చిత్రం: అల్లుడుగారు (1990) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: మోహన్ బాబు, రమ్యకృష్ణ, శోభన దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: మోహన్ బాబు విడుదల తేది: 14.07.1990
Songs List:
అమ్మో అమ్మో.. పాట సాహిత్యం
చిత్రం: అల్లుడుగారు (1990) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: రసరాజు గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: లలాలలా.. లలలలాలలా... లలాలలా.. లలలలాలలా... అమ్మో... అరె... అమ్మో అమ్మో.. ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమ పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ పుణ్యమెంత చేశానో పున్నమిరేడా పుట్టావా నాకోసం ముద్దుల మగడా చరణం: 1 అమ్మో చెయ్యేసి చూడు ఒళ్లంత సెగలు సెగలు అబ్బో వాటేసి చూడు కళ్లల్లో పొగలు పొగలు అమ్మో చెవిపెట్టి చూడు గుండెల్లో గుబులు గుబులు అబ్బో ముద్దాడి చూడు బుగ్గల్లో వగలు వగలు ఇద్దరమూ ఒకటైతే ఇంకేముంది ముద్దు ముద్దు ఒకటైతే హద్దేముంది కలిసిపోయి కరిగిపోయి కౌగిలిలో తడిసిపోయి ఉందామా కలకాలం ఒకే తనువుగా అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ చరణం: 2 అయ్యో ఈ పాడు మనసు రేగిందా చిత్తు చిత్తు అబ్బీ ఈ పాలపొంగు ఊగిందా మత్తు మత్తు అయ్యో ఈ కోడె వయసు అలిగిందా పోరు పోరు అమ్మీ ఈ వలపు దెబ్బ అదిరిందా హోరు హోరు కైపంతా కళ్లల్లో కాపురముంటే పగలేమిటి రేయేమిటి రెండూ ఒకటే ఒకరికొకరు ఓడిపోయి ఒడి లోపల ఒదిగిపోయి ఉందామా కలకాలం ఒకే మనువుగా అరె... అమ్మో అమ్మో.. ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమ పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ పుణ్యమెంత చేశానో పున్నమిరేడా పుట్టావా నాకోసం ముద్దుల మగడా
కొండ మీద సుక్క పోటు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడుగారు (1990) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: జాలాది గానం: యస్.పి.బాలు, చిత్ర కొండ మీద సుక్క పోటు గుండెలోన ఎండ పోటు చెప్పుకుంటే సిగ్గు చేటు ఆడ్ని తలసుకుంటే సులుకు పోటు గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో కొండ మీద సుక్క పోటు గుండెలోన ఎండ పోటు పిల్లకేమో సులుకు పోటు దాని ఒళ్ళు జూస్తే తుళ్ళిపాటు గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా ఆరుబయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేన ఓ... ఓహో ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేన అహహహా ఆరుబయటకెళ్దామంటే ఆవిరి ఎన్నెల కాసేన ఆకతాయి కోరికలేవో ఆకలి కేకలు వేసేన నిదరెట్టా పట్టేది రొదనెట్టా అపేది మనస్సెట్టా ఆగేది, నా మరులెట్టా తీరేది ఓల్లామ్మో ముద్దుల గుమ్మ వయ్యారి ఎన్నల కొమ్మ హొయ్ నడి రాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లు నడి రాత్రి దుప్పట్లో నడి గుండెల చప్పట్లు నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేయ్నా నవ్వుల యవ్వన మువ్వల మోతే ఆడించేయ్నా ఇద్దరి నడుమ నిద్దరలేని ముద్దుల మద్దెల పాడించేయ్నా కొండ మీద సుక్క పోటు గుండెలోన ఎండ పోటు పిల్లకేమో సులుకు పోటు దాని ఒళ్ళు జూస్తే తుళ్ళిపాటు గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా వగలాడే మోగుడొస్తుంటే వెన్నల ఉయ్యాల వెయ్యాల పగలూ రేయనకుండ పందిరి మంచం నవ్వాల వగలాడే మోగుడొస్తుంటే వెన్నల ఉయ్యాల వెయ్యాల పగలూ రేయనకుండ పందిరి మంచం నవ్వాల నెలవంకను తెచ్చేయ్నా, నడువంపున చూట్టెయ్నా ఒడిలోనే పడవల్లే సుడులేసుకు తిరిగేన ఓరయ్యో అందగాడా సిందులాడే సందురుడా సుడులాడే సందిట్లో కవ్వించే కౌగిట్లో సుడులాడే సందిట్లో కవ్వించే కౌగిట్లో వన్నెల చిన్నెల వంపులు సొంపుల ఆడించేయ్నా వన్నెల చిన్నెల వంపులు సొంపుల ఆడించేయ్నా నా సిగ్గుల మొగ్గల బుగ్గల మీద ఎర్రని పూలే పూయించేయ్నా కొండ మీద సుక్క పోటు గుండెలోన ఎండ పోటు చెప్పుకుంటే సిగ్గు చేటు ఆడ్ని తలసుకుంటే సులుకు పోటు గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమంటుందా సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమంటుందా గుండె ఘతుక్ ఘతుక్ ఘతుక్కుమందిరో సిగ్గు సిటుక్ సిటుక్ సితుక్కుమందిరో
