చిత్రం: నిరీక్షణ (1986) సంగీతం: ఇళయరాజా నటీనటులు: భానుచందర్, అర్చన దర్శకత్వం: బాలు మహేంద్ర నిర్మాత: లింగ రాజు విడుదల తేది: 14.03.1986
Songs List:
తియ్యన్ని దానిమ్మ పాట సాహిత్యం
చిత్రం: నిరీక్షణ (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, ఎస్.పి.శైలజ తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట చేస్తున్న కమ్మని కాపురమూ చూస్తున్న కన్నుల సంబరమూ ప్రేమకు మందిరమూ తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట చేస్తున్న కమ్మని కాపురమూ చూస్తున్న కన్నుల సంబరమూ ప్రేమకు మందిరమూ తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట ఒకదేహం ఒకప్రాణం తమ స్నేహంగా సమభావం సమభాగం తమ పొందుగా చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగా చెలికాని సరసాలే జంపాలగా అనురాగం ఆనందం అందాలుగా అందాల స్వప్నాలే స్వర్గాలుగా ఎడబాసి మనలేనీ హృదయాలుగా ముడిపడ్డ ఆ జంట తొలిసారిగా గూడల్లుకోగా పుల్లల్లుతేగా చెలికాడు ఎటకో పోగా.. అయ్యో... పాపం.. వేచెను చిలకమ్మ తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట ఒక వేటగాడెందో వలపన్నగా తిరుగాడు రాచిలుక గమనించక వలలోన పడి తాను అల్లాడగా చిలకమ్మ చెలికాని సడికానక కన్నీరు మున్నీరై విలపించగా ఇన్నాళ్ళ కలలన్నీ కరిగించగా ఎలుగెత్తి ప్రియురాలు రోదించగా వినలేని ప్రియుడేమో తపియించగా అడివంతా నాడు ఆజంట గోడు వినలేక మూగైపోగా... అయ్యో... పాపం... వేచెను చిలకమ్మ తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంట చేస్తున్న కమ్మని కాపురమూ చూస్తున్న కన్నుల సంబరమూ ప్రేమకు మందిరమూ తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పొన్నారి చిలకల్ల జంటా
యమునా తీరే పాట సాహిత్యం
చిత్రం: నిరీక్షణ (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్.జానకి పల్లవి: హొయిరే రీరే హొయ్యారె హొయీ.. యమునా తీరే హొయ్యారె హొయీ... యమునా ఎందుకె నువ్వూ ఇంత నలుపెక్కినావు రేయి కిట్టతోటి కూడావా యమునా ఎందుకె నువ్వూ ఇంత నలుపెక్కినావు రేయి కిట్టతోటి కూడావా నల్లా నల్లని వాడు నిన్ను కవ్వించెనా వలపు సయ్యాటలోనా నలుపే నీకంటెనా హొయిరే రీరే హొయ్యారె హొయీ... యమునా తీరే హొయ్యారె హొయీ చరణం: 1 వెన్నంటి వెంటాడి వస్తాడే ముద్దూ కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ వెన్నంటి వెంటాడి వస్తాడే ముద్దూ కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడె చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడె దారివ్వకే చుట్టూ తారాడుతాడే పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే అల్లారల్లరివాడు అబ్బా ఏం పిల్లడే హొయిరే రీరే హొయ్యారె హొయీ... యమునా తీరే హొయ్యారె హొయీ చరణం: 2 శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే శృంగారరంగాన కడతేరినాడే... శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే శృంగారరంగాన కడతేరినాడే రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె రేపల్లెలోకెల్లా రూపైన మొనగాడె ఈ రాధకీడైన జతగాడు వాడే మురళీలోలుడు వాడే ముద్దూ గోపాలుడే వలపే దోచేసినాడే చిలిపీ శ్రీకృష్ణుడూ హొయిరే రీరే హొయ్యారె హొయీ.. యమునా తీరే హొయ్యారె హొయీ యమునా ఎందుకె నువ్వూ ఇంత నలుపెక్కినావు రేయి కిట్టతోటి కూడావా నల్లా నల్లని వాడు నిన్ను కవ్వించెనా వలపు సయ్యాటలోనా నలుపే నీకంటెనా హొయిరే రీరే హొయ్యారె హొయీ యమునా తీరే హొయ్యారె హొయీ
చుక్కల్లే తోచావే పాట సాహిత్యం
చిత్రం: నిరీక్షణ (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: కె. జె. యేసుదాసు పల్లవి: చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే చరణం: 1 పూసిందే ఆ పూల మాను నీ దీపంలో కాగిందే నా పేద గుండె నీ తాపం లో ఊగానే నీ పాటలో ఊయ్యాలై ఉన్నానే ఈనాటికి నేస్తాన్నై ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాలకు చేరం తీరందీ నేరం చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే చరణం: 2 తానాలే చేసాను నేను నీ స్నేహం లో ప్రాణాలే దాచావు నీవు నా మోహం లో ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే ఉందా కన్నీళ్ళకు అర్దం ఇన్నేళ్ళుగ వ్యర్ధం చట్టందే రాజ్యమ్ చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే చుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే
ఆకాశం ఏనాటిదో పాట సాహిత్యం
చిత్రం: నిరీక్షణ (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఎస్.జానకి పల్లవి: ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదీ చరణం: 1 ఏ పువ్వూ ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నదీ ఏ ముద్దూ ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నదీ బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం విరబూయు పెదవులు మధువులనే చవిచూడమనగా పరువాలే..ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలవెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది చరణం: 2 ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో ఏ రాగం ఏ గుండెలోతున ఏ గీతం పలికించునో హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగ కౌగిలిలో చెరవేచు మదనుని కరిగించీ గెలిపించమనగ మోహాలే దాహాలై సరసాలే సరదాలై కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడే తెలిసిందది