Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mechanic Alludu (1993)




చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి , విజయశాంతి
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: అల్లు అరవింద్
విడుదల తేది: 27.05.1993



Songs List:



ప్రేమిస్తె ప్రాణమిస్త పాట సాహిత్యం

 
చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు

పల్లవి:
ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త
శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త
ధౌర్జన్యం ఇంక సాగదంట
స్వార్దాన్ని మట్టు పెట్టమంట
స్నేహాన్ని పంచి పెట్టమంట
అడ్డొస్తే దంచి కొట్టమంట
న్యాయమె నా పతం
రాజసం సాహసం పౌరషాలు
నాకు ఆయుదాలు

ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త
శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త

చరణం: 1
సింహాలు జూలు పట్టి ఆడిస్త
తోడేళ్ళ తోక పట్టి జాడిస్త వాయిస్త
నిజాన్ని ఎక్కు పట్టి హజాన్ని తొక్కి పట్టి
గుండాల్ల దొక్క చించి చోపిస్త ర

నీ శక్తి చూపై చూపై
నీ కత్తి దూసెయ్ దూసెయ్
అలుపెరగకుంటె గెలుపే రా హ హ హ
ఇక చూపించై ఆవేశం
కొనసాగించెయ్ పొరటం
పడగెత్తిందిక ఆవేశం
తుద ముట్టించై కల్లోలం

న్యాయమె నా పదం
రాజసం సాహసం పౌరుషం
నాకు ఆయుదాలు

ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త
శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త

చరణం: 2
గుప్పెట్లొ ఆకసాన్ని బందిస్త హ హ హ
క్షణంలో సాగరాల్ని ఎక్కిస్త
తారల్ని దించై దించై
దిక్కుల్ని వంచైయ్ వంచై
మనసుంటె మార్గం ఉందిరా
పవరుందోయ్ నీ కండల్లో
భలముందోయ్ నీ గుండెల్లో
నీ దైర్యాన్నె సందించు
నీ లక్ష్యాన్నె చేదించు

న్యాయమె నా పదం
రాజసం సాహసం పౌరుషం
నాకు ఆయుదాలు

ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త
శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త

ధౌర్జన్యం ఇంక సాగదంట
స్వార్దాన్ని మట్టు పెట్టమంట
స్నేహాన్ని పంచి పెట్టమంట
అడ్డొస్తే దంచి కొట్టమంట
న్యాయమె నా పతం
రాజసం సాహసం పౌరషాలు
నాకు ఆయుదాలు

ప్రేమిస్తె ప్రాణమిస్త వంచిస్తె అంతు చూస్త
శరనంటె కొమ్ము కాస్త శాసిస్తే కాల రాస్త






చక్కా చక్కా చెమ్మ చెక్క పాట సాహిత్యం

 
చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
చక్కా చక్కా చెమ్మ చెక్క తక్కా తక్కా తై తక్కా
తస్సా చక్కా ఎం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా
కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గిచ్చనా
అయ్యబాబో అమ్మనీ జిమ్మడా ఆగలేను హత్తుకో పిల్లడా
అరె లాయిలప్పా గోలుగప్ప అడుకుందాం చెమ్మచెక్కా
సై సై సై సై సై...

చక్కా చక్కా చెమ్మ చెక్క తక్కా తక్కా తై తక్కా
తస్సా చక్కా ఎం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా

ధిం ధిం ధింతన ధింతాన ధిం
ధిం ధిం ధింతన ధింతాన ధిం
ధిం ధిం ధింతన ధింతాన ధిం
ధిం ధిం ధింతన ధింతాన ధింతాన

చరణం: 1
బైట పైట పట్టు విడనీదే
పడుచు పొంగు హంగు కంట పడనీదే
అమ్మో అమ్మో  బెట్టు చెడిపోదా
మాయ మంత్రం వేస్తే ఏదో అయిపోదా
మంత్రాలు మనకెందుకే
ఓ పిల్లా మురిపెంగా ముద్దీయవే మ్మ్...
ముద్దిస్తే ముంచేయవా ఓ బాబు చోటిస్తే కాటేయవా
చెక్కిలగింతల బుల్లి తైతక్కలచుక్కల పిల్లి
ని ఎత్తుల మత్తుల జాం జంగిడి
పట్టేశా పట్టేశా పట్టేశా పట్టేశా
లేయ్ లేయ్ లేయ్ లేయ్ లేయ్...

చక్కా చక్కా చెమ్మ చెక్క తక్కా తక్కా తై తక్కా
తస్సా చక్కా ఎం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా

చరణం: 2
ముక్కు మీద కోపం తగదంటా
మగడా మడత కాజా ఇస్తా తినమంటా
కాజా గీజా మనకు సరిపోవే
చెలియా సోకు సోంపు మొత్తం కలబోయివే
షోకిస్తే షాకియ్యవా ఓ బావా సోత్తిస్తే చంపెయ్యవా
తిరగేస్తే మరగెయ్యాకే ఓ బుల్లో సందిట్లో చనువియ్యవే
కత్తెర చూపుల బాయ్యో నీ జిత్తులు చల్లవురయ్యో
నా వెచ్చని మెళ్ళో పచ్చని తాళిని
కట్టేయ్  కట్టేయ్ కట్టేయ్ కట్టేయ్
ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్...

