Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Maska (2009)




చిత్రం: మస్కా (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ (All)
నటీనటులు: రామ్ పోతినేని, షీలా కౌర్, హన్సిక మోత్వాని
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: యమ్.యస్.రాజు
విడుదల తేది: 14.01.2009



Songs List:



హరే హరే రామ పాట సాహిత్యం

 
చిత్రం: మస్కా (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: సూరజ్ జగన్

హరే హరే రామ హరే హరే కృష్ణ 
అమ్మడి అడ్రస్సిల్లా
చెమకుల చెల్లా సొగసుల ఖిల్లా
చిక్కదే చేతికి ఇల్లా

హాయ్ రే ఈ పరుగులెలా 
హాయ్ రే పసి చారుశీల 
హాయ్ రే పరువాల బాల రావే

మారో మారో మారో - హేయ్
మారో మారో మారో - హేయ్
మారో మారో మారో మస్కా మారో (2)

హరే హరే రామ హరే హరే కృష్ణ 
అమ్మడి అడ్రస్సిల్లా
చెమకుల చెల్లా సొగసుల ఖిల్లా
చిక్కదే చేతికి ఇల్లా

చేజింగే చేసైనా చాటింగ్ లో కెళ్ళైనా 
మాటల్తో పడకొట్టి పట్టేస్తా
అయితే ఎవరెక్కైనా లేదా లండన్ కైనా 
హ్యాపీ గా చెక్కేసి సెటిలవుతా
లైఫే మసకైపోతే కొట్టాలి తప్పదు మస్కా 
రిస్కే చేసెయ్యాలి తప్పేమి కాదులే మస్కా

హే ఆరైనా మరి నూరైనా 
ఇక ఆరే నూరు నూరే ఆరైనా

మారో మారో మారో - హేయ్
మారో మారో మారో - హేయ్
మారో మారో మారో మస్కా మారో (2)

హరే హరే రామ హరే హరే కృష్ణ 
అమ్మడి అడ్రస్సిల్లా
చెమకుల చెల్లా సొగసుల ఖిల్లా
చిక్కదే చేతికి ఇల్లా


చుడతా ఐమాక్సైనా వస్తా గాలాక్సైనా పడతా నిను ఏ చోట దాగున్నా
సైబర్ కేఫైనా హైటెక్ సిటీ లో నున్న 
అంతా గాలిస్తున్నా చూస్తున్నా

మిడ్ నైట్ అవుతూ వున్న 
పబ్బుల్లో కాపు కాస్తున్నా
ఎన్నారై లెవరున్నా లైఫ్ హిస్టరీ లాగి వేస్తున్నా

హే ఆరైనా మరి నూరైనా 
ఇక ఆరే నూరు నూరే ఆరైనా

మారో మారో మారో - హేయ్
మారో మారో మారో - హేయ్
మారో మారో మారో మస్కా మారో (2)

హరే హరే రామ హరే హరే కృష్ణ 
అమ్మడి అడ్రస్సిల్లా
చెమకుల చెల్లా సొగసుల ఖిల్లా
చిక్కదే చేతికి ఇల్లా




గుండె గోదారిలా పాట సాహిత్యం

 
చిత్రం: మస్కా (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: జూబిన్ గర్గ్ , కౌశల్య

గుండె గోదారిలా చిందులేస్తోందిలా
నీలిమేఘాలుగా తేలిపోతోందలా
నేను నే కానుగా ఇంకోలా మారిలా నిజమా !

I am in love,  I am in love 
I am in love,  I am in love 

గుండె గోదారిలా చిందులేస్తోందిలా

నాలో చూసాను ఏ నాడో ఓ వింతా
ఎవరో ఆక్రమించారు మనసంతా

ఊహల్లో నువే చెలీ నా ఎదురుగ నిలిచావే
అందంగా వలపువై నీ తలపులో ముంచావే
నేను శూన్యంలా అయ్యానికా 

I am in love,  I am in love 
I am in love,  I am in love 

ప్రవహించింది నీ నుంచి ఓ ప్రేమా
అది నను చేరి లయ పెంచే మదిలోనా

మౌనంగా మనసుతో యే మంతనం జరిపావే
చిత్రంగా అడుగునై నీ అడుగుతో కదిలానే
నీకే అయినానే ప్రియబానిసా !