కొండలలో నెలకొన్న పాట సాహిత్యం
చిత్రం: అల్లుడుగారు (1990) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: అన్నమాచార్య కీర్తన గానం: కె. జె. యేసుదాసు, చిత్ర కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుమ్మర దాసుడైన కురువరత్తినంబి యిమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసినయట్టి తొండమాం చక్కురవర్తి దొమ్ములు చేసినయట్టి తొండమాం చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న గమదని సగమాగగనిదమగస కొండలలో సగసమ గదమని గమగదమని దసనిద మగదమగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు ఎదలోని శ్రీ సతి ఎపుడో ఎఎడబాటు కాగా ఎనలేని వేదనలో రగిలిన వాడు మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతి మమతల కోవెలలో మసలని వాడు నీతికి నిలిచిన వాడు దోషిగ మారెను నేడు ప్రేమకే ప్రాణం వాడు శిక్షకు పాత్రుడు కాడు ఆర్తరక్షక శ్రీ వేంకటేశ్వర కరుణతా తోడు నీడై వాన్ని కాపాడు నేడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడుగారు (1990) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కె. జె. యేసుదాసు, చిత్ర ముద్దబంతి నవ్వులో మూగబాసలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగబాసలు లాల్లలల లాల లల… లాల లాలలా లాల్లలల లాల లల… లాల లాలలా బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆఆ ఆఆ ఆఅ… అ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ బంధమంటు ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవతా ఇంత చోటులోనే అంత మనసు ఉంచి ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు అందమైన తొలిరేయి స్వాగతానికి మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ ఆఆ ఆఆ ఆఅ… అ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును గుడిలోకి రమ్మంది ఈ దైవము మాట నోచుకోని ఒక పేదరాలిని మాట నోచుకోని ఒక పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్నివేళలా ముద్దబంతి నవ్వులో మూగబాసలు మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు ముద్దబంతి నవ్వులో మూగబాసలు
నగుమోము గనలేని పాట సాహిత్యం
చిత్రం: అల్లుడుగారు (1990) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: త్యాగరాజ కీర్తన గానం: కె. జె. యేసుదాసు, పూర్ణ చందర్ స గ మ ప ని స ని ద ప మ గ రి ని స నగుమోము గనలేని నా జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి శభాష్ నగరాజ నగరాజధర నీదు పరివారులెల్ల నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన జేసెడు వారలు గారే యిటులుండుదురే నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి ఖగరాజు నీయానతి విని వేగ చనలేడో గగనానికి ఇలకు బహుదూరంబనినాడో జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు వగ జూపకు తాళను నన్నేలుకోరా త్యాగరాజనుత నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గ మ ని ద ప మ గ రి ని స గ మ నగుమోము ని స గ మ ప ని స గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ నగుమోము ని ద ప మ గ రి స ని స గ మ ప గ మ ప ని స మ మ గ గ రి రి స స ని ద ప మ ప ని ద ప మ గ రి రి స గ మ నగుమోము నిస ని ని సా నిస ని ని సా నిస ని ని సా స ని స గ రి ని స గ మ గ మ ప ని స ని స గ మ ప ని స ద ప మ గ రి స ని స గ మ ప ని స గ మ ప ని స గా మ ప ని స గ మా ప ని స గ మ పా గ రి ని స ని ద మ ప గ రి ని స గ మ ప మ గ రి స ని స గ ప మ గ రి స ని స గ మ గ రి స ని స గ మ ప మ గ మ ప ని ప మ ప ని స ని పా ప నీ ని స సా ని సా ని ద ప మ పా ప నీ ని ని స ని ద ప మ పా మ ప స ని ద ప మ గ మ ప ని పా ప మ ప ని స నీ ని ప ని స గ స గ గ గ రి రి రి స స స గ రి స ని ద ప రి రి రి స స స రి స ని ద ప మ గ గ గ గ మ ప ని స గ మ మ గ రి స ప స ని ద ప రి రి స గ మ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగ రాదా శ్రీ రఘువర నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి