Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mrugaraju (2001)




చిత్రం: మృగరాజు (2001)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, సిమ్రాన్, సంఘవి
దర్శకత్వం: గుణశేఖర్
నిర్మాత: కె.దేవి వర ప్రసాద్
విడుదల తేది: 11.01.2001



Songs List:



రామయ్య పాదాలెట్టె పాట సాహిత్యం

 
చిత్రం: మృగరాజు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్

రామయ్య పాదాలెట్టె సీతమ్మ పారాణెట్టె ఈ కొండ కోనసీమల్లో
అహ పులకించే గుండెలోతుల్లో
కోయోడు ఘంటం పట్టె బోయోడు గురిచూపెట్టె సింహాలు పొంచే దారుల్లో
నరసింహాలు గెలిచే పోరుల్లో
పులి పులి పులి పులి పులి పులి పులి పులి అదిగో పులితోక
గిలి గిలి గిలి గిలి నటాల గిలి గిలి ఇదినా పొలికేక
పులి పులి పులి పులి పులి పులి పులి పులి అదిగో పులితోక
గిలి గిలి గిలి గిలి నటాల గిలి గిలి ఇదినా పొలికేక

ఫెళా ఫెళా ఫెళ పంజా విసిరే బెబ్బులిలో శౌర్యం
ఛలా ఛలా ఛల ఛెంగున ఎగిరే జింకలలలో వేగం
చిమా చిమా చిమ చీమలబారులు చెప్పేనొక పాఠం
మెరా మెరా మెర మెరుపుల్లో నెమలాటే ఒక నాట్యం
మన్నైన ఇస్తుంది మాణిక్యాలెన్నో..... మానైనా చేస్తుంది త్యాగాలెన్నెన్నో
అడవుల్లో ఉంటాయి అందాలెన్నెన్నో..... అడగకనే చెబుతాయి అర్ధాలింకెన్నో
జిలిబిలి జిలిబిలి జిగేలు జిలిబిలి ఇదిగో నెమలీక
చలి చలి చలి చలి కొరుక్కుతిను చలి ఇదిగో నిప్పుకాక
జిలిబిలి జిలిబిలి జిగేలు జిలిబిలి ఇదిగో నెమలీక
చలి చలి చలి చలి కొరుక్కుతిను చలి ఇదిగో నిప్పుకాక

ఘనా ఘనా గజరాజు రాకకే గగనాలదరాలి
మహా మహా మృగరాజు అడుగులో పిడుగులు రాలాలి
గగనం భువనం అదిరిచెదిరి నా ఎదురే నిలవాలి
గిరిలో తరిలో దరిలో ఝరిలో మనిషే గెలవాలి
మృగమేదో దాగుంది మానవరూపంలో...... వెంటాడి వేటాడు మమతల చాపంతో
వేటాడే ఒడుపున్న వేగుల చూపుల్లో...... కాపాడే గుణముంది కన్నుల రెప్పల్లో
చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడుతో జతకాక
తలబడి తడపడి చెరపడి దరిపడి గుంపును విడిపోక
చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడుతో జతకాక
తలబడి తడపడి చెరపడి దరిపడి గుంపును విడిపోక




అల్లెల్లే అల్లెల్లే మా పాట సాహిత్యం

 
చిత్రం: మృగరాజు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్ , యస్.పి.శైలజ

అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ 
అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ 
అటవి ముల్లంటి పడుచోయమ్మ, మరదలు కూన అదిమరలకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు చానా
అరె కన్ను, కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క,
జున్ను ముక్క జుర్రుకుపోనా, చక్కని చుక్కా
అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
మొగలిపూవంటి మొగుడోయమ్మ
మరువపు తేమ, తెగమరిగిన మామ, కొరకని జామ ఈ చిలకదిరామ
చుక్కాలొచ్చేదాక నిన్ను ఆపేదెట్టా,
ఒహొ దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా

హే జమాయించూ
ఓ తమాయించు
పువ్వులబోనాలు, చిరునవ్వుల దాణాలు,
పుంజుకు పెట్టేస్తే లేత ముంజుల ముద్దిస్తా
వెన్నెల బాణాలు, నులివెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మామ జాతరకొచ్చేస్తా
హే ఒంపుసొంపు వాగువంకై వచ్చేస్తావా
యహ్ కట్టూ బొట్టూ తేనెల పండూ గుచ్చేస్తావా

హే యమాగుంది
ఈ జమాబందీ
చింతల తోపుల్లో నీ చింతల దోచేస్తా
సంతల బేరాల్లో భీమా సిగ్గులు తూచేస్తా
చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మామ చాటుగ సందిస్తా
హే రేపోమాపో లగ్గా లెట్టి లంగర్‌లేసేస్తా
అహా ఆటూపోటూ అడ్డేటేని ఒడ్డే చూస్తా 




హే శతమానమన్నదిలే పాట సాహిత్యం

 
చిత్రం: మృగరాజు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: హరిహరణ్, సాధన సర్గం 

హే శతమానమన్నదిలే




ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: మృగరాజు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిరంజీవి

అలనాడు బ్రహ్మ మనుషుల తలరాతలు రాయడంలో కాస్త అలసిపోయి తలనొప్పితో బాధపడుతుంటే సరస్వతి దేవి తీవ్రంగా ఆలోచించి పాలకడలి నుంచి పాలని, శివుడి తలమీద గంగమ్మ నడిగి నీటిని, మన్మధుడి చెరకు విల్లునుంచి చక్కరను, ఊటి ఉద్యానవనం నుంచి తేయాకును తెప్పించి బాగా కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోచి ఇచ్చిందొక చక్కని చిక్కని టీ.....
అది తాగిన బ్రహ్మ  ఆనాటినుంచి ఈనాటిదాకా 
రెష్టులేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు
అలాంటి మహిమ కలిగిన ఈ టీకి 
మరో పేరే ఛాయ్ మేరా భాయ్
ఆ ఛాయ్ మహత్తును నోరారా చెబుతా
నోరూరేలా వినుకోవోయ్

ఏ ఛాయ్ చటుక్కునా తాగరా భాయ్
ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్
ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్
ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్
ఏ ఛాయ్ గరీబుకి విందురా భాయ్
ఈ ఛాయ్ నవాబుకి బంధువేనోయ్
ఏ ఛాయ్ మనస్సుకి మందురా భాయ్
ఈ ఛాయ్ గలాసుకి జే జే...

డ్రైవర్ బాబులకి ఈ టీలే పెట్రోలు
డాక్టర్ బాబులకి ఈ టీలే టానిక్కు
లేబర్ అన్నలకి టీనీళ్ళే జీతాలు....
విద్యార్ధుల చదువులకి టీలే విటమిన్లు
తెల్లదొరలు ఇండియాకు తెచ్హారు టీ
ఆ టీతాగి వాళ్ళతోటి వేశాము భేటి
అన్నాడు అలనాటి ఆ శ్రీ శ్రీ
తాను టీ తాగడంలో ఘనాపాటి
టీ వల్ల లాభాలు శతకోటి
ఆ లిస్టంత అవుతుంది రామకోటి

అల్లం టీ కొడితే అది పెంచును ఆరోగ్యం
మసాలా టీ కొడితే అది దించునురా మైకం
లెమ్మన్ టీ కొడితే ఇక లేజి మటుమాయం
ఇరాని టీ కొడితే ఇటురాదా ఆ స్వర్గం
కేఫుల్లో ధాబాల్లో ఫైవ్ స్టారు హోటల్లో ఎక్కడైన దొరికేది ఏంటి
అ టీ టీ
సినిమా హాళ్ళల్లో విశ్రాంతి వేళల్లో తప్పకుండ తాగేది ఏంటి
అ టీ అన్నా
టీ కొట్టుతోనే బతుకుతారు కొందరు
టీ కొడితేనే బతుకుతారు అందరు




హంగామా హంగామా పాట సాహిత్యం

 
చిత్రం: మృగరాజు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కులశేఖర్
గానం: రఘుకుంచె, చిత్ర

హంగామా హంగామా ఆనందమందామయా
రంగేళి ఊహల్లో రోజంతా ఉందామయా
ఏడేడు లోకాల అందాలు చూద్దామయా
ఆరారు కాలాలు నీతోటి సాగాలయా
దారి చూపిస్తా పిల్లా హాయి చూపిస్తా
ఆదితాళంలో నీతో ఆటలాడిస్తా
సోకు రాసిస్తా నీకు సోయగాలిస్తా సందెవేళల్లో
ముద్దు సంతకాలిస్తా 

హవ్వాయ్యో అంది ఈడు వేడి తాపం
వారెవ్వా చూడు ప్రేమ ఇంద్రజాలం
అంటూ అడుగుతుంది మోహం హువ్వార్యూ
లోలో ఉంటుంటే ఎరగనంత పాపం
గాలి తాకిందో రమ్మో కోక జారింతో,
గిల్లి పోయిందో రమ్మో కందిపోయింది
కన్ను గీటిందీ పిల్ల సైగ జేసిందీ,
షోకు చూపిందీ నాకు కాకరేపిందీ 

లవ్లీగా ఉందీ వేడి ముద్దులాడి
రోజులా లేదు జారుతుంది పైట 
లాలీజో అంటూ పాడకమ్మ పాట
లేలోజీ అన్న అయ్యగారు లేటా
స్పీడుమీదుందీ బండి వేడిమీదుంది
ఆగమంటున్నా అయ్యో ఆగనంటుంది
చెంచురామయ్యో చెయ్యి అందుకోవయ్యో,
ఆగిపోకయ్యో నాతో చిందులాడయ్యో 




దమ్మెంతో చూపించరో పాట సాహిత్యం

 
చిత్రం: మృగరాజు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: సుఖ్విందర్ సింగ్, స్వర్ణలత

దమ్మెంతో చూపించరో 

Most Recent

Default