చిత్రం: మనీ (1993)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సత్యం, సిరివెన్నెల, శ్రీ
నటీనటులు: జె. డి.చక్రవర్తి, చిన్నా, జయసుధ
దర్శకత్వం: శివ నాగేశ్వరరావు
నిర్మాత: రామ్ గోపాల్ వర్మ
విడుదల తేది: 10.06.1993
వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసు
వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసు
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్య రా నీవే రా ముందు డేసు
అమితాబచ్చను కన్నా ఏం తక్కువ నువ్వైనా
హాలీవుడ్ లో అయినా ఎవరెక్కువ నీకన్నా
ఫైటూ ఫీటూ ఆటా పాటా రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించి సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా
బాలయ్య వెంకటేషు నాగార్జునా నరేషూ
రాజేంద్రుడూ సురేషూ రాజశేఖరు అదర్సూ
మొత్తంగా అందరూ అయిపోవాలోయ్ మటాషూ
గూండా రౌడీ దాదా అంటారే బయటుంటే
ఇక్కడ చేసే పన్లే సినిమాల్లో చూపిస్తే
ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే
నువ్వుంటే చాల్లే అంటారు కధెందుకు పోన్లే అంటారు
కటౌట్లూ గట్రా కడతారు టికట్లకు కొట్టుకు చస్తారు
బావుంది కానీ ప్లాను పల్టీ కొట్టిందో ఏమి గాను
బేకారీ బాత్ మాను జర గారు తగ్గించు ఖాను
అరె చుప్ హో శకున పక్షి లా తగులుకోకు ముందు
******** ******** ********
చిత్రం: మనీ (1993)
సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
పచ్చ నోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టటానికీ పాడె కట్టటానికి మద్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మరీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బునే లబుడబ్బనే గుండెల్లో పెట్టుకొరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రి నీకు వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలెంట్లి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకి
అప్పుకే కదా బ్రదర్ ప్రతి పూటకీ
రోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలే
సొమ్మునే శరనమ్మనే చరనమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా
చక్రవర్తికీ వీధీ బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా
డ్రీమించుకోవచ్చు ధీమాగ డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది బ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీ
చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికుల్లెవరికీ
జీవితం ప్రతి నిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా