చిత్రం: గృహం (2017)
సంగీతం: గిరీష్ .జి
సాహిత్యం: రెహ్మాన్
గానం: డి.సత్యప్రకాశ్ , చిన్మయి శ్రీపద
నటీనటులు: సిద్దార్ధ్ నారాయణ్, అందేరా జేరిమియా
దర్శకత్వం: మిలింద్ రావ్
నిర్మాత: సిద్దార్ధ్ నారాయణ్
విడుదల తేది: 03.11.2017
ఓ మెరుపా... రా జతగా....
కాటుక కన్నే లాగెనే నన్నే
ఊపిరే మొత్తం వశమాయే నీకే
నన్నిలా ముంచి దాహమే పెంచి
ఏరులా నువ్వే వదిలేసి పోకే
నాతోనే నే వేరై పోయేలా తాపం నన్నే తాకిందే
చూస్తూ చూస్తూ ఏమైనదో
కాలం కూడా మాయం అయ్యేలా
దూరం దూరం సాగిందే
ఇంకా ఏమేం కానున్నదో
ఓ మెరుపా... రా జతగా....
కాటుక కన్నే...
నీ గాలికే విత్తనం పువ్వల్లే పూచే
నీ శ్వాసకే పరిమళం గాలాలు వేసే
నీ చూపు నా పసితనపు ఛాయాల్ని ఆపి
ఇది ఏ వయసుకే తొలివలపు పాఠాలు నేర్పే
నిన్నే దాటి వెళ్లే దారే లేదులే
పోరాటాన్ని కోరే ప్రాయం నీదే
ఆత్రం అంతు చూసే మార్గం కౌగిలే
ఆరాటాన్ని తీర్చే సాయం నీవే
ఆపేటి వీలులేని ఆశేదొ పుట్టి
అది నీరల్లే పల్లం వైపు జారిందో
ఆలోచనేది లేని పిచ్చేదో పట్టి
అది మంటల్లే పైకే పాకి నీ పై దూకి
నీ అడుగు మడుగు నవ యవ్వనాన్ని
చిలిపి మలుపు చూపి
నా అడుగు మడుగు సరికొత్త కొత్త
వలపు రుచులు తెలిపే
ఇక పగలు రేయి పరదాలు తీసి కలను నిజం చేసి
ఇరు పెదవి పెదవి ముడిపడిన క్షణము
జగము తలుపు మూసి
నేనే నీకు పంచే ఇష్టం రాగమై
మళ్ళీ మళ్ళీ నిన్నే జతగా కోరి
తేనెల్లోన ముంచి కక్షే యోగమై
కాలం కళ్ళుమూసి ఒడిలో చేరే
చేతల్లో చెయ్యేవేసి పైనుంచి దూకి
నిదురీదాలి సంద్రంలాంటి తాపంలో
దారుల్ని వెతికి వెతికి స్వర్గాన తేలి
నిదురోవాలి అంతేలేని సౌఖ్యం అంచుల్లో
కాటుక కన్నే లాగెనే నన్నే
ఊపిరే మొత్తం వశమాయే నీకే
నన్నిలా ముంచి దాహమే పెంచి
ఏరులా నువ్వే వదిలేసి పోకే
నాతోనే నే వేరై పోయేలా తాపం నన్నే తాకిందే
చూస్తూ చూస్తూ ఏమైనదో
కాలం కూడా మాయం అయ్యేలా
దూరం దూరం సాగిందే
ఇంకా ఏమేం కానున్నదో
ఓ మెరుపా... రా జతగా...
మాటే మరిచినా మౌనం పలికెనే
భారం కరిగిన మేఘం కరిగెనే
కాలం నిలచినా పయనం జరిగెనే
దేహం అలచినా ప్రాణం మెరిసెనే
నీ అడుగు మడుగు నవ యవ్వనాన్ని
చిలిపి మలుపు చూపి
నా అడుగు మడుగు సరికొత్త కొత్త
వలపు రుచులు తెలిపే
ఇక పగలు రేయి పరదాలు తీసి కలను నిజం చేసి
ఇరు పెదవి పెదవి ముడిపడిన క్షణము
జగము మెరిసె ఇక నువ్వు నేనుగా