Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Addala Meda (1981)



చిత్రం:  అద్దాల మేడ (1981)
సంగీతం:  రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  దాసరి నారాయణరావు మరియు రాజశ్రీ
గానం:  యస్.పి.బాలు, జానకి
నటీనటులు: దాసరి నారాయణరావు,  మురళీమోహన్, మోహన్ బాబు , అంబిక, గీత, జయసుధ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: అంజనీ కుమార్
విడుదల తేది: 1981

పల్లవి:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తక ధీం త ఝణూ దటికి తధికి తధికి దటికి తధికి.. ధా
ఆ అ ఆ ఆ ఆ ఆ  నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది
అది ఊహల లోకములో కవితలు రాస్తుంది
ఆ కవిత కావ్యమై .. కావ్యానికి నాయికవై
వరించి .. తరించి .. ఊరించక రావే...కావ్యనాయిక నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది

చరణం: 1
నేను కవిని కాను.. కవిత రాయలేను
శిల్పిని కాను.. నిను తీర్చిదిద్దలేను
చిత్రకారుని కానే కాను.. గాయకుణ్ణి అసలే కాను
ఏమీకాని నేను.. నిను కొలిచే పూజారిని
నీ గుండెల గుడిలో.. ప్రమిదను పెట్టే పూజారిని.. నీ ప్రేమ పూజారిని నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది

చరణం: 2
ఆ ఆ ఆ ఆ ఆ
సగససమమమమ గమగసపనిగస మపమమపని పనిస పనిస పనిసా
ఆ ఆ ఆనేను రాముణ్ణి కాను .. విల్లు విరచలేను
కృష్ణుణ్ణి కాను .. నిను ఎత్తుకు పోలేను
చందురుణ్ణి కానే కాను .. ఇందురుణ్ణి అసలే కాను
ఎవరూ కాని నేను నిను కొలిచే నిరుపేదను
అనురాగపు దివ్వెలు .. చమురును నింపే ఒక పేదను.. నే నిరుపేదను

నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టిందిఅది ఊహల లోకములో కవితలు రాస్తుందిఆ కవిత కావ్యమై .. కావ్యానికి నాయికవైవరించి .. తరించి .. ఊరించక రావే...కావ్యనాయిక నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది

Most Recent

Default