రం: మంచిమనసులు (1962)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: జమునారాణి

ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు
ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు
వంటచేను గట్టు మీద వంటిగ నే పోతుంటే 
వెంట వచ్చినట్టులున్నది ఎవరో వెనకనిలిచినట్టులున్నది 
వెంట వచ్చినట్టులున్నది ఎవరో వెనకనిలిచినట్టులున్నది 
గుబులు గుబులుగా  గుండె ఝల్లుమని 
గుబులు గుబులుగా  గుండె ఝల్లుమని 
బిక్కు బిక్కుమని చూశాను ఫక్కున పక్కనినవ్వేను 
ఎవరూ?... నానీడ!

ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు

పొర్లిపారు ఏటి లోన బుటుకు బుటుకుమునుగుతుంటే 
బుగ్గ తాకినట్టులున్నది ఎవరో పైటలాగినట్టులున్నది 
గిలిగింతలు పెట్టినట్లు ఒడలంతాపులకరించే 
నీళ్ళంతా వెదికినాను త్రుల్లి త్రుల్లిపారిపోయేనూ 
ఎవరూ?... చేప! 

ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు

అర్థరాత్రి వేళ నేను ఆదమరచి నిదురపోతే 
వద్ద చేరినట్టులున్నది ఎవరోముద్దులాడినట్టులున్నది
వద్ద చేరినట్టులున్నది ఎవరోముద్దులాడినట్టులున్నది
చిక్కినాడు దొంగయనుకొని చేయి చాచిపట్టబోతే 
కంటి కేమి కానరాక కరిగి కరిగి పోయేను
ఎవరూ?...కల!

ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు
ఎంతా టక్కరివాడు నా రాజు ఏ మూలనోనక్కి నాడు



Most Recent

Default