చిత్రం: ఆదర్శవంతుడు (1984)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు , రాధ
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: చి. హెచ్. ప్రకాష్ రావు
విడుదల తేది: 30.07.1984
పల్లవి:
పంటచేలలో... పైరగాలిలో...
పడుచుదనం గడుచుదనం కలిసిన వేళలో...
ఓయ్ ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది
ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది
ఈడొచ్చి మీద పడ్డది
నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి
సంబరాలు చేయమన్నది
అహ బుగ్గమీద సంతకాలు పెట్టమన్నది ఆ
ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది
హా ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది
ఈడొచ్చి మీద పడ్డది
నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి
సంబరాలు చేయమన్నది
అహ బుగ్గమీద సంతకాలు పెట్టమన్నది
చరణం: 1
హోయ్ వరిచేను ఎదిగింది పరువానికొచ్చింది
సిరిపంట రానున్నది
ఒరబ్బీ చెమటంత పంటైనది
చిలకమ్మ పలికింది చేయి చేయి కలిపింది
చిగురాకు వగరన్నది
ఒలమ్మి వగరంత పొగరన్నది
అరె మూగమనసు తీరు పొగరల్లె ఉంటది
పొగరులోనె నీకు సొగసంత ఉన్నది
అ దొంగచాటు చూపులింక వద్దన్నది
వంగతోటకాడ బావ వరసన్నది
వరసకన్న మనసున్నది
మనసులోనె మమతున్నాది
నాకెంతొ మనసుందో నీకెంతో మమతుందో
సిగ్గుపడి చెప్పకున్నది
దాని జిమ్మ దియా చెప్పుకోక తప్పదన్నది
ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది
ఈడొచ్చి మీద పడ్డది
నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి
సంబరాలు చేయమన్నది
అ బుగ్గమీద సంతకాలు పెట్టమన్నది...
చరణం: 2
మరుమల్లే తోటుంది పొదరిల్లు చాటుంది
ఇద్దర్ని రమ్మన్నాది
ఒరబ్బీ పొద్దెమో పస్తున్నది
వయసేమో ఊపింది మనసేమో ఆపింది
ఉయ్యాల లాగైనది
ఒలమ్మి నేనోపలేనన్నది
హొయ్ చిన్నవాడి చూపు చురకల్లె ఉన్నది
చీరకట్టు పిల్ల చిలకల్లె ఉన్నది
పోకిరోడు పుస్తి తాడు తెమ్మన్నాది
సందెవేళ పందిరేసి రమ్మన్నాది
మూడు ముళ్ల మొక్కన్నాది
మూడు నాళ్ళ ముడుపన్నాది
నా మొక్కు తీరాక నీ ముడుపు చెల్లాక
నిద్దరింక ఉండదన్నది
అహ అందాక ముద్దులన్ని దిండుకన్నది అహ హ
ఏమిటో అవుతోంది
అరె ఎట్టాగో ఉంటోంది
ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది
ఈడొచ్చి మీద పడ్డది
అహ నా ఈడు నిలవేసి నీ ఈడు కలబోసి
సంబరాలు చేయమన్నది
అహ బుగ్గమీద సంతకాలు పెట్టమన్నది...
అరెరరెరరె సంబరాలు చేయమన్నది
అహ బుగ్గమీద సంతకాలు పెట్టమన్నది...