I am in love,  I am in love 
I am in love,  I am in love 

గుండె గోదారిలా  చిందులేస్తోందిలా
నీలిమేఘాలుగా  తేలిపోతోందలా



కల్లోకి దిల్లోకి పాట సాహిత్యం

 
చిత్రం: మస్కా (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: చక్రి

కల్లోకి దిల్లోకి లవ్ మెయిలై వచ్చేసావే 
పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో

కల్లోకి దిల్లోకి లవ్ మెయిలై వచ్చేసావే 
పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో
లైనేసి లాగేసి సైనేసై పట్టేసావే 
ప్యారో నా ప్యారో సితారో

హాచ్ సిగ్నలై నిను చుట్టిముట్టి నీతో నీడై సాగాన
టచ్ స్క్రీన్ ల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన

నువ్వే నీ రూపే నా గుండెల్లో పడిపోయిందే ముద్ధర
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర

కల్లోకి అరె దిల్లోకి
కల్లోకి దిల్లోకి లవ్ మెయిలై వచ్చేసావే 
పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో

ఒక్క ఐడియా మార్చేస్తుంది నిండు జీవితాన్నే
నువ్వు అందితే అయిపోతుందే లైఫ్ గోల్డ్ కాయినే

ఎండలో వానై కురిసావే చెలి చల్లగా తాకవే
రేయిలో మెరుపై మెరిసావే నను వెలుగై చేరావే
నువ్వే దిల్ ధడ్కన్ వే
నువ్వే నా తన్ మన్ వే
నువ్వే నా మొహబ్బత్ వే
నా యావత్ వే నా భవిష్యత్ వే

ఆహ్ కల్లోకి దిల్లోకి లవ్ మెయిలై వచ్చేసావే 
పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో

తిట్టు కొట్టు పడతానే నువ్వంటే ఎంత లవ్ లే
నిను నాలో దాచుకుంటానే న స్విస్ బ్యాంకు నువ్వే
నిను వెతుకుతూ నే వెళ్తుంటే నువ్వు ఎదురై వచ్చావే
నను వలపుల సొగసుల లోన గమ్మత్తుగా ముంచావే

నువ్వే నా ప్రియ నిధివే 
నువ్వే పరమావది వే
వరమై నను చేరావే ఇప్పుడే

వస్తా దరికొస్తా నీ వెంట నే ఎగిరొస్తానే
వుంటా నీ వెంట న లైఫ్ లైన్ నువ్వే

ఆహ్ కల్లోకి దిల్లోకి లవ్ మెయిలై వచ్చేసావే 
పిల్లో నా ఫుల్లో జిల్ జిల్లో

హాచ్ సిగ్నలై నిను చుట్టిముట్టి నీతో నీడై సాగాన
టచ్ స్క్రీన్ ల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన

నువ్వే నీ రూపే నా గుండెల్లో పడిపోయిందే ముద్ధర
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర




కలగన్న పాట సాహిత్యం

 
చిత్రం: మస్కా (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: చక్రి , కౌశల్య

కలగన్నా కలగన్నా కలగన్నాననుకున్నా
కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా

విరహాలే కరిగెనుగా హృదయేలే కలిసెనుగా
నిసి కాస్త శశిలా మారెనుగా
నిజమొకటే వున్నదిగా నిలకడగా తెలిసెనుగా
తెలిసాకే మనసుని పరిచాగా

స్వర్గం నువ్వుంటే నరకం లేకుంటే
టేక్ మీ అవే టేక్ మీ అవే టేక్ మీ అవే

కలగన్నా కలగన్నా కలగన్నాననుకున్నా
కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా

చొరబాటే జరిపాగా ని ఏదనే దోచగా
ఆపై నీ ప్రేమతో మారాగా
బిగి కౌగిలి ఇచ్చేశా మది జివ్వున లాగేసా
నీ తప్పులో నేను వున్నాగా

