చిత్రం: 47 రోజులు (1981)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణీ జయరాం
నటీనటులు: చిరంజీవి , జయప్రద, శరత్ బాబు, సరిత
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాతలు: ఆర్.వెంకట్రామన్, కె.బాలచందర్
విడుదల తేది: 03.09.1981
ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలను
ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలను
ఏ వేటగాడో నమ్మా కూల్చిపోయాడమ్మా స్వప్న స్వర్గాలను
ఏ వేటగాడో నమ్మా కూల్చిపోయాడమ్మా స్వప్న స్వర్గాలను
ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలను
వెచ్చగ వచ్చాడు మచ్చిక చేశాడు
ముచ్చటలాడాడు ఉచ్చులు పన్నాడు
వెచ్చగ వచ్చాడు మచ్చిక చేశాడు
ముచ్చటలాడాడు ఉచ్చులు పన్నాడు
మెడలోన ముడివేసి ఎదలోన పిడిబాకు దుశాడు
ఊరికి ఒక చందం రోజుకి ఒక అందం
ఎవరికి తను సొంతం ఎవరిది అనుబంధం
రహదారి విడిచాడు కడదారి నడిచాడు నీ వాడు
ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలను
రాణివి అన్నాడు దాసిని చేశాడు
రాముడి నన్నాడు రావణుడయ్యాడు
రాణివి అన్నాడు దాసిని చేశాడు
రాముడి నన్నాడు రావణుడయ్యాడు
ఈ లంకలో నీకు ఏ తోడు లేదమ్మ ఈనాడు
మాటలు నమ్మావు మనసుని ఇచ్చావు
అడుగులు కలిపావు మనుగడ గడిపావు
కన్నీరు వర్షించ మున్నీరునే దాటి వచ్చావు
ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలను
ఏ వేటగాడో నమ్మా కూల్చిపోయాడమ్మా స్వప్న స్వర్గాలను
తెలియని రోజుల్లో తీయని వేళల్లో
గడిచిన ఏ క్షణమో కడుపున మొలిచింది
తెలియని రోజుల్లో తీయని వేళల్లో
గడిచిన ఏ క్షణమో కడుపున మొలిచింది
వరమైన పసిపాప బరువైన పాపంగ తోచింది
మధువుని తాగింది బ్రమరం వెళ్ళింది
కాయను కాదన్న మోయక తప్పేదా
నీ ఊరు కాదమ్మ నీవారు లేరమ్మా ఏకాకివి
ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలను
ఏ వేటగాడో నమ్మా కూల్చిపోయాడమ్మా స్వప్న స్వర్గాలను
దిక్కులు నాల్గున్నా దిక్కే కనరాదు
ఎక్కడ ఉండాలో ఎక్కడ చేరాలో
దిక్కులు నాల్గున్నా దిక్కే కనరాదు
ఎక్కడ ఉండాలో ఎక్కడ చేరాలో
ఇటు మంచు మూసింది అటు మబ్బు కమ్మింది నీ దారి
ఎక్కడ నీ దేశం అక్కడె నీ పాశం
పక్షివి కావమ్మా రెక్కలు లేవమ్మా
ఏ వేల్పులే వచ్చి కాపడవలెనమ్మా నిన్నింక
ఓ పైడి లేడమ్మా నీవు కన్నవమ్మా ఎన్నో స్వప్నాలను
ఏ వేటగాడో నమ్మా కూల్చిపోయాడమ్మా స్వప్న స్వర్గాలను