చిత్రం: ఇష్టం (2001) సంగీతం: డి.జె.గోపీనాథ్ నటీనటులు: చరణ్ రెడ్డి దొడ్ల, శ్రేయ శరన్ (తొలిపరిచయం) దర్శకత్వం: విక్రమ్ కుమార్ - రాజ్ కుమార్ నిర్మాత: రామోజీరావు విడుదల తేది: 30.12.2001 (ఈ సినిమా డైరెక్టర్లలో ఒకరైన విక్రమ్ కుమార్ గారికి ఇది మొదటి సినిమా, తరువాత నితిన్ తో ఇష్క్ , నాగార్జున గారితో మనం అలాగే సూర్య గారితో 24 అనే సినిమాలు తీశారు) (అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ (హీరో సుమంత్ అక్క, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్) భర్తే ఈ చరణ్ రెడ్డి దొడ్ల ఈయన ఈ ఒకేఒక్క సినిమాలో నటించారు తరువాత తన 36 వ ఏట మరణించారు)
Songs List:
నువ్వంటే ఇష్టమని పాట సాహిత్యం
చిత్రం: ఇష్టం (2001) సంగీతం: డి.జె.గోపీనాథ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర, హరిహరన్ నువ్వంటే ఇష్టమని
ఈ అందాల కాలేజీలో పాట సాహిత్యం
చిత్రం: ఇష్టం (2001) సంగీతం: డి.జె.గోపీనాథ్ సాహిత్యం: పోతుల రవికిరణ్ గానం: టిప్పు ఈ అందాల కాలేజీలో
ఎవరైనా చూసారా... పాట సాహిత్యం
చిత్రం: ఇష్టం (2001) సంగీతం: డి.జె.గోపీనాథ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర, హరిహరన్ ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా... ఎవరైనా చూసారా గారంగా కొసరే వేళ ... కారంగా కసిరే వేలా గుండెల్లో జరిగే గోలా... మౌనంగా ఉంటే మేలా... ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా... ఎవరైనా చూసారా అప్పుడప్పుడీ ఉపవాసం ...తమ అలవాటా ... కోరుకుంటె నా సహవాసం... ఏం పొరపాటా ... ఒహో ఏమా రోషం ... వామ్మో సమరావేసం కొరికేసే ఉక్రోషం... కరిగించే సరసం కోసం ... అడిగేస్తే ఏమిటి దోషం ఇష్టమంత ఉగ్గబట్టి ఎందుకంత మొగమాటం ఎవరైనా చూసారా పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా ఎవరైనా చూసారా లేనిపోని సైగలు చేసి నను లాగాలా.. చేరగానే వెనకడుగేసి వెటకారాలా లోలో సరదా లేదా... పై పై పరదాలేలా తగువేలా నాతో తగువేలా బిగువేలా ఇంకా బిడియాలా గుట్టే దాచాలన్నా దాగేనా ఎవరైనా చూసారా... పరువే చెడదా పురుషోత్తమా... అరెరె అనరా ప్రియ నేస్తమా... ఎవరైనా చూసారా ఎర వేసే అల్లరి ఈల... పొరపాటే అయిపోవాలా దరి దాటే వరదయ్యేలా... పరుగెడితే పడవా బాల ఎవరైనా చూసారా పరువే చెడదా పరిహాసమా... చెబితే వినవా చెలగాటమా ఎవరైనా చూసారా
Why Don't You Enjoy పాట సాహిత్యం
చిత్రం: ఇష్టం (2001) సంగీతం: డి.జె.గోపీనాథ్ సాహిత్యం: కులశేఖర్ గానం: టి.ఆర్.కార్తీక్ Why Don't You Enjoy
కాన్వెంటులో కాలేజిలో పాట సాహిత్యం
చిత్రం: ఇష్టం (2001) సంగీతం: డి.జె.గోపీనాథ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు కాన్వెంటులో కాలేజిలో
యాఊరు యాఊరే పాట సాహిత్యం
చిత్రం: ఇష్టం (2001) సంగీతం: డి.జె.గోపీనాథ్ సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: వరికుప్పల యాదగిరి యాఊరు యాఊరే చిన్నదానా ఉన్నాయె సోకులు చానా నా వద్దకొస్తావా ఓ సారైనా ఓ చిన్న ముద్దీవే మైనా నీ అందం మస్తుగుందే సుల్తానా... అయిపోయా నేనే నీకు దీవానా... ఓ జాని... ఓ జాని... ఓ జాని... నీ ఎంటె రమ్మందే నీ వోణి చరణం: 1 నీ స్మైలే చూస్తున్నప్పుడు పెరిగిందే గుండె చప్పుడూ నీ వాయిసే వింటున్నప్పుడు మత్తెక్కిపోయిందమ్మడూ నిజ్జంగా నువ్వంటేనే ఇష్టం నువ్వోకే చెప్పకుంటె కష్టం నిజ్జంగా నువ్వంటేనే ఇష్టం నువ్వోకే చెప్పకుంటె కష్టం ఏం చెయ్మంటావె పిల్లా మనసే ఫిక్సయ్యిందట్లా చరణం: 2 మోడల్‌గా నువ్వొచ్చావంటే యాడ్ లోకం మొత్తం నీచుట్టే ఎంటివి యాంకర్ నువ్వైతే నీ ప్రోగ్రామ్సన్నీ బిగ్ హిట్టే సినిమాల్లో కొచ్చావంటె చాలే గ్లామర్లో ముంచేస్తారే రీళ్ళే సినిమాల్లో కొచ్చావంటె చాలే గ్లామర్లో ముంచేస్తారే రీళ్ళే ప్రతి స్టార్లు దైరెక్టర్లు నువ్వే కావాలంటారె చరణం: 3 వెజిటబుల్ మార్కెట్ దగ్గర లవ్ లెటర్ ఇద్దామనుకున్నా శంకర్‌మట్ టెంపుల్ దగ్గర నా మాటర్ చెబ్దామనుకున్నా నిజ్జంగా ఆ రోజే నా బాడ్‌లక్ పోలీసోళ్ళొచ్చేసారే వేళక్ నిజ్జంగా ఆ రోజే నా బాడ్‌లక్ పోలీసోళ్ళొచ్చేసారే వేళక్ ఫ్రెండ్సంతా చెబ్తుంటారె ఎప్పుడు చూసిన గుడ్‌లక్ గుడ్‌లక్
చిరు చిరు నగవుల పాట సాహిత్యం
చిత్రం: ఇష్టం (2001) సంగీతం: డి.జె.గోపీనాథ్ సాహిత్యం: భువనచంద్ర గానం: చిత్ర చిరు చిరు నగవుల