చిత్రం: అంగరక్షకుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు, చిత్ర
నటీనటులు: రాజశేఖర్ , మీనా , బేబీ షామిలి
దర్శకత్వం: జోషి
నిర్మాతలు: కె. యస్. రామారావు
విడుదల తేది: 1994
ఏదో వింత వలపే చింత
చెప్పలేని మాట కూడ భాదే కదా
నిప్పులాంటి ఈడు కూడా నీరే కదా
అతని జతను వెతికే మనసు చిలిపితనాల
నాలా... నా ఊహలా...
ఏదో వింత తకథై దింత
మంచువేళ మల్లె కూడా మంటే కదా
పైట జారు సోయగాల పంటే కదా
వలపు చిలక వగలు తెలిసె తళుకు మనేలా
ఏలా... ఈ వెన్నెల
ఏదో వింత - తకథై దింత
విరిసే పువ్వు ముసిరే ముద్దు ఎరగనిదీవయసు
అది ప్రేమో మరి ఏమో ఎదలో పులకింత
కలిసే చూపు చెలిలో ఊపు అణువణువు సొగసు
పగలైన రేయైన చలిలో చమరింత
సిగ్గొస్తున్నా చిరాకేస్తున్నా
సరేలెమ్మన్నా షరీఫవుతున్నా
హాయి కదా - ప్రేమకథా
పెదవి లవిగి రుచులు మరుగు నవరస లీలా
నీలా రేగేనిలా
ఏదో వింత - తకథై దింత
కసి నాకళ్ళు పసి నీ ఒళ్ళు కడిగిన కౌగిలిలో
మొదలాయే ఎదలాయే మొదటే మోమాటం
ఇరుచెక్కిళ్ళు చిరుమావిల్లు కొరికే ఆకలిలో
వగరైన పొగరైన ఒకటే ఆరాటం
కొత్తందాలు కొలుస్తా నీకు
మొత్తంగానే ముడేస్తా సోకు
లాహిరిలో - ఊపిరితో
తనువు తనువు తగిలి తపన రేగిలిన వేళా
బాలా... ఈ జోలలా
ఏదో వింత - వలపే చింత
మంచువేళ మల్లె కూడా మంటే కాదా
నిప్పులాంటి ఈడు కూడా నీరే కదా
వలపు చిలక వగలు తెలిసె తళుకు మనేలా
నాలా - ఈ వెన్నెల