చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి.వి.రాజు నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రి, వాణిశ్రీ కథ, స్క్రీన్ ప్లే : యన్.టి.రామారావు దర్శకత్వం: డి.యోగానంద్ నిర్మాత: యన్.త్రివిక్రమరావు విడుదల తేది: 21.10.1970
Songs List:
నీ ధర్మం నీ సంఘం పాట సాహిత్యం
చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల నీ ధర్మం నీ సంఘం నీదేశం నువు మరవొద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు సత్యంకోసం సతినే అమ్మిన దెవరు? హరిశ్చంద్రుడు! తండ్రిమాటకై కానలకేగిన దెవరు? శ్రీరామచంద్రుడు! అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా? లక్ష్మన్న! పతియే దైవమని తరించిపోయినదెవరమ్మా? సీతమ్మ! ఆ పుణ్యమూర్తులు చూపినమార్గం అనుసరించుటే ధర్మం అనుసరించుటే నీ ధర్మం నీ ధర్మం మరవొద్దు (జాతిని) చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న! మేడిపండులా మెరిపే సంఘం గుట్టువిప్పెను వేమన్న! వితంతువుల విధివ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి! తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ! ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం! నీవు నిలిచిన ఈ సంఘం నీ సంఘం మరవొద్దు (జాతిని) స్వతంత్ర భారత రధ సారధియై సమరాన దూకె నేతాజీ! సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజీ! గుండుకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి! తెలుగువారికొక రాష్ట్రంకోరి ఆహుతియాయెను అమరజీవి! దేశభక్తులు వెలసినదేశం నీవు పుట్టిన భారతదేశం!! నీవు పుట్టిన ఈ దేశం
చూడుర నాన్న ఈ లోకం పాట సాహిత్యం
చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల చూడర నాన్నా లోకం ఇదేర నాన్నా ఈ లోకం! దగాతో నిండిన మాలోకం చూడర నాన్నా లోకం! చరణం: 1 ఇనస్సెట్టెలో మూల్గుతువుండే కరెన్సికట్టల్లో లేదురలోకం అహర్నిశలు చెమటోడ్చి శ్రమించే కార్మికశక్తి లొ వుందిరలోకం మిలమిల్లాడే ఏడంతస్తుల మేడల్లోనా లేదుర లోకం దిక్కూ మొక్కూలేని అనాధల గుడిసెల్లోనే వుందిరలోకం !! చరణం: 2 రిక్షాలోన రొమ్ము విరుచుకొని కూర్చొనువాడిలో లేదురలోకం రెక్కలు విరుచుక తూలుతు సోలుతు లాగేవాడిలో వుందిరలోకం పండిస్తే పరమాన్నంలాగ మెక్కేవాడిలో లేదురలోకం పల్లెటూళ్లలో నాగలిబట్టే శ్రమజీవుల్లో వుందిరలోకం !! చరణం: 3 మోక్షం పేరిట ముడుపుల గుంజే గురువుల బోధిలొ లేదురలోకం పొట్టకోసమై మావముమ్ముకొను మగువబాధలో వుందిరలోకం సోషలిజం మేం తెస్తామని ఓట్లడిగేవారిలో లేదురలోకం పాలులేక చచ్చిన పసిపాప తల్లి ఏడ్పులో వుందిరలోకం చరణం: 4 పదవిలో వుండి పై కిజూచు ఏ నలుగురిలోనో లేదురలోకం కూటికి కటకటలాడే మెజార్టీ ఓటులో వుందిరలోకం నోళ్లుగొట్టి సంపాదనజేసే ఘనుల అదుపులో లేదురలోకం నిత్యము కండలు కరగదీసికొను కూలీచేతిలో వుందిరలోకం చరణం: 5 ప్లాట్ఫారంపై బల్లలు గుద్దే లెక్చర్లలో లేదు నిజం! నీతికోసమై చచ్చేవాడి బ్రతుకులోననే వుందినిజం! నిజాయితీకి సున్నా చుట్టే ఖజాలలోనే లేదు నిజం మెడసన్నం సీసాలోనుండి బయటపడునురా అసలునిజం! ఇదేరా నాన్నా నిజం నిజం దర్శనానికీ రుణం దేవుడి కళ్యాణానికి రుమం హారతియివ్వను రుసుం తీర్ఘ ప్రసాదాలకు రుసుం సంపాదిస్తే సంపదకు రుసుం ఖాళీయైనా ఖర్చుకు రుసం చావు బతుకులా రెంటికి రుసుం చావుతప్పినా తప్పదు రుసుం సాటి మనుషులను చంపుకుతినేది ఏమిటా యీ లోకం డబ్బు కోసమై గడ్డితినేది ఇదేర నాన్నా మనలోకం
