Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ananda Bhairavi (1983)




చిత్రం: ఆనంద భైరవి (1983) 
సంగీతం: రమేశ్ నాయుడు 
నటీనటులు: గిరీష్ కర్నాడ్, రాజేష్ , కాంచన
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాతలు: కె. రవిప్రకాష్ , టి. సునీత
విడుదల తేది: 30.11.1983



Songs List:



బ్రహ్మంజలి పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద భైరవి (1983) 
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

బ్రహ్మంజలి





పిలిచిన మురళికి పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద భైరవి (1983) 
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి: 
పిలిచిన మురళికి వలచిన మువ్వకి 
ఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగం 
మురసిన మురళికి మెరిసిన మువ్వకి 
ఎదలో ప్రేమపరాగం మది ఆనందభైరవి రాగం 

చరణం: 1
కులికే మువ్వల అలికిడి వింటే.. కళలే నిద్దురలేచే 
కులికే మువ్వల అలికిడి వింటే.. కళలే నిద్దురలేచే 
మనసే మురళీ ఆలాపనలో.. మధురానగరిగ తోచే 
యమునా నదిలా పొంగినదీ.. స్వరమే వరమై సంగమమై 
మురసిన మురళికి.. మెరిసిన మువ్వకి 
ఎదలో ప్రేమపరాగం.. మది ఆనందభైరవి రాగం 

పిలిచిన మురళికి.. వలచిన మువ్వకి 
ఎదలో ఒకటే రాగం.. అది ఆనందబైరవి రాగం 

చరణం: 2
ఎవరీ గోపిక పదలయ వింటే.. ఎదలో అందియ మ్రోగే 
ఎవరీ గోపిక పదలయ వింటే.. ఎదలో అందియ మ్రోగే 
పదమే పదమై మదిలో వుంటే.. ప్రణయాలాపన సాగే 
హృదయం లయమై పోయినదీ.. లయలే ప్రియమై జీవితమై.. 
మురసిన మురళికి.. మెరిసిన మువ్వకి 
ఎదలో ప్రేమపరాగం.. మది ఆనందభైరవి రాగం 

పిలిచిన మురళికి.. వలచిన మువ్వకి 
ఎదలో ఒకటే రాగం.. అది ఆనందబైరవి రాగం




కొలువైతివా... రంగశాయి పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద భైరవి (1983)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఎస్. పి. బాలు, జానకి

కొలువైతివా... రంగశాయి
హాయి.. కొలువైతివా... రంగశాయి
కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి
కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి

కొలువైతివా... రంగశాయి...

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి
సిరి మదిలో పూచి తరచి రాగము రేపి
చిరునవ్వు విరజాజులేవోయి.. ఏవోయి...
చిరునవ్వు విరజాజులేవోయి.. ఏవోయి...

కొలువైతివా... రంగశాయి..

సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట
సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట
పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి
పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి

కొలువైతివా... రంగశాయి...

ఔరా.. ఔరౌరా...
ఔరా... ఔరౌరా...
రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి
రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి
వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి
సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి
ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి

జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి
జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి
ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ
ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ
శ్రీ రంగ మందిర నవసుందరా పరా
శ్రీ రంగ మందిర నవసుందరా పరా
శ్రీ రంగ మందిర నవసుందరా పరా

కొలువైతివా... రంగశాయి...
హాయి.. కొలువైతివా... రంగశాయి...
కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి
కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి
కొలువైతివా... రంగశాయి





చైత్ర ముకుసుమంజలి.. పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద భైరవి (1983) 
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

పల్లవి:
చైత్ర ముకుసుమంజలి..ఆ..ఆ..చైత్ర ముకుసుమంజలి
పంచమ స్వరముల ప్రౌఢ కోకిలలు
నిసగ సగమ గమ పదనిప మప గా...
పంచమ స్వరముల ప్రౌఢ కోకిలలు
పలికే మరందాల అమృత వర్షిణి
పలికే మరందాల అమృత వర్షిణి...

