Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Iddaru Iddare (1976)




చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1976)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ , ఆరుద్ర, డా॥ సి. నారాయణరెడ్డి, దాశరధి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి.రామకృష్ణ, డా॥ బాలమురళీకృష్ణ
నటీనటులు: శోభన్ బాబు, కృష్ణంరాజు, మంజుల, చంద్రకళ 
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాతలు: యస్.వెంకటరత్నం, కె.ముఖర్జీ
విడుదల తేది: 01.01.1976



Songs List:



అమ్లాన పుష్ప సంకీర్ణం (శ్లోకం)పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1976)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యం,బాలమురళీకృష్ణ 

(శ్లోకం)

అమాన పుష్ప సంకీర్ణం
అనంత మథు శోభితం
అశేష ఫల సంపన్నం
సత్కళా ఫల వం భజే




ఒళ్లంత వయ్యారమే పిల్లదాన పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1976)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఒళ్లంత వయ్యారమే పిల్లదాన 
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడ
హరెరెరె ఒళ్లంత వయ్యారమే పిల్లదాన 
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా
అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడ
హ ఊసులాడా అ చోటుకాదు
అ చాటుఉంది అందాలతోటాలోన 
మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే

ఒ ఒ ఒ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన 
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
హ హ హ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడా

పువ్వల్లే నవ్వుతావు కౌవ్వించి కులుకుతావు
కులుకంతా కూరవండి మనసారా తినిపించాలి హా ఓ
రారానీ వేళలోనా రాజల్లేవస్తావూ ఏమేమో చేస్తావురా
అబ్బబ్బబ్బ అందాలవాడలోన అద్దాల మేడలోన ఇద్దరమే ఉందామురా
ఒ ఒ ఒ వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ
ఎవ్వరైన చూస్తారురా వన్నెకాడా

ఓ మనసంతా మాలకట్టి మెడలోనా వేస్తాను
మనువాడే రోజుదాకా ఓ రయ్యో ఆగలేవా ఓ...
అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే
అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే
వయ్యారి నన్నాపకే...
అమ్మమ్మమ్మ చన్నీటివాగుపక్క సంపంగి తోటలోన నీదాననౌతానురా

ఒ ఒ  ఒళ్లంత వయ్యారమే పిల్లదాన 
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడ
హ ఊసులాడా అ చోటుకాదు
అ చాటుఉంది అందాలతోటాలోన 
మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే

ఒ ఒ హొ ఒళ్లంత వయ్యారమే పిల్లదాన 
ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదాన
అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడ
ఎవరైన చూస్తారురా వన్నెకాడ




ముల్లల్లో ఉన్నది ఈ పువ్వు పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1976 )
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి: 
ముళ్ళలో ఉన్నది ఈ పువ్వు
మోజుపడి వచ్చావు నువ్వూ
పంజరంలో పంచెవన్నెల చిలకా
పాడుతుందిలే నువ్వు వచ్చావు గనుక

చరణం: 1
అందం చందం ఆటాపాటల అంగడి అనుకున్నావు
ఆనందాల నవ్వుల పువ్వుల సందడి అనుకున్నావు
చల్లని సమయాన స్వాగతమన్నాను
నీదొక భావము నాదొక భావము
ఆలపించెదను ఆలకించు మిక నా గానము

చరణం: 2
కన్నుల పండుగ చేసే నాట్యం కళగా భావించాలి
కమ్మని గానం విలువను ఎంచి రసికులు స్పందించాలి.
రసికుడు నీవై తే కోరకు సరసాలు
అందరి వంటిది కాదీ చిన్నది రాకు రాకు
ఇటు చేరరాకు నను మన్నించుమా





సలమలేఖుం సలమలేఖుం పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1976 )
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల

పల్లవి: 
సలామాలేకుం సలామాలేకుం
నా ఓరచూపులో కాలిగజ్జెలో లోకమున్నది మీకు
ఈ నిండు కుండలో గుండెలోతులో ఉన్నదేమిటి
చూడలేరు మీరు _ ఆ జాడ తెలియలేరు

చరణం: 1
కన్నెగులాబికి తనతో పుట్టిన ములు లేనిదే రక్షణలేదు
తేనెను తాగివెళ్ళే తేటికి తీయని బంధంలేనేలేదు
అందాన్ని వెలపోసి కొంటారు మీరు
హృదయాన్ని వెలివేసి వచ్చాను నేను
గొంతు జీరలో అంతుదొరకని మంటలున్నవి
నేను కాలిపోతూ పాటపాడుతున్నా

చరణం: 2
రాఖీ పండుగ మీకూ కలదని రక్షాబంధం తెచ్చాను
కటుకునే చేయివున్నదా కలుపుకునే మనసు వున్నదా
వెలపోసి కొనలేని బంధాన్ని కడతా
ఈ ఒక్కరోజేన మీ చెలి నౌతా
ఇన్నినాళ్ళ ఈ చిన్నకోరికను తీర్చుకొందును
అన్నలెవరు లేరా మనసున్నవారు లేరా




గెలిచిందమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1976 )
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వి.రామకృష్ణ 

పల్లవి: 
గెలిచిందమ్మా గెలిచిందమ్మా పేదోళ్ల పేట
ఓడిందమ్మా ఓడిందమ్మా గొప్పోళ్లకోట
రింజంతానానా ఛాంగురెదాదానా
సలికిందమ్మా పలికిందమ్మా పగడాలబొమ్మా
కులికిందమ్మా కులికిందమ్మా పరువాలగుమ్మా

చరణం: 1
బొమ్మంటే బొమ్మకాదు బులిపించే చిలకమ్మా
గుమ్మంటే గుమ్మకాదు గునశాలి గున్నమ్మా
ఈ చిలకమ్మను పట్టుకునే వాడెవడో
ఈ గున్నమ్మను పట్టుకునే వాడెవడో
ఇక్కడే ఎక్కడో వున్నాడు
ఇప్పుడో, ఎప్పుడో గఎరేసుకు పోతాడు .

చరణం: 2
ఎగరేసుకు పోయేవాడు ఏ మాయచేస్తాడో
ఈ అన్న తోడుగ వుంటే ఎవ్వడేమి చేస్తాడు.
చెలియకు ప్రాణాలిస్తాడు ఈ చినవాడు
చెలిమికి ప్రాణంపోస్తాడు ఈ మొనగాడు
ఎవ్వరికీ ఎన్నటికీ లొంగములే
ఇద్దరూ ఇద్దరే తలవంచని సింగాలే



ఆకుమీద ఆకుపెట్టి.. పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1976 )
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాశరధి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఆకు మీద ఆకు పెట్టి.. ఆకులోన సున్నమెట్టి
ఆకు మీద ఆకు పెట్టి.. ఆకులోన సున్నమెట్టి
చిలక చుట్టి తెచ్చానయ్యో చిన్నయ్యో..ఓ..ఓ..
ఒడుపు తెలిసి కొరకాలయ్యో..రాజయ్యో
ఒడుపు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో..హా..

మావిడంచు చీరగట్టి.. మల్లెపూల చెండు పెట్టి
మావిడంచు చీరగట్టి.. మల్లెపూల చెండు పెట్టి
చిలక చుట్టి నోటికిస్తే చిన్నమ్మో..ఓ..
నీ బుగ్గ మీద గంటుపడనే సీతమ్మో...హా..
బుగ్గ మీద గంటుపడనే..సీతమ్మో..హేయ్

ఆకు మీద ఆకుపెట్టి.. 
ఆకులోన సున్నమెట్టి..హా..ఆ

చరణం: 1
తీయతీయటి మావిడిపళ్ళు కోరి నేను ఇస్తంటే..హా..
తీయతీయటి మావిడిపళ్ళు కోరి నేను ఇస్తంటే
కొంగులాగి ఏవేవో కోంటి పనులు చేసేవా? .. 
ఏవయ్యో.. రాజయ్యో
ఏవయ్యో రాజయ్యో.. ఇది నీకు తగదయ్యో...