చక్కా చక్కా చెమ్మ చెక్క తక్కా తక్కా తై తక్కా తైతక్కా
తస్సా చక్కా ఎం తిక్క ఒళ్ళోకొస్తా ఎంచక్కా ఎంచక్కా
కొత్త కోక పెట్టనా కట్టనా మల్లె పూలు గిచ్చనా గిచ్చనా
అయ్యబాబో అమ్మనీ జిమ్మడా ఆగలేను హత్తుకో పిల్లడా
అరె లాయిలప్పా గోలుగప్ప అడుకుందాం చెమ్మచెక్కా
సై సై సై సై సై...




గురువా గురువా పాట సాహిత్యం

 
చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

సాకీ:
ఈ విశాల నిషాల ఖుషీల కారుఖానాలో
రంజుగా రంభలా వచ్చింది ఓ రమణీమణి
శభాష్ గురు! ఇరగొట్టై!

పల్లవి:
గురువా గురువా  - శిషువా శిషువా
గురువా గురువా గుర్రమెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
శిషువా శిషువా  చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ
వీర మత్తెక్కి పోయెలె బాల రాజ
నడి రోడ్డెక్కి నవ్వెలే కన్నె రోజా
కోడి పెట్టుంది ఎదరా కొత్త యముడ
పోజు కొట్టింది కసిగా దొంగ మొగుడ
అడ్డ రోడ్డు ధారి మీద
జారి పడ్డ జాబిలమ్మ
ఊపు చూస్తె ఉర్వశేరా దినక్ దిన

గురువా గురువా గుర్రమెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
శిషువా శిషువా  చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ

చరణం: 1
సందు చూసి చిన్న దాని చేయి పట్టు
గ్యాంగు లీడర్ అల్లె స్టెప్పులేసి రెచ్చ గొట్టు
గురు గురు  - బోలోచిరు
వోణి గురు  - పట్టై చిరు
ప్రేమ దాసు పోజు పెట్టి రెచ్చి పోన
పూలరంగడల్లె కీలు గుర్రమెక్కి పోన
చిరు చిరు  - క్యా హై గురు
స్లోలి చిరు - చంపేస్తా గురు
నాడు కట్టా ప్రేమ నగరు
నేడు నీదే ఛాన్స్ బ్రదరు
అదిరి పోయె పిల్ల ఫిగరు
అరగదీస్తా చింత పొగరు
కొంగు పట్టుకో అందగాడ
పొంగు చూసుకొ పోకిరోడ
ఉట్టి మీద ఉల్లిపాయ
గట్టు మీద బెండకాయ
మిక్స్ చేసి లక్కు చోసుకొ
చమక్కు చమ్మ!

గురువా గురువా గుర్రమెక్కు గురువా
ఎంత సేపు ఒకటే దరువా
శిషువా శిషువా  చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ - ఏం పర్లేదు

చరణం: 2
అరె! పప్పు చెక్క లాంటి పిల్ల చూడు గురువా
దాని రూటు మార్చి రైటు చేసెదెట్ట గురువా
ఇంతే కదా  - అంతె గురు
వినుకో చిరు  - చెప్కొ గురు
పట్టు చీర కట్టబెట్టి చెంగు బట్టు
పిల్ల అంటిపెట్టుకోక పోతె ఒట్టు పెట్టు
అంతె చిరు  - వారె గురు
చల్ క్యారె చిరు
ఎవర్గ్రీను దేవదాసు
మరొక డోసు  - వెయ్యి బాసు
తిరిగిరాని వయసు నాది
తరిగిపోని స్పీడు నీది
మల్లి వస్తిరో మంచి దొంగ - శభాష్
కొల్ల కొట్టుకొ సుబ్బరంగ - అలా కానీ
కొమ్మ చాటు నిమ్మకాయ
రెమ్మ చాటు దబ్బకాయ
చెక్కు తీసి చక్కబెట్టుకొ
దిదాంకు తక దిన..

గురువా గురువా - శిషువా శిషువా
గురువా గురువా గుర్రమ్మెక్కు గురువా
ఎంత సేపు ఒకటే దరువా
శిషువా శిషువా  చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ
వీర మత్తెక్కి పోయెలె బాల రాజా
నడి రోడ్డెక్కి నవ్వెలే కన్నె రోజా
కోడి పెట్టుంది ఎదరా కొత్త యముడ
పోజు కొట్టింది కసిగ దొంగ మొగుడ
అడ్డ రోడ్డు ధారి మీద
జారి పడ్డ జాబిలమ్మ
ఊపు చూస్తె ఉర్వశేరా
దిదాంకు తక దిన..

గురువా గురువా గుర్రమెక్కు గురువా
ఎంత సేపు ఒకటే ధరువా
శిషువా శిషువా  చెప్పినట్టు వినవా
కుడి ఎడమైతె గొడవ - నో ప్రోబ్లమ్స్





గుంతలక్కిడి గుండమ్మొ పాట సాహిత్యం

 
చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
గుంతలక్కిడి గుండమ్మొ గుండెల్లొ గుబా గుబా
చింతపిక్కల చిట్టెమ్మొ సోకంతా లబా డబా
రావె మన్మద రేఖ పరిచా వెన్నెల చాప
లిప్పుకి లిప్పుకి లంగరు వేద్ధం చలొ చలొ పాప

లింగ లింగ హొ లింగ హొ లింగ లింగ లింగ లింగ హొ
లింగ లింగ హొ లింగ హొ లింగ లింగహొ

గుంతలక్కిడి గుండమ్మొ గుండెల్లొ గుబా గుబా
చింతపిక్కల చిట్టెమ్మొ సోకంత లబా డబా

చరణం: 1
హై పిల్ల బెంగాలి రసగుల్ల ఎక్కిస్త నీలొ పిల్ల పల్టీ కొట్టిస్తానె మల్ల
షోకిల్ల ఎల్లుండి పర్టి కల్ల చెయిస్తా వల్లు గుల్ల లెకుంటె కొట్టుకొ జల్ల
మిడిమెలపు దెబ్బలు చాలిక నీవిక చూసినాను పిల్లో
నయగారపు ముద్దుల ఎత్తులు చుద్దాం ఒదిగిపోవె ఒళ్ళో

లింగ లింగ హొ లింగ హొ లింగ లింగ లింగ లింగ హొ
లింగ లింగ హొ లింగ హొ లింగ లింగహొ

గుంతలక్కిడి గుండమ్మొ గుండెల్లొ గుబా గుబా
చింతపిక్కల చిట్టెమ్మొ సోకంత లబా డబా

చరణం: 2
ఓరయ్యొ పంతాలు మానెవయ్యొ
నన్నిట్టా వదిలేవయ్యొ ఓ రాజి కొద్దం బావయ్యొ
ఓలమ్మొ వయ్యారి ముద్దుగుమ్మొ
లోగుట్టు ఎరుకేనమ్మొ చెవిలొ పువ్వెట్టకె బొమ్మొ
తెలిసె మరి ఎందుకు నీ చిరుజిత్తులు రుబ్బుడాపవయ్యొ
నడి రాతిరి ముచ్చట కానిక ఇంటికి దారి చోపవయ్యొ

లింగ లింగ హొ లింగ హొ లింగ లింగ లింగ లింగ హొ
లింగ లింగ హొ లింగ హొ లింగ లింగహొ

గుంతలక్కిడి గుండమ్మొ గుండెల్లొ గుబా గుబా
చింతపిక్కల చిట్టెమ్మొ సోకంత లబా డబా
రావె మన్మద రేఖ పరిచా వెన్నెల చాప
లిప్పుకి లిప్పుకి లంగరు వేద్ధం చలొ చలొ పాప

లింగ లింగ హొ లింగ హొ లింగ లింగ లింగ లింగ హొ
లింగ లింగ హొ లింగ హొ లింగ లింగ లింగ లింగ లింగ హొ
పాప




అంబ పలికింది పాట సాహిత్యం

 
చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

అంబ పలికింది



ఝుమ్మనె తుమ్మెధ వేట పాట సాహిత్యం

 
చిత్రం: మెకానిక్ అల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

పల్లవి:
ఝుమ్మనె తుమ్మెధ వేట
ఘుమ్మనె వలపుల తోట
అదేమొ మామ  - అదేలె ప్రేమ
జగదేక వీర శూర తరించైనా
సరసాల సాగరాలె మధించైనా
ఝుమ్మనె తుమ్మెధ వేట
ఘుమ్మనె వలపుల తోట

చరణం: 1
మిడిసి మిడిసి పడు
ఉడుకు వయసు కత వినలేద
ఎగసి ఎగసి పడు
తనువు తపన నువు కనలేదా
పెదవులతో  -  కలవమని
అందుకే నే ముందుకొచ్చా
అందినంతా ఆరగిస్తా
రా రా రా రా రాజచంద్రమ

ఝుమ్మనె తుమ్మెధ వేట
ఘుమ్మనె వలపుల తోట
అదేమొ భామ - అదేలె ప్రేమ
సరసాల సాగరాలె మధించైనా
జగదేక వీర శూర తరించైరా

చరణం: 2
సెగలు రగిలె ఒడి
బిగిసె రవికె ముడి కదిలేవొ
చిలిపి వలపు జడి
తగిలి రగిలె ఒడి జవరాలా
వడి వడిగా  - ముడిపడని
చెప్పలేకే చేరుకున్నా
ఓపలేకే మేలుకున్నా
రావె రావె రాజమంజరి

ఝుమ్మనె తుమ్మెధ వేట
ఘుమ్మనె వలపుల తోట
అదేమొ మామా  - అదేలె ప్రేమ
శృంగార సార్వభౌమ తరించైనా
సరసాల దీవి చేరి సుఖించైన

Most Recent

Default