Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Guduputani (1972)




చిత్రం: గూడుపుఠాణి (1972)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: దాశరథి, కొసరాజు, ఆరుద్ర, అప్పలా చారి 
నటీనటులు: కృష్ణ, శుభ, హలం (నూతన తారలు)
దర్శకత్వం: పి.లక్ష్మీ దీపక్
నిర్మాతలు: పి.బాబ్జి, పి.సాంబశివరావు
విడుదల తేది: 26.05.1972



Songs List:



పగలు రేయి పండుగ పాట సాహిత్యం

 
చిత్రం:  గూడుపుఠాణి (1972)
సంగీతం:  కోదండపాణి
సాహిత్యం: దాశరథి, కొసరాజు, ఆరుద్ర, అప్పలా చారి 
గానం: యస్.పి.బాలు

పగలు రేయి పండుగ



విరివిగా కన్నాలు (పద్యం) సాహిత్యం

 
చిత్రం: గూడుపుఠాణి (1972)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: దాశరథి, కొసరాజు, ఆరుద్ర, అప్పలా చారి 
గానం: యస్.పి.బాలు

విరివిగా కన్నాలు (పద్యం)



ఓ మాయ ముదర ముగ్గిన (పద్యం) సాహిత్యం

 
చిత్రం: గూడుపుఠాణి (1972)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: దాశరథి, కొసరాజు, ఆరుద్ర, అప్పలా చారి 
గానం: యస్.పి.బాలు

ఓ మాయ ముదర ముగ్గిన  (పద్యం)



హ్యాండ్సప్ హ్యాండ్సప్ (పద్యం) సాహిత్యం

 
చిత్రం: గూడుపుఠాణి (1972)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: దాశరథి, కొసరాజు, ఆరుద్ర, అప్పలా చారి 
గానం: యస్.పి.బాలు

హ్యాండ్సప్ హ్యాండ్సప్ (పద్యం)




టైట్ ప్రోగ్రాం నాకున్న టైట్ చూసి (పద్యం) సాహిత్యం

 
చిత్రం: గూడుపుఠాణి (1972)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: దాశరథి, కొసరాజు, ఆరుద్ర, అప్పలా చారి 
గానం: యస్.పి.బాలు

టైట్ ప్రోగ్రాం నాకున్న టైము చూసి 
దున్నపోతుతో చేతువా దొంగ ప్రేమా 
గూడచారిని నేను నీ గుట్టు తెలిసే 
గుచ్చి చంపుద నిన్ను వంకాయ గుత్తోతోడ 




తనివి తీరలేదే పాట సాహిత్యం

 
చిత్రం: గూడుపుఠాణి (1972)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

హు హుం... 
ల ల ల ల ల ల లా 
ల ల ల లా 
ఆ హా హా...
హుం హుం హుం

తనివి తీరలేదే
నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం

తనివి తీరలేదే
నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
చెలియా ఓ చెలియా

ఎన్నో వసంతవేళలలో
వలపుల ఊయలలూగామే
ఎన్నో వసంతవేళలలో
వలపుల ఊయలలూగామే

ఎన్నో పున్నమిరాత్రులలో
వెన్నెల జలకాలాడేమే

అందని అందాల అంచుకే చేరిననూ
అందని అందాల అంచుకే చేరిననూ
విరిసిన పరువాల లోతులే చూసిననూ

తనివి తీరలేదే - ఆఆఅ..ఆఅ
నా మనసు నిండలేదే - ఆఆఆ...
ఏనాటి బంధమీ అనురాగం 

తనివి తీరలేదే 
నా మనసు నిండలేదే 
ఏనాటి బంధమీ అనురాగం
ప్రియతమా.. ఓ ప్రియతమా...

ఎప్పుడు నీవే నాతో ఉంటే
ఎన్ని వసంతాలైతేనేమి
ఎప్పుడు నీవే నాతో ఉంటే
ఎన్ని వసంతాలైతేనేమి
కన్నుల నీవే కనబడుతుంటే
ఎన్ని పున్నమలు వస్తేనేమి

వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ

తనివి తీరలేదే 
నా మనసు నిండలేదే 
ఏనాటి బంధమీ అనురాగం 
హుహుహు హుహుహు హుహుం... 




వెయ్యకు ఓయ్ మావా చెయ్యి వెయ్యకు పాట సాహిత్యం

 
చిత్రం:  గూడుపుఠాణి (1972)
సంగీతం:  కోదండపాణి
సాహిత్యం: దాశరథి, కొసరాజు, ఆరుద్ర, అప్పలా చారి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

వెయ్యకు ఓయ్ మావా చెయ్యి వెయ్యకు




కన్నులైనా తెరవనీ ఓ చిన్ని పాపా.. పాట సాహిత్యం

 
చిత్రం:  గూడుపుఠాణి (1972)
సంగీతం:  కోదండపాణి
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు

పల్లవి :
కన్నులైనా తెరవనీ ఓ చిన్ని పాపా.. స్వాగతం
ఊహలింకా తెలియనీ నా చిట్టీ పాపా.. స్వాగతం
ఈ జగానికి స్వాగతం.. స్వాగతం.. స్వాగతం  

చరణం: 1 
లోకమంతా శాంతి చిందిన లేగులాబీ లేదులే
మానవతకై ప్రాణమిచ్చిన బోసినవ్వే లేదులే
లోకమంతా శాంతి చిందిన లేగులాబీ లేదులే
మానవతకై ప్రాణమిచ్చిన బోసినవ్వే లేదులే

పూల మాదిరి మెరిసిపోయే ముళ్ళ బాటలే మిగిలెనే
నవ్వు చాటున బుసలు కొట్టే నాగుపాములె మిగిలెనే
నేటి లోకం అసలు రూపం నీవు చూసే దెప్పుడో.. నీకు తెలిసే దెన్నడో 

కన్నులైనా తెరవనీ ఓ చిన్నిపాపా స్వాగతం
ఊహలింకా తెలియనీ నా చిట్టీపాపా స్వాగతం
ఈ జగానికి స్వాగతం.. స్వాగతం.. స్వాగతం

చరణం: 2 
జాతి కోసం బలైపోయిన నేత నేడిక లేడులే
జగతిలో మనకీర్తి పెంచిన విశ్వకవి లేడాయెనే
జాతి కోసం బలైపోయిన నేత నేడిక లేడులే
జగతిలో మనకీర్తి పెంచిన విశ్వకవి లేడాయెనే

సొంత లాభం కొరకు దేశం గొంతు నులిమే ధీరులు
మంచి చేసిన వారి ముంచే మనుషులెందరో కలరులే
నేటి లోకం అసలు రూపం నీవు చూసే దెప్పుడో నీకు తెలిసే దెన్నడో 

కన్నులైనా తెరవనీ ఓ చిన్నిపాపా స్వాగతం
ఊహలింకా తెలియనీ నా చిట్టీపాపా స్వాగతం
ఈ జగానికి స్వాగతం.. స్వాగతం.. స్వాగతం 


Most Recent

Default