కాలం మరి వడివడిగా పావులనే కదిపెనుగా
మనతో ఆటాడి ఓడెనుగా
రాసుంటే తప్పదుగా ఎడబాటు నిలువదుగా
నిజమైన వలపుకు గెలుపేగా

స్వర్గం నువ్వుంటే నరకం లేకుంటే
టేక్ మీ అవే టేక్ మీ అవే టేక్ మీ అవే

కలగన్నా కలగన్నా కలగన్నాననుకున్నా
కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా

చలి మేఘం ఉరిమెనుగా తన మౌనం వీడెనుగా
జడి వానై నా పై జారెనుగా
శిల నువ్వే అనుకున్నా కోపంతో పొరపడినా
శిల లోపలి శిల్పం చూస్తున్నా

అనునిత్యం పరుగిడిన నీకోసమే నిలబడినా
నీ కళ్ళలో ఖైదీని అవుతున్నా
నీ హృదయం లయ నడుమ నా హృదయం దాస్తున్నా
నీతోడే కావాలంటున్నా

స్వర్గం నువ్వుంటే నరకం లేకుంటే
టేక్ మీ అవే టేక్ మీ అవే టేక్ మీ అవే

కలగన్నా కలగన్నా కలగన్నాననుకున్నా
కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా




ఆ వైపున్న ఈ వైపున్న పాట సాహిత్యం

 
చిత్రం: మస్కా (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: హరిహరన్, సాధన సర్గం

నిన్నే నిన్నేనా నిన్నే నిన్నే చూసా

ఆ వైపున్న ఈ వైపున్న ఏ వైపున్నా
నీ వైపే నను లాగేస్తున్నావే
ఏం చేస్తున్న ఏం చూస్తున్న ఏ చోటున్నా
నీ ఊహల్లో ముంచేస్తున్నావే

నీ వయస్సుకు వల వేస్తాలే నా వయసుని జత చేస్తాలే
సుతి మెత్తగా మీటి శృతి చేసేస్తాలే
నీ తీరుని గమనించాలి ఎద తీగని సవరిస్తాలే
తొలి ప్రణయపు రాగం పలికించేస్తాలే

నిన్నే నిన్నే చూపులతో కొరికేస్తాలే
నిన్నే నిన్నే నవ్వులతో నమిలేస్తాలే

ఆ వైపున్న ఈ వైపున్న ఏ వైపున్నా
నీ వైపే నను లాగేస్తున్నావే

నిను కట్టు స్వప్నంలో నను మరిచే నేనుంటే
నిజమై నువ్వొచ్చేసి ఎదో చేసావే
ఊరించే అందాలే ఆరేసి చూపిస్తే
కాజేసి పోకుండా కాపే కాసాన

వలపై ఎగసి వస్తున్న నిన్నే నే వలచి
ఎదనే పరిచి వస్తున్న నేనై మైమరచి

అందాల మదిలో అరుదైన కలవో
ప్రియమైన నిదివో ప్రవరారాఖ్యుడివో

ఏం చేస్తున్న ఏం చూస్తున్న ఏ చోటున్నా
నీ ఊహల్లో ముంచేస్తున్నావే

పొగమంచే నేనైతే కిరణంలా సోకావే
నిలువెల్లా స్పర్శించి కరిగించావే
ఆదరాలే ఇమ్మంటే సరదాగా ఇచ్చేస్తే
ముని పంటి ఘాటుల్ల్నే ముద్రించేసావే

నిదరే చెరిచి వాయిస్తాలే నిను పంపేసి
జతనే కలిసి సుఖ పెడతా ఓల్లే శుతి చేసి
ఉప్పొంగి దూకే శృంగార సుధ ఓ
నా పైకే దూకే నయగారము ఓ

ఏం చేస్తున్న ఏం చూస్తున్న ఏ చోటున్న
నీ ఊహల్లో ముంచేస్తున్నవే
ఆ వైపున్న ఈ వైపున్న ఏ వైపున్న
నీ వైపే నను లాగేస్తున్నవే



