Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Bangaru Bullodu (1993)




చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: బాలక్రిష్ణ, రవీణా టండన్, రమ్యకృష్ణ
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 03.09.1993



Songs List:



గుడివాడ గుమ్మరో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు , చిత్ర

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
తడి పొంగులో తస్సాదియ్యా
మడి దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా

అరే గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా

చిరుజల్లు కొట్టిందే చిటపట చిన్నారి 
చలిమంట వెసేయ్యనా
వరదలే పొంగింది వలపంతా ఓరయ్యో ఒడుపెంతో చూసేయ్యనా
అదిరే చలి బంగారు బొమ్మ 
ముదిరే ఇది వన్నెల రెమ్మ
పుడితే కసి గువ్వల చెన్న 
చెడదా మతి ముద్దుల కన్నా
అరే అలటప యవ్వారాలు సాగవే బుల్లెమ్మో
అరే వంపులు దోచే వెచ్చని పక్క వేద్దాం రావమ్మో

హోయ్ గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా

పరువాల పేరంటం హుషారుగ పిల్లోడా 
ఒడిలోన పెట్టేైనా
సరసాల తారంగం తిరకాసు బుచ్చమ్మో 
జలసాగ లాగించనా
పనిలో పని అద్దిరబన్నా 
మొదలై మరీ ఒంటరిగున్నా
పదవే అంటు చమ్మక చలో 
పడతా పని తిగర బుల్లో
తయ్యతక్క ముద్దుల మేళం మోగాలి ఈ పూట
హద్దుల దాటి అల్లరి వేట సాగాలి ఈ చోట

హొయ్ హొయ్... 
గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
యహ యహ యహ యహ
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా
అరే తడి పొంగులో తస్సాదియ్యా
మడి దున్నుకో ఓ బావయ్యో

గుడివాడ గుమ్మరో ఘుమ ఘుమ గుందిరో ముడేసి నే పడేసుకోనా
గుంటూరు గుంటడు యమ యమ గుంన్నాడు మిలేసి నే కలేసుకోనా





ఎన్నెట్లో చాపేసి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు , చిత్ర

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
చలికాలంలో చెలరేగే గరంగరం నరాలలో మంట

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

ఏడురంగుల ఈ వానవిల్లు
చెయ్యి తాకిడికే చెమ్మగిల్లు
చుక్కలేలకు నూ సూదికళ్లు
చూపుకే నడుమే సన్నగిల్లు
పాలలో మీగడెందుకో పైటలో పొంగులందుకే
చల్లలో వెన్నలెందుకో జంటలో వేడి అందుకే
జాజివనం చేరుకుని జానపదం పాడుకుని
ఆడుకునే వయ్యారమే వసంతపు దుకాణమే అంట

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

భామలందరిలో బంతిపువ్వు
చెంగుకోరని చామంతిపువ్వు
దండయాత్రకు దక్కాలి నువ్వు
కౌగిలింతల కట్నాలు ఇవ్వు
ఇంటిలో గుట్టు పెల్లికి దండగే పూలపల్లకి
సోకుతో శోభనాలకి దీపమే అడ్డు రాత్రికి
కోడెతనం కొంగుకసి ఆడతనం పొంగురుచి
కోరుకునే వయస్సులో ఎడాపెడా ఫలించులే పంట

ఎన్నెట్లో చాపేసి ఎన్నిచ్చి కూకుంటా
ఎంకల్లే పాటల్లో కంకేస్తే సోకంటా

ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మొగ్గ ఎంగిలంటుకుంటా
ఊరే నా తేనెముద్దు ఉగ్గు పట్టుకుంటా
ఉంగా ఉంగంటు మెుగ్గ ఎంగిలంటుకుంటా
చలికాలంలో చెలరేగే గరంగరం నరాలలో మంట




తధిగినతొం తధిగినతొం బాలయ్యో పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో, చిత్ర, మినీ మినీ

దితొం దితొం
తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
వినవే అనులమిన్న తగువే వద్దని అన్న 
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్ల జగడం ఎందుకే మళ్ళ 
రాజీ ఉండాలే పిల్లో 
హరిలో హరి సరికి సరి వినవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం

కమ్మంగా కౌగిట్లో కవ్వించేయ్నా
కసిగా ఉయ్యాలో జంపాలో ఊగించేయ్నా
ఒళ్లోని వైకుంఠం చూపించెయ్నా
అదిరే అందాలే అచ్చంగా అందించెయ్నా
రంభా ఊర్వసులే నా సరి రారురా
రతి నా చెలికత్తె ఇటు రారో
ఇక చాలు చాలు ఆగడాలు అమ్మాయో ఓ ఓ ఓ...
నే వేగలేను రాలుగాయి గుమ్మాయో ఓ ఓ ఓ...
హరిలో హరి సరికి సరి పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం

చూశా నీ యవ్వారం వన్నెలాడి 
నిన్ను గోదాట్లో తొక్కేస్తా గిన్నెకోడి
చాలించే గప్పాలు కుర్ర కేడి
మనతో పందేలు వేశావో చిక్కే బాడి
భరతం పడతాను పదవే పోకిరి
దుమ్ము దులిపేస్తా గయ్యాలి
అరె ఆపు ఆపు తందనాలు చామంతి హొ హొ హో...
నే చూడలేనె కొట్టుకుంటే పూబంతి ఓ ఓ ఓ...
హరిలో హరి సరికి సరి పదవే మరీ తతొం దితొం

తధిగినతొం తధిగినతొం బాలయ్యో 
ఇటు రావయ్యో నా చూపే శృంగారం
తకదిమితొం తకదిమితొం బావయ్యో 
ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం
హోయ్ వినవే అనులమిన్న తగువే వద్దని అన్న 
ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో
కనవే తొక్కుడు బిల్ల జగడం ఎందుకే మళ్ళ 
రాజీ ఉండాలే పిల్లో 
హరిలో హరి సరికి సరి వినవే మరీ తతొం దితొం





వానా వానా వచ్చేనంట పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర

(ఈ పాటను అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు (2021)  సినిమాలో రీమిక్స్ చేశారు దానికి సంగీతం సాయి కార్తిక్ అందించారు, పాడిన వారు ఎల్.వి.రేవంత్, నాధప్రియ  )

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా వాగు వంకా మెచ్చేనంటా...

ఓహో... ఓహో...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 1
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమ ఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 2
వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో - యాలో యాల

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగ



మనసు ఆగదు వయసు తగ్గదు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు

అబబ్బ నెమ్మది - మధన మన్మది
వలది నేడదీ... -  హా....

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో  జంటగా చిలక వాలదు

చరణం : 1
ఎద ఉరుకులు పొదలకు ఎరుపట
పొద ఇరుకులు జతలకు చెరుకట
ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ 
తొలివలపులు తొలకరి ఋతువట
చలి పిలుపులు చెలిమికి రుజువట
ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ ఓ 
సొగసరి ఇటు మగసిరి అటు
కలబడినది కసి కాటు...హా
మనసులు ఇటు కలిసినవటు
మనుగడకిది తొలిమాటు
చూపుకు చూపే చుమ్మా
ఊపిరి వెడేకొమ్మా
ముద్దుకు ముద్దె గుమ్మా ముచ్చట నేడే నమ్మా
వయసు లేడిరో - వలపు తాడుతో 
నిలిపి చూడరో - హా...

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో.... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు

చరణం : 2
ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ 
రుచులాడిగెను  పెదవిని పెదవులు 
కోసరడిగెను వలపుల ముడుపులు
ఓ ఓ ఓ ఓ ....ఓ ఓ ఓ ఓ
తనువడిగెను తపనల తనువులు
జతనడిగెను మదనుడి మణువులు
ఓ ఓ ఓ ఓ ....... ఓ ఓ ఓ ఓ 
పులి తగిలిన గిలిరగిలిన శిల 
అడిగెను నీ రూపం  హా....
నిను తగిలిన సొనలిరిగిన వయసడిగెను నీ తాపం
మనసే మల్లెల తోటా పొంగే తేనెల తేట
తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైట
మెరుపు మెడలో
ఉరిమి చూడరో
కరుకు చూపరో  
ఆ.... - హా.....

మనసు ఆగదు వయసు తగ్గదు
ఓలమ్మో... ఒంటిగా నిదుర పట్టదు
మనసు మారదు ఉడుకు తగ్గదు
ఏందమ్మో జంటగా చిలక వాలదు
ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
గిల్లిగిచ్చి కజ్జాలు లవ్లీ లావా దేవీలు

అబబ్బ నెమ్మది - మధన మన్మది
వలది నేడదీ... -  హా.... - అహ హా


Most Recent

Default