తీయతీయటి పండువు నువ్వే 
తేనెను మించిన తీపివి నువ్వే..ఆ..హా..ఆ..హా..
హోయ్..తీయతీయటి పండువు నువ్వే 
తేనెను మించిన తీపివి నువ్వే
కొంగు దాచిన పరువాలన్ని 
దొంగిలించుకుపోతానే.. 
ఏవమ్మో..సీతమ్మో
ఏవమ్మో...సీతమ్మో...వదిలేది లేదమ్మో.. 
ఏ..హే.....సీతమ్మో....

ఆకుమీద ఆకుపెట్టి.. ఆకులోన సున్నమెట్టి
చిలకచుట్టి నోటికిస్తే చిన్నమ్మో..ఓ..
నీ బుగ్గ మీద గంటుపడనే సీతమ్మో...హా..
ఒడుపు తెలిసి కొరకాలయ్యో..రాజయ్యో

చరణం: 2 
ఊసులేవో చెపుతానంటే ఆశతోటి చెంతకు వస్తే..ఆ..హ..
ఊసులేవో చెపుతానంటే ఆశతోటి చెంతకు వస్తే
పొద చాటుకు లాగేసీ పోకిరి పనులు చేసేవా.. 
ఏవయ్యో...రాజయ్యో...
ఏవయ్యో రాజయ్యో ఇది నీకు తగదయ్యో...

దోరవయసు కవ్విస్తుంటే ఓర చూపు ఊరిస్తుంటే..
అహా..హా..
దోరవయసు కవ్విస్తుంటే 
ఓర చూపు ఊరిస్తుంటే
ఒళ్ళు మరచి వాటేసుకోనా.. 
చూడని స్వర్గం చూపించేనా
ఏవమ్మో...సీతమ్మో....
ఏవమ్మో...సీతమ్మో..వదిలేది లేదమ్మో..
హే..హే..హే....సీతమ్మో...

ఆకు మీద ఆకుపెట్టి.. ఆకులోన సున్నమెట్టి
ఆకు మీద ఆకుపెట్టి.. ఆకులోన సున్నమెట్టి
చిలక చుట్టి తెచ్చానయ్యో చిన్నయ్యో..ఓ..ఓ..
ఒడుపు తెలిసి కొరకాలయ్యో..రాజయ్యో
ఒడుపు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో..హా..

మావిడంచు చీరగట్టి.. మల్లెపూల చెండు పెట్టి
మావిడంచు చీరగట్టి.. మల్లెపూల చెండు పెట్టి
చిలక చుట్టి నోటికిస్తే చిన్నమ్మో..ఓ..
నీ బుగ్గ మీద గంటుపడనే సీతమ్మో...హా..
బుగ్గ మీద గంటుపడనే..సీతమ్మో..హేయ్




నాగస్వరం మోగుతుందిరా పాట సాహిత్యం

 
చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1976 )
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల

పల్లవి: 
నాగస్వరం మోగుతోందిరా
నాగుబాము ఆడుతోందిరా
వంపు వంపులో వేగమున్నది
మెలిక మెలికలో మృత్యువున్నది

చరణం: 1
ఖచ్చిబోతు కన్నె నాగును
కాటువేసిగానీ పడగ దింపను
కళ్ళలోన వున్నాయి ఎర్రజీరలు
అవి నీ గుండెలో నాటుకునే వాడిచాకులు

చరణం: 2
నిప్పుకొండ రగులుతున్నది
పచ్చినెత్తురే కోరుతున్నది
నీ పాపం నేటితో బదలె నది
ఇక నా సంతమే నెగాలి రా ముందుకు

Most Recent

Default