బగ్దాద్ గజదొంగై వస్తా పాట సాహిత్యం

 
చిత్రం: మస్కా (2009)
సంగీతం: చక్రి
సాహిత్యం: కండికొండ
గానం: రవివర్మ, సునిధి చౌహాన్

మస్కా మేరీ జాన్ తుమ్హారా
మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా

బగ్దాద్ గజదొంగై వస్తా - వస్తా వస్తా
కన్నె సోకులే రాబరి చేస్తా - చేస్తా చేస్తా
కంటి చూపుతో ఎక్స్-రే తీస్తా - తీస్తా తీస్తా
దాచుకున్నది నే దోచేస్తా - దోస్తా దోస్తా

దాచుకుంది ఇంకేముంది
అప్ టూ బాటమ్ నీ ముందుంది
అంధచందం కొంచెం కొంచెం కొసిరి కొరికేయారా

మస్కా మేరీ జాన్ తుమ్హారా 
మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా

మస్కా మేరీ జాన్ తుమ్హారి
మస్కా తేరి జాన్ హమారె
మస్కా దిల్ దే నజారా మస్కా

కైపు కైపు నీ కన్నుల్లో నైఫ్ గుచ్చు నవనాడుల్లో
ఝల్లుమంది న గుండెల్లో ఎలా
తప్పు తప్పు బిగి కౌగిట్లో చేసుకోరా చలి చీకట్లో
దాచుకుంట నిను నా వంట్లో ఇలా

మంచు లాంటి మదిలోన మంట రేగే మెహబూబా
దేహమంతా రగిలే తడిపే నువ్వై జడివాన

చందమామే నీ ముందుంది సందెకొస్తే నీదవుతుంది
రాజీకొచ్చి రక్కి రక్కి జగడమే చెయ్యరా

ఆజా మేరీ జాన్ తుమ్హారా 
లేజా మేరీ జాన్ తుమ్హారా
దే దే దిల్ దే నజారా ఆజా ఏ ఏ ఏ

మస్కా మేరీ జాన్ తుమ్హారి
మస్కా తేరి జాన్ హమారె
మస్కా దిల్ దే నజారా మస్కా

మత్తుమందు నీ మాటల్లో 
రాజహంస ని నడకల్లో
మైకమొచ్చి పడిపోతోందే ఎద
చిక్కుకున్న నీ చూపుల్లో 
నిగురుకప్పిన నిప్పుల్లో
రేపో మాపో ఇక వేవిల్లే పదా

వెండిమబ్బు నువ్వేగా వేడి పవనం నేనేగా
దూసుకొచ్చి డీ కొట్టేస్తా ఇదిగో వస్తున్నా

చెంత కొస్తే వొద్దన్నానా చేయివేస్తే కాదన్నానా
ముందుకొచ్చి ముద్దె ఇస్తే పెదవి కలిపేయన

ఆజా మేరీ జాన్ తుమ్హారా 
లేజా మేరీ జాన్ తుమ్హారా
దే దే దిల్ దే నజారా ఆజా ఏ ఏ ఏ

మస్కా మేరీ జాన్ తుమ్హారి
మస్కా తేరి జాన్ హమారె
మస్కా దిల్ దే నజారా మస్కా

బగ్దాద్ గజదొంగై వస్తా - వస్తా వస్తా
కన్నె సోకులే రాబరి చేస్తా - చేస్తా చేస్తా

దాచుకుంది ఇంకేముంది
అప్ టూ బాటమ్ నీ ముందుంది
అంధచందం కొంచెం కొంచెం కొసిరి కొరికేయారా

మస్కా మేరీ జాన్ తుమ్హారా 
మస్కా తేరి జాన్ హమారా
మస్కా దిల్ దే నజారా మస్కా

మస్కా మేరీ జాన్ తుమ్హారి
మస్కా తేరి జాన్ హమారె
మస్కా దిల్ దే నజారా మస్కా

Most Recent

Default