చూడవే చూడు పాట సాహిత్యం
చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల చూడవే చూడు చూడవే ఓ యమ్మా! ఓ ముద్దులగుమ్మా చూడవేచూడు చూడవే ఓ యమ్మా! పాలబుగ్గలదాన పసిమి నిగ్గులదాన చిరుగాలికే కందు చిగురాకువంటిదాన ఒంటరిగా నేనుంట జూసీ—అవ్వ!! మునిపంటనొక్కు యీ కొంటెగానిపని తుంటరియై పడకింట దూరీ జుంటితే నెలిమ్మని పెదవిని సిగపువ్వులువాడె చెక్కిలికింపారె చిరుచెమటలు గ్రమ్మె చీర జారె కన్నియ మనసే కవ్వించీ హాయి పులకింతలలో అలరించి ఇంతలోనె ఎంతటి వింతల తేలించిన తెంపరికోడెగానిపని
నిద్దుర పోరా సామీ పాట సాహిత్యం
చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, జానకి పల్లవి: నిద్దుర పోరా సామీ నిద్దుర పోరా సామీ నా ముద్దూ మురిపాల సామీ... చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక.. నిద్దుర పోరా సామీ... చరణం: 1 మాయదారీ మల్లెమెుగ్గలూ మత్తు జల్లుతాయేమెూ జిత్తులమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమెూ మాయదారీ మల్లెమెుగ్గలూ మత్తు జల్లుతాయేమెూ జిత్తులమారి చుక్కలు నిన్ను ఎత్తుకుపోతాయేమెూ హోయ్ చందుర్రూనీ.. సూపుతగిలి కందిపోతావేమెూ హోయ్ చందుర్రూనీ.. సూపుతగిలి కందిపోతావేమెూ ఈ సిన్నదానీ సెంగుమాటున మెూము దాచి ఆదమరచి నిద్దుర పోరా సామీ నా ముద్దూ మురిపాల సామీ చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక నిద్దుర పోరా సామీ... చరణం: 2 గుండెనిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే కన్నె సిగ్గులే మల్లెమెుగ్గలై కన్నుగీటీ కవ్విస్తుంటే గుండెనిండా నువ్వే నిండి గుసగుసలే పెడుతుంటే కన్నె సిగ్గులే మల్లెమెుగ్గలై కన్నుగీటీ కవ్విస్తుంటే పండువెన్నెలా పాల నురుగుల పానుపేసీ పిలుస్తుంటే పడుచుదనమే పిల్లగాలికి పడగెత్తీ ఆడుతుంటే నిద్దుర పోనా పిల్లా ఆ.. నిద్దుర పోనా పిల్లా నా ముద్దూ మురిపాల పిల్లా చలిరాతిరి తీరేదాకా తెలతెలవారే దాక నిద్దురపోనా పిల్లా...
అంతా తెలిసి వచ్చానే పాట సాహిత్యం
చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఘంటసాల, జానకి అంతా తెలిసివచ్చానే నీ అంతేచూసిపోతానే ఏయ్! లోగుట్టు పెరుమాళ్ల కెరుకలే నీ గుట్టు మరి నా కెరుకలే నిషాలెన్నో చూపిస్తాను నీ నసీబునే మార్చేస్తాను మజాలోన ముంచేస్తాను నడిబజారులో ఆడిస్తాను నూరు గొడ్లను తిన్న రాబందు గాలివానకే గోయిందా గడప ఎక్కిన ఘరాన బాబుల గరీబులను చేసేశావు కొంపలార్పిన కులుకులాడివి కోరి నా చేతపడ్డావు నీకుతగిన మొనగాణ్ణి నేను నీ దుమ్ముదులపందే వొదిలిపోనులే దివాళతీసిన సుబ్బిసెట్టిలా దేబెమొహం వేస్తావేం భాయీ! మందిసొమ్ముకు ఒకరనియేమిటి! మన ఆనందం మనదేనోయ్ కొత్తవాడివా? అందర్ ఆవ్! పాతవాడివా? బహర్ జావ్!
ఏమ్మోగుడివి నువ్వేమ్మోగుడివి పాట సాహిత్యం
చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్ ఈశ్వరి అమ్మమ్మమ్మ! అవ్వవ్వవ్వ ఏం మొగుడివి నువ్వేం మొగుడివీ వీటూగోటూ లేని నాటు సరుకువీ శుద్ధ నాటుసరుకువీ! క్రూకటింగు క్రాపులేదు గొట్టాము ప్యాంటులేదు ఈవెనింగు షైరులేదు సినిమాల మోజాలేదు ఛాదస్తం మొగుడివి చెప్పుకోను ఏముంది! మంగళగిరి గోపురంలా నెత్తి మీద పిలకుంది (అమ్మమ్మ) అమ్మమ్మమ్మ గొట్టాంప్యాంటు కూచుంటే పుర్రూ ఎండలోన క్రూకటింగు మాడంతా చుర్రూ మాయల ఫకీరు ప్రాణమూ చిలుకలోనె వున్నదీ మానాన్న ప్రాణమూ నా పిలకలోనె వున్నది ఎందుకు నీ వెటకారం పెడదాం పద సంసారం ఆరునూరు చెప్పినగాని మారదు మా వ్యవహారం!! డ్రాయింగు హాలులేదు డ్రెస్సింగు రూములేదు డైనింగు టేబుల్లేదు స్ప్రింగు కాటులేనేలేదు నీలాంటి ఓల్డు మాడల్ కాపురమ్ము ఘోరం! ఘోరం! వట్టి మొద్దు అవతారం కట్టుకున్న అలికి భారం (అమ్మ)
వంట ఇంటి ప్రభువులం పాట సాహిత్యం
చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు, రాఘవన్ వంటయింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం అన్నం మీదే అయినా వడ్డించే దాతలం నవనాగరికం యిప్పుడు ముదిరిపోయింది ఆడాళ్లకు వంటపని మోటయ్యిందీ వంటవాళ్లు పెస్టేజీ పెరిగిపోయిందీ మనం వండితే గాసం లేకపోతే ఉపవాసం మొగుడికి వుడకెయ్యడమే వెగటయ్యిందీ బిడ్డకు వడ్డించడమే అరుదయ్యిందీ పేరుకు వరుసలేగాని అపేక్షన్నదేలేదు మనం పెట్టినది భిక్షా అదియే శ్రీరామ రక్షా అధికారం చలాయించి అదరగొట్టు మంత్రులైన దేశవాళి నాయకులు దివాన్ బహద్దర్ నా ఆకలి కరకరలాడుతు ఆకుముందు కూర్చుంటే తినేవాళ్ల చెయికిందా పెట్టే మా చెయిపైనా
క్లబ్బంటే పాట సాహిత్యం
చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: కొసరాజు గానం: ఘంటసాల క్లబ్బంటే ఎందరికో బలే మోజూ ఈ జబ్బులేనివాళ్లు లేరు యీ రోజూ పేరుకు ఫైనార్ట్సుక్లబ్బు పైకి కల్చరల్ క్లబ్బు అబ్బెబ్బే చూస్తుంటే లోపల అంతాగబ్బూ (క్లబ్బంటే) పనికి దొంగలై తిరిగే సోంబేరులూ పేకాటే వృత్తియైన పెద్ద మనుషులూ వెళ్లేటప్పుడు హుషారూ వచ్చేటప్పుడు బేజారూ ఉన్నది క్షవరంచేసుక ముసుగేసుక పోతారూ (క్లబ్బంటే) పసికందులు పాలులేక గిలగిల్లాడుతువుంటే సంసారం గడపలేక పెళ్లా మేడుస్తుంటే నిషాలోన మునిగిపోయి ఖుషీలోన తేలిపోయి అమ్మాయిల పక్కన జలసాలు చేస్తూ వుంటారు (క్లబ్బంటే) సొసైటీకి యీ జాడ్యం ఫ్యాషనయ్యిందీ లేడిసులొగూడ ఇదీ పాకిపోయిందీ బస్తీలను ముంచిందీ పల్లెలకూ సోకింది తప్పనువాడూ లేడు చెప్పిన వినువాడూలేడు (క్లబ్బంటే)
ఓం సచ్చిదానంద పాట సాహిత్యం
చిత్రం: కోడలు దిద్దిన కాపురం (1970) సంగీతం: టి. వి. రాజు సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది , పిఠాపురం ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద సత్తులొ ఉన్నది యావత్తు చిత్తులొ ఉన్నది గమ్మత్తూ సత్తూ చిత్తని బోధలు చేస్తూ చెయ్యాలె లోక మరమ్మత్తూ (ఓం) తీర్ణంలోనే ఉన్నది కిటుకూ తీర్థం లేనిదె వ్యర్థంబ్రతుకూ ఈ పరమార్థం తెలిసినవారికి బొందితోనే కైలాసం దొరుకు (ఓం) నమ్మినవారికి ఫలముందీ నమ్మకపోతే ఏముందీ! నమ్మీనమ్మని మూఢజనులకూ మోక్షం దూరంగావుందీ (ఓం) ఆత్మలోవున్నది జీవాత్మ జీవాత్మలోవున్నది పరమాత్మ అంతు తెలియని అయోమయం-ఇష్ అదే అదే బ్రహ్మానందం