చైత్ర ముకుసుమంజలి...

చరణం 1:
వేసవి లో అగ్ని పత్రాలు రాసి
విరహిణి నిట్టూర్పు లాకొంత సాగి
గగగా గగనిదమగ సరిగా...
గాగ సాస మాద మదస...
వేసవి లో అగ్ని పత్రాలు రాసి
విరహిణి నిట్టూర్పులా కొంత సాగి
జలద నినాదాల పలుకు మృదంగాల
జలద నినాదాల పలుకు మృదంగాల
బాషుక జలకన్య లా తేలి ఆడి
నర్తనకి కీర్తనకి నాట్య కళా భారతి కి....

చైత్ర ముకుసుమంజలి...
పమగస నిసగమ చైత్ర ముకుసుమంజలి...

చరణం: 2
శయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతు కావేరిలా తీగ సాగి
గగగా గదనిదమగ సరిగా...
గాగ సాస గాగ మాద మదస...
శయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతు కావేరిలా తీగ సాగి
హిమ జల పాతాల సుమ శర బాణాల
హిమ జల పాతాల సుమ శర బాణాల
మరునికి మర్యాదలే చేసి చేసి
సరి ఋతువే సరిగమలౌ నాద సుధా మధువనికి

చైత్ర ముకుసుమంజలి..
పమ గస నిస గమ..
చైత్ర ముకుసుమంజలి...



రా రా రా రాగమై.. పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద భైరవి (1983) 
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

పల్లవి: 
రా రా రా రాగమై... నా నా నా నాదమై... 
సంగీతము నేనై వేణువూదగా... 
నృత్యానివి నీవై ప్రాణదాతగా... 

చరణం: 1 
వెదురునైన నాలో నిదుర లేచిన వాయువై 
ఎదకు పోసిన ఆయువై నా గుండియ 
నీ అందియగా నా గుండియ నీకే అందియగా 
కంకణ నిక్వణ కులుకులు కులుకులు 
కలిత చలిత కళ్యాణిరాగమై 
కదలి రాగదే భైరవి... కదలి రాగదే భైరవి 
నటభైరవి ఆనందభైరవి

చరణం: 2 
వేణువైన నాలో వేసవిగాలుల వెల్లువై 
ఊపిరి పాటకు పల్లవై భగ్నహృదయమే 
గాత్రముగా అగ్నిహోత్రమే నేత్రముగా 
దర్శనమివ్వవే స్పర్శకు అందవే 
దివ్యదీధితులతో దీపకమై 
తరలి రాగదే భైరవి... తరలి రాగదే భైరవి 
నటభైరవి ఆనందభైరవి 

చరణం: 3 
నా హృదయనేత్రి విశ్వాభినేత్రి 
జ్వలన్నేత్ర ధారాగ్ని తప్తకాంచన కమ్రగాత్రి సుగాత్రి 
మద్గాత్ర ముఖ సముద్భూత 
గానాహ్వాన చరణచారణ నాట్యవర్తీ సవిత్రీ 
ఫాలనేత్ర ప్రభూతాగ్నిహోత్రములోన 
పాపసంచయమెల్ల హవ్యమై 
ఆ జన్మతపమునకు ఈ జన్మ జపమునకు గాయత్రివై 
కదలిరావే సాంధ్యదీపమా ఇదే నయన దీపారాధన 
హృదయపూర్వావాహన ఉదయరాగాలాపన 
భైరవి నటభైరవి ఆనందభైరవి రావే... రావే... రావే...




ప్రాణం ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద భైరవి (1983) 
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు , వాణిజయరాం

ప్రాణం  ప్రాణం 




సుడిగాలిలోన పాట సాహిత్యం

 
చిత్రం: ఆనంద భైరవి (1983) 
సంగీతం: రమేశ్ నాయుడు 
సాహిత్యం: వేటూరి 
గానం: 

సుడిగాలిలోన


Most Recent

Default