Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Allari Pidugu (2005)




చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: బాలక్రిష్ణ , కత్రినాకైఫ్, ఛార్మి
దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ
నిర్మాత: యమ్.ఆర్.వి.ప్రసాద్
విడుదల తేది: 05.10.2005



Songs List:



డిక్కీ డిక్కీ డీడిక్కీ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తిక్ , చిత్ర

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి
డిక్కీ డిక్కీ డీడిక్కీ పరువాల పండక్కి
వచ్చానయ్యో చెక్కిలి ఎరుపెక్కి
వయ్యారాలే చప్పున బరువెక్కి
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
కొల్లగొట్టేసి పోనా తెల్లారేకల్లా
రారాదు బువ్వేలేరా శృంగార కోటకి

అష్టాచెమ్మాలే  చెమ్మచెక్కాలే
జరగాలి జామురేయి జాగారాలే
గుడు గుడు గుంచాలే చడుగుడు మంచాలే
ఈదాలి సంబరాల సాగరాలే

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి

చెరువుల్లో చేపలకై వెతికేస్తుంది కొంగ
చీకట్లో చీరంతా తడిమేస్తావ దొంగ (2)
సరసాల సమరంలో సరదాల సమయంలో 
తెరచాటు ఉంటే వేగేదెలా
అడిగింది ఏమైనా వీల్లేదు అన్నానా
బాహాటమైతే బాగోదుగా
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
అల్లాడించేసి పోనా తెల్లారేకల్లా
అయితే మరి వెళ్ళొద్దామ అనువైన చోటుకి

అల్లోనేరేల్లో అమ్మో నీకళ్లు
అచ్చంగా ఉన్నావమ్మో బొమ్మలాగ
పుల్ల మావిల్లో అపుడే వేవిల్లో
విడ్డురం చూడాలమ్మో అమ్మలాలో

తెలియంది తెలియాలంటే చదవాలయ్యో బుక్స్
చూసింది కావాలంటే కలపాలయ్యో లిప్స్ (2)
నీమాటలు ముదిరాయే అధరాలే అదిరాయే
అరుదైన దాహం తీరేదెలా
తాపాలే పెరిగాక తమకంతో రగిలాక
పడకింటి తీరం చేరాలిగా
పిల్లా నువ్వొచ్చేసాక ఆగేది ఎల్లా
గిల్లి గిచ్చేసి పోనా తెల్లారేకల్లా
దుప్పట్లో దూరేద్దామ బాబు సయ్యాటకి

బంగరు బుల్లోడే బంపరుగున్నాడే
మాటల్తో మాయచేసి లాగుతాడే
తుంటరి పిల్లోడే తొందరగున్నాడే
ఎన్నెన్నో తందనాలు ఆడుతాడే

డిక్కీ డిక్కీ డీడిక్కీ ఉన్నానే వేడెక్కి
రావాలమ్మో కౌగిలి పండక్కి 
పోవాలమ్మో సిగ్గులు కొండెక్కి





మల్లెల్లోన ఇల్లెయ్రా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: కార్తీక్, సుజాత 

మల్లెల్లోన ఇల్లెయ్రా  ఇల్లెక్కేసి ఈలేయ్ రా



చినుకులాగా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ 
గానం: రంజిత్, సుచిత్ర 

చినుకులాగా 




మా సుబ్బలచ్చమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సునీత 

మా సుబ్బలచ్చమ్మ 



ఒంగోలు గిత్తరో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, మహలక్ష్మి అయ్యర్ 

ఒంగోలు గిత్తరో 




నేడే ఈ నాడే పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి పిడుగు (2005)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాహితి
గానం: మల్లికార్జున్ , శ్రీవర్ధిని

(ఈ పాటను యన్.టి.రామారావు నటించిన భలే తమ్ముడు (1969) సినిమాలో నుండి  రీమిక్స్ చేశారు)

నేడే ఈ నాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..

వాలుకన్నుల వన్నెలాడివి వగలే చాలు నిరజాణ
దోర ఆశల దొంగ చూపుల చొరవే నీవు అనుకోన
వారేవా వయ్యారమా పలుకేమో బంగారమా
ప్రేమంటే శృంగరమా రమ్మంటే చిరు కోపమా
మహా పెంకి మగువలు మీరు 
మనసైతె మీ మగవారు ఇక ఆగలేరని తెలుసు

నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
ఆ...ఆ...ఆ...ఆ...  ఆ..ఆ..ఆ..

ఆరుబైటిలా కన్ను గీటడం ఔరా మీకు మర్యాదా
కంటి సైగకే పైట జారడం ఐనా తమకు బాగుందా
పైపైకి పరిహాసమా బెట్టంత చెలి కోసమా
పెదవుల్లో దరహసమా అదికూడ ఓ వేషమా
మహారాజు భోగులు మీరు మరి నాకు లొంగకపోరు
పరువాల మేనకగారు నను ఇంక విడిపోలేరు

నేడే ఈ నాడే కలిపింది కన్ను చెలి తానే
నేడే ఈ నాడే కరుణించె నన్ను చెలికాడే
అహ హా... ఆ ఆ ఆ 
అహ హా... ఆ ఆ ఆ 


Most